ETV Bharat / state

Revanth reddy Comments On KTR Delhi Tour : 'కేసీఆర్​ కుర్చీ కదులుతుందనే భయంతో.. కేటీఆర్​ దిల్లీలో గల్లీ ప్రదక్షిణలు'

author img

By

Published : Jun 25, 2023, 3:49 PM IST

Revanth Reddy
Revanth Reddy

Revanth Reddy Fire On CM KCR : రాష్ట్ర ఆవిర్భవించిన పదేళ్ల కాలంలో కేసీఆర్​ తెలంగాణను సర్వస్వం దోచుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్​ కుర్చీ కదులుతుందనే భయంతో.. కేటీఆర్​ దిల్లీలో గల్లీ గల్లీ ప్రదక్షిణలు చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్​లోని జూబ్లీహిల్స్​లో జరిగిన కార్యక్రమంలో రేవంత్​ రెడ్డి పాల్గొన్నారు.

Revanth Reddy Comments On KCR And BJP : కేసీఆర్​ కుర్చీ కదులుతుందనే భయంతో.. కేటీఆర్​ దిల్లీలో గల్లీ గల్లీ ప్రదక్షిణలు చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి ఆరోపించారు. కేటీఆర్​ దిల్లీ పర్యటన కంటోన్మెంట్​ రోడ్ల కోసమో.. మెట్రో రైలు కోసమో.. రాష్ట్ర ప్రయోజనాల కోసమో కాదని విమర్శించారు. హైదరాబాద్​లోని జూబ్లీహిల్స్​లో జరిగిన కార్యక్రమంలో రేవంత్​ రెడ్డి బీఆర్​ఎస్​, సీఎం కేసీఆర్​పై నిప్పులు చెరిగారు.

కల్వకుంట్ల కుటుంబ సభ్యుల కంపెనీలపై ఐటీ దాడుల నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్​ దిల్లీ టూర్​ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి విమర్శించారు. అయితే ఐటీ దాడుల్లో చాలా రహస్య ఆస్తుల వివరాలు దొరికాయని.. పత్రికల్లో, మీడియాలో వాటి వివరాలు రాకుండా కేటీఆర్​ మేనేజ్​ చేశారని ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఈ ఐటీ దాడుల్లో పట్టుకున్న ఆస్తులను విడిపించుకోవడానికే కేసీఆర్​.. మోదీకి లొంగిపోయారని వివరించారు. దిల్లీ చుట్టూ ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేసినా.. తెలంగాణ గల్లీల్లో కేసీఆర్​ను ఎవరూ నమ్మరన్నారు.

Revanth Reddy Criticizes KTR Visit To Delhi : రాష్ట్ర ఆవిర్భవించిన పదేళ్ల కాలంలో కేసీఆర్​ తెలంగాణను సర్వస్వం దోచుకున్నారని రేవంత్​ రెడ్డి మండిపడ్డారు. రూ.100 కోట్ల లిక్కర్​ స్కాంలో కేజ్రీవాల్​పై విచారణ జరిపిస్తున్న మోదీ.. మరి లక్ష కోట్లు దోచుకున్న కేసీఆర్​ను ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు. శనివారం దిల్లీ వెళ్లి నడ్డా, అమిత్​ షాను కలసి వచ్చిన ఈటల, రాజగోపాల్​ రెడ్డి ఇంకా ఆ పార్టీపై భ్రమలు పెట్టుకోవద్దని హితవు పలికారు. బీజేపీ, బీఆర్​ఎస్​ది మీరు అనుకుంటే తెగిపోయే బంధం కాదని.. ఆ రెండు పార్టీలది ఫెవికాల్​ బంధమని స్పష్టం చేశారు.

"కేటీఆర్​ దిల్లీ పర్యటనలో కేసీఆర్​ కుర్చీ కదులుతుందనే భయంతో దిల్లీ పోయి గల్లీల్లో ప్రదక్షిణలు చేస్తున్నాడు. కంటోన్మెంట్​ రోడ్లు కోసమో.. మెట్రో రైలు కోసమో.. రాష్ట్ర ప్రయోజనాల కోసమో కాదు. కల్వకుంట్ల కుటుంబ సభ్యుల కంపెనీలపై ఐటీ దాడులు జరిగాయి. అందులో ఐటీ వాళ్లకు చాలా రహస్య ఆస్తుల వివరాలు దొరికాయి. పత్రికల్లో, మీడియాలో వాటి వివరాలు రాకుండా కేటీఆర్​ మేనేజ్​ చేశారు. వాటిని విడిపించుకోవడానికే కేటీఆర్​ దిల్లీ పర్యటన." - రేవంత్​ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

Revanth Reddy Fire On BRS : ఈటల రాజేందర్​, రాజగోపాల్​ రెడ్డిలను ఉద్దేశిస్తూ.. వారు ఎంత కంఠశోష పెట్టుకున్నా తమ మాటలు ఎవరూ వినే పరిస్థితులు అక్కడ లేవని తెలిపారు. తెలంగాణకు పట్టిన చీడ వదలాలంటే ఏకైక ప్రత్యామ్నాయం కేవలం కాంగ్రెస్​ పార్టీనే అని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్​ వేదికగానే కేసీఆర్​ పాలన నుంచి తెలంగాణకు విముక్తి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రండి తెలంగాణ గల్లీల్లో పర్యటించి కేసీఆర్​ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పిద్దామని పిలుపునిచ్చారు. మీరంతా కూడా కాంగ్రెస్​తో కలసి రావాలని ఈటల, రాజగోపాల్​ రెడ్డిలను కోరారు.

కేసీఆర్​ కుర్చీ కదులుతుందనే భయంతో.. కేటీఆర్​ దిల్లీలో గల్లీ ప్రదక్షిణలు

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.