ETV Bharat / state

Rythu Runamafi Telangana 2023 : అన్నదాతలకు పంద్రాగస్టు కానుక.. రూ.99,999 లోపు రైతు రుణాలన్నీ మాఫీ

author img

By

Published : Aug 15, 2023, 9:14 AM IST

Rythu Runamafi Telangana 2023 : రైతు రుణమాఫీ పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్షలోపు అప్పులన్నింటికీ చెల్లింపులను పూర్తి చేసింది. నిన్న ఒక్కరోజే.. 9,02,843 మంది రైతులకు చెందిన రూ.5,809 కోట్ల రుణాలను మాఫీ చేసింది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రుణమాఫీ నిధుల విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్​ కీలక నిర్ణయం తీసుకొని అమలు చేశారు. రాష్ట్ర రైతులకు ఇచ్చిన మాటను, ఎన్నికల హామీని సీఎం నిలబెట్టుకున్నారంటూ మంత్రులు హర్షం వ్యక్తం చేశారు.

Rythu Runa Mafi
Rythu Runa Mafi In Telangana 2023

Rythu Runamafi Telangana 2023 : అన్నదాతలకు పంద్రాగస్టు కానుక.. రూ.99,999 లోపు రైతు రుణాలన్నీ మాఫీ

Rythu Runamafi Telangana 2023 : రైతు రుణమాఫీ ప్రక్రియలో భాగంగా రూ.99,999లోపు ఉన్న రుణాల మాఫీ కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రుణమాఫీ నిధుల విషయమై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకొని అమలు చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు రైతుల రుణ ఖాతాల్లో జమకు నిధులు విడుదల చేశారు. సోమవారం రూ.5,809.78 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 9,02,843 మంది రైతుల ఖాతాలకు రూ.5,809.78 కోట్లు బదిలీ చేశారు. తాజా నిర్ణయంతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 16,66,899 మంది రైతులకు రుణాలు మాఫీ కానున్నాయి.

2014లో తొలి విడతగా రుణమాఫీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. రెండో విడతగా రూ.లక్షలోపు పంట రుణాలు మాఫీ(Rythu Runa Mafi Telangana) చేస్తామని 2018 ఎన్నికల సమయంలో కేసీఆర్​ ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆ ఏడాది డిసెంబరు 11 నాటికి ఉన్న రూ.లక్ష పంట రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించారు. అందుకు ఆర్థిక శాఖ, వ్యవసాయ అధికారులు బ్యాంకుల ద్వారా వివరాలు సేకరించినా.. ఆ తర్వాత పెద్దనోట్ల రద్దు, కరోనా, ఇతర ఇబ్బందులతో ఆర్థిక వ్యవస్థ ఒడిదొడుకులకులోనై నిధుల కొరత ఏర్పడింది.

'మేం అధికారంలోకి వస్తే.. రైతులకు 30 రోజుల్లోనే రూ.2లక్షలు రుణమాఫీ'

Farmer loan waiver in Telangana : 2021లో ప్రభుత్వం రూ.37 వేల వరకు రుణాలున్న 7,19,488 మంది రైతులకు రూ.1,943 కోట్లను బ్యాంకులకు చెల్లించింది. మరోసారి రుణమాఫీ ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం ఈ నెల 2వ తేదీన నిర్ణయించింది. దీనికి సెప్టెంబరు 15 వరకు గడువు విధించింది. ఇందుకు అనుగుణంగా రూ.18 వేల కోట్ల నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. దాని ప్రకారం ఈ నెల మూడో తేదీన రూ.41 వేలలోపు రుణాలున్న 62,758 మంది రైతులకు రూ.237.85 కోట్లు విడుదలయ్యాయి. 4వ తేదీన రూ.43 వేలలోపు రుణాలున్న 31,339 మంది రైతులకు సంబంధించి రూ.126.50 కోట్లు బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయి.

తాజాగా స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రూ.43 వేల నుంచి రూ.99,999 వరకు ఉన్న రుణాలకు నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖను సీఎం కేసీఆర్‌ ఆదేశించగా.. వెంటనే బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 16,66,899 మంది రైతులకు సంబంధించి రూ.7,753 కోట్ల రుణాలు మాఫీ అయ్యాయి. రైతు రుణమాఫీకి రూ.18 వేల కోట్ల విడుదలకు ఉత్తర్వులు జారీ కాగా.. ఇప్పటి వరకు రూ.7,753.43 కోట్లు విడుదలయ్యాయి. రూ.లక్ష దాటి రుణాలున్న వారికి రూ.లక్ష మాఫీ కోసం మరో రూ.10 వేల కోట్లకు పైగా నిధులు విడుదల కావాల్సి ఉంది.

Palla Rajeswar Reddy Latest News : 'ఆర్థిక పరిస్థితుల వల్లే రుణమాఫీ ఆలస్యం'

Telangana Govt Waived Off Loans Under 1 Lakh : సీఎం కేసీఆర్‌ రైతులకిచ్చిన హామీ మేరకు.. రూ.లక్షలోపు వ్యవసాయ రుణాలు మాఫీ చేయడంపై మంత్రులు కేటీఆర్​, హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మానవీయ పాలనలో రైతన్నకు మరో గొప్ప వరమని.. మంత్రి కేటీఆర్‌ ట్విటర్​(ప్రస్తుతం ఎక్స్​) వేదికగా కొనియాడారు. మన దేశంలో వరుసగా రెండోసారి ఇంత పెద్ద ఎత్తున రైతు రుణాలను మాఫీ చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని తెలిపారు. ఒకే రోజు తొమ్మిది లక్షలకు పైగా రైతుల ఖాతాలకు.. రూ.5,809 కోట్లు ఖజానా ద్వారా చెల్లింపులు చేసి తెలంగాణ రాష్ట్రం రికార్డు నెలకొల్పిందని.. మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్‌ చేసిన హరీశ్‌రావు.. కేంద్రం ఎన్ని ఆర్థిక అవరోధాలు సృష్టించినా, కరోనా వంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా.. రైతు సంక్షేమం విషయంలో సీఎం ఏనాడూ రాజీ పడలేదని స్పష్టం చేశారు.

Rythu Runamafi 2023 : రూ. లక్షలోపు రుణమాఫీ పూర్తి చేసిన ప్రభుత్వం

రాష్ర బడ్జెట్‌లో రైతు రుణమాఫీ కోసం రూ.6385 కోట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.