ETV Bharat / state

ఒక మహిళను ఎలాంటి మాటలైనా అంటారా?: వైఎస్​ షర్మిల

author img

By

Published : Feb 19, 2023, 3:51 PM IST

Updated : Feb 19, 2023, 3:57 PM IST

YS Sharmila Will Meet Governor: మహబూబాబాద్​ నియోజకవర్గంలో తన పాదయాత్రను అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేశారని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై జరిగిన దాడి గురించి గవర్నర్​ని కలవనున్నట్లు షర్మిల తెలిపారు. అసభ్య పదజాలం వాడడం వల్లే తాను స్పందించాల్సి వచ్చిందన్నారు.

YS Sharmila Will Meet Governor
YS Sharmila Will Meet Governor

ఒక మహిళను ఎలాంటి మాటలైనా అంటారా?: షర్మిల

YS Sharmila Will Meet Governor: మహబూబాబాద్ నియోజకవర్గంలో 3,500కిమీ దాటిన తర్వాత తన పాదయాత్రను అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేశారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ పట్టణంలో మళ్లీ అదే విధంగా బెదిరించడం లాండ్ ఆర్డర్ సమస్యలు సృష్టించారన్నారు. తన ఎస్కార్ట్ వాహనం, అంబులెన్స్​పై బీఆర్ఎస్ నేతలు దాడి చేశారని మండిపడ్డారు.

లోటస్ పాండ్​లో జరిగిన విలేకరుల సమావేశంలో వైఎస్ షర్మిల మాట్లాడారు. తనపై జరిగిన దాడి అంశంపై గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను కలవనున్నట్లు షర్మిల పేర్కొన్నారు. ఎమ్మెల్యే శంకర్​ నాయక్‌ ఆగడాలంటూ అతనికి సంబంధించిన వీడియోను ప్రదర్శించారు. 2,170 ఎకరాల ప్రభుత్వ భూములు ఉంటే.. శంకర్ నాయక్‌ 2,100 ఎకరాలను కబ్జా చేశారని ఆరోపించారు.

శంకర్​ నాయక్ చేసేదే మాఫియా, కబ్జాలు.. ఆఖరుకు జర్నలిస్టులను కూడా మోసం చేశారని మండిపడ్డారు. ఆయన అసభ్య పదజాలం వాడడం వల్లే తాను స్పందించాల్సి వచ్చిందని షర్మిల స్పష్టం చేశారు. పాలక పక్ష నేతలే దూషిస్తున్నారని దాడులు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఒక మహిళను ఎలాంటి మాటలైనా అంటారా అని షర్మిల ప్రశ్నించారు. ఆడవాళ్లు మాట్లాడకూడదా, ప్రశ్నించకూడదా అని మండిపడ్డారు రాష్ట్రంలో మహిళలకు గౌరవం లేదని, మహిళలందరూ ఏకమయి సీఎం కేసీఆర్‌ను ఓడించాలని సూచించారు.

'2,170 ఎకరాల ప్రభుత్వ భూములు ఉంటే.. 2,100 ఎకరాలు కబ్జా చేశారు. ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ వేల ఎకరాలు భూకబ్జాలు చేస్తున్నారు. ఆయన మాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. నన్ను వాళ్లు తీవ్ర అసభ్యపదజాలంతో తిట్టారు. ఒక మహిళను ఎలాంటి మాటలైనా అంటారా. ఆడవాళ్లు మాట్లాడకూడదా.. ఆడవాళ్లు ప్రశ్నించకూడదా. నా ఎస్కార్ట్ వాహనం, అంబులెన్స్‌పై బీఆర్ఎస్ శ్రేణులు దాడి చేశారు'. -వైఎస్ షర్మిల, వైఎస్ఆర్​టీపీ అధ్యక్షురాలు

అసలేం జరిగిందంటే: షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా శనివారం సాయంత్రం మహబూబాబాద్‌లో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన షర్మిల ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ భూ కబ్జాలు, దందాలకు పాల్పడుతున్నారంటూ పరుష పదజాలంతో తిట్టారని బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపించారు. ఈ మేరకు ఆ పార్టీ మండల కార్యనిర్వాహక అధ్యక్షుడు లూనావత్‌ అశోక్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టడంతో ఆమెపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ క్రమంలోనే పోలీసులు నేడు షర్మిలను అరెస్ట్‌ చేసి హైదరాబాద్‌కు తరలించారు.

ఇవీ చదవండి:

Last Updated : Feb 19, 2023, 3:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.