ETV Bharat / state

Dosapati Ramu: కష్టం తీర్చిన ఫోన్ కాల్... అండగా నిలిచిన దాత

author img

By

Published : Jul 1, 2021, 8:22 PM IST

ఓ సోదరుడి కష్టం చూడలేక తమ్ముడు చేసిన ఓ ఫోన్ కాల్ ఆ కుటుంబ కష్టాలను తీర్చింది. హైదరాబాద్‌ మెహదీపట్నం ప్రాంతానికి చెందిన ఓ కుర్రాడి కష్టాన్ని తెలుసుకున్న రైస్​ ఏటీఎం నిర్వాహకుడు దోసపాటి రాము.. సైకిల్​ కొనిచ్చాడు.

rice atm help
rice atm help

హైదరాబాద్​ మెహదీపట్నం ప్రాంతానికి చెందిన కృష్ణ ఉదయాన్నే పాల పాకెట్లు, పేపర్లు విక్రయించుకుంటూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నాడు. కాలినడకన చాలా ప్రాంతాలకు వెళ్లాల్సి రావడం వల్ల ఆలస్యమై వినియోగదారులతో చివాట్లు తినేవాడు. గమనించిన అతడి తమ్ముడు కార్తీక్... అన్న కష్టాన్ని తీర్చాలనుకున్నాడు.

ఈటీవీలో ప్రసారమైన కథనాన్ని చూసి... రైస్ ఏటీఎం నిర్వాహకుడు దోసపాటి రాముకి ఫోన్​ చేశాడు. తన సోదరుడి కష్టాన్ని కార్తీక్​ వివరించాడు. వెంటనే స్పందించిన దోసపాటి రాము... కృష్ణకు సైకిల్ కొనిస్తానని మాటిచ్చాడు. సెకండ్ హ్యాండ్ సైకిల్ కొనిస్తే చాలని రామును కోరాడు. కానీ కృష్ణ చెప్పిన విషయాలు నచ్చి హుటాహుటినా ఓ సైకిల్ దుకాణానికి వెళ్లి కొత్త సైకిల్ కొనుగోలు చేశాడు.

అన్నదమ్ములిద్దరికి దోసపాటి ఫోన్ చేసి వారికి అబిడ్స్‌లో సైకిల్‌ ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. దీంతో కార్తిక్, కృష్ణ కుటుంబాల్లో సంతోషం నెలకొంది. కొత్త సైకిల్ చేతికందడంతో అన్నదమ్ములిద్దరూ మురిసిపోయారు. సకాలంలో వినియోగదారులకు పాల పాకెట్లు, పేపరు పంచి.. కుటుంబానికి ఆసరాగా ఉంటామని చెబుతున్నారు.

అన్నకు నడక భారాన్ని తప్పించిన సోదరుడు

ఇదీ చూడండి: Dog kidnap: నిజామాబాద్​లో కుక్క అపహరణ.. పీఎస్​లో ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.