ETV Bharat / state

రైతుబంధు నిధుల విడుదలతో కేసీఆర్, మోదీ బంధం బయటపడింది : రేవంత్ రెడ్డి

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 25, 2023, 2:39 PM IST

Revanth Reddy on Rythu Bandhu Funds : రైతు బంధు నిధులకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. బీఆర్ఎస్, బీజేపీ ఫెవికాల్ సంబంధం బయటపడిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి అన్నారు. ఎన్నికలకు మూడు రోజుల ముందు రైతుబంధు డబ్బులు విడుదల చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. మోదీ కేసీఆర్​ను ఎంత పైకి లేపినా.. తెలంగాణలో ఆయన ఓటమి ఖాయమని వ్యాఖ్యానించారు.

Revanth Reddy on Raithu Bandhu Amount
PCC Chief Revanth Reddy Fires on BRS And BJP Party

రైతుబంధు నిధుల విడుదలతో కేసీఆర్, మోదీ బంధం బయటపడింది : రేవంత్ రెడ్డి

Revanth Reddy on Rythu Bandhu Funds : రైతు బంధు నిధుల విడుదలతో సీఎం కేసీఆర్.. మోదీ ఫెవికాల్ బంధం మరోసారి బయటపడిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. 2018లో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో రైతుబంధు పతకం ప్రారంభించారని.. అప్పుడు కూడా షెడ్యూల్ వచ్చాక పథకం నిధులు విడుదల చేశారని అన్నారు. క్రితంసారి ఎన్నికల్లో ప్రజలను రైతు బంధు సొమ్ముతో ప్రభావితం చేశారని విశ్లేషకులు చెప్పారని గుర్తుచేశారు. రైతు బంధు నిధుల విడుదల, వివేక్, పొంగులేటి ఇళ్లలో.. ఐటీ దాడులు, గోయల్ ఇంట్లో రూ.300 కోట్లను సీజ్ చేయకపోవడం, కాంగ్రెస్ నాయకులపై లాఠీఛార్జ్ చేయడం అన్నీ ప్లాన్ ప్రకారమే చేస్తున్నారని విమర్శించారు.

అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్‌ అగ్రనేతల ప్రచారం - నేడు రాష్ట్రానికి రానున్న రాహుల్ గాంధీ

'2023 ఎన్నికల నేపథ్యంలో నవంబర్ 15లోగా రైతుబంధు వేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశాం. రాష్ట్ర ప్రభుత్వం పథకాన్ని దుర్వినియోగం చేయకుండా చూడాలని కోరాం. కానీ పోలింగ్ నాలుగు రోజులు ఉండగా రైతుబంధు విడుదలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా బీఆర్ఎస్​కు సహకరించింది. దీంతో బీజేపీ, బీఆర్ఎస్ ఫెవికాల్ బంధం మరోసారి బయటపడింది. ఎన్నికల ముందు రైతుబంధు వేయడంతో రైతులకు రూ.5వేలు నష్టం జరుగుతోంది.' అని రేవంత్​రెడ్డి అన్నారు.

Revanth Reddy on Raithu Bandhu Amount : కౌలు రైతులు, రైతు కూలీలుగా పూర్తిగా నష్టపోతున్నారని రేవంత్ మండిపడ్డారు. బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చే రైతుబంధుతో రైతులు ప్రలోభాలకు గురికావొద్దని సూచించారు. రైతులు ఆందోళన చెందొద్దని.. కేసీఆర్ ఇచ్చేవి తీసుకోమన్న ఆయన.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులకు ఇచ్చేవి ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ సొమ్ముతో ప్రజల ఓట్లు కొనడానికి కేసీఆర్ చూస్తున్నారని ఆరోపించారు. 2018లో జరిగిన ఎన్నికల్లో లాగానే ఇప్పుడు కూడా ఓట్లు దండుకోవాలని యోచిస్తున్నారని మండిపడ్డారు.

రాష్ట్రంలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్న కాంగ్రెస్​ - రంగంలోకి దిగుతున్న అగ్రనేతలు

"ఎన్ని కుట్రలు చేసినా.. మోదీ జేసీబీలు పెట్టి లేపినా బీఆర్ఎస్ ఓటమి ఖాయం. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతు భరోసాను పూర్తిగా అమలు చేస్తుంది. వివేక్ బీజేపీలో ఉండగా రాముడికి పర్యాయపదంగా ఆయన్ను చూపించారు. కానీ కాంగ్రెస్​లో చేరాక బీజేపీకి ఆయన రావణాసురుడిగా కనిపించారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి అంతర్జాతీయ ఆర్థిక ఉగ్రవాదిగా చిత్రీకరిస్తున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బంధువైన పాపానికి రఘురామ్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టారు. బంధుత్వం కూడా బీఆర్ఎస్ దృష్టిలో నేరంగా కనిపిస్తోంది." - రేవంత్​రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

బీజేపీ, బీఆర్ఎస్ ఒప్పందం చేసుకొని రఘురామ్, సురేందర్ రెడ్డిలను టార్గెట్ చేశారని ఆరోపించారు. ఏకే గోయల్ ఇంట్లో వెయ్యి కోట్లు పంపిణీ జరిగిందని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని విమర్శించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ ​రాజ్​ కాంగ్రెస్ నేతలు ఫోన్లు చేస్తున్నా ఎత్తడం లేదని ఆరోపించారు. ఈడీలు, ఐటీలు కేవలం కాంగ్రెస్​పైనే పని చేస్తాయా అంటూ ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ చేస్తున్న ప్రసంగాలకు.. తతంగాలకు పోలిక లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.

కేసీఆర్ లక్కీ నంబర్ ప్రకారం - తన మనవడికి ఆరో పదవి ఇవ్వాలని భావిస్తున్నారు : రేవంత్​ రెడ్డి

'డబ్బు సంచులతో కేసీఆర్ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు. ఓటుకు పదివేలు ఇచ్చి కేసీఆర్ గెలవాలని చూస్తున్నారు.. నగదు బదిలీ పథకం మొదలైంది. బీఆర్ఎస్ ఓట్ల కొనుగోలుకు బీజేపీ సంపూర్ణంగా సహకరిస్తుంది. జరుగుతున్న పరిణామాలను గమనించి తెలంగాణ ప్రజలు విచక్షణతో ఓటు వేయండి. కేసీఆర్ ప్రజాదర్బార్ పెడతాడో, జనతా బార్ పెడతాడో వాళ్ళకే తెలియాలి. వైన్ షాపులు, బెల్ట్ షాపులు పెట్టి ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్న ఘనత కూడా కేసీఆర్​కే దక్కుతుంది.' అని రేవంత్​రెడ్డి వ్యాఖ్యానించారు.

పార్టీ ఫిరాయించిన 12 మందికి - ఈ ఎన్నికల్లో కార్యకర్తలు బుద్ధి చెప్పాలి : రేవంత్​ రెడ్డి

అధికారంలోకి వచ్చాక జవహర్​నగర్ డంప్ యార్డ్ సమస్యను పరిష్కరిస్తా : వజ్రేష్ యాదవ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.