ETV Bharat / state

Revanth Reddy and Tummala Meet DK Shivakumar : రేవంత్​ రెడ్డి, తుమ్మల బెంగళూరుకి పయనం.. ఇప్పటికైనా స్పష్టత వచ్చేనా?

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 1, 2023, 5:44 PM IST

Tummala Nageswararao Join in Congress Party
Revanth Reddy and Tummala Nageswararao Meet DK Shivakumar

Revanth Reddy and Tummala Meet DK Shivakumar in Bangalore : రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు రోజు రోజుకి రసవత్తరంగా మారుతున్నాయి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలిసి కాంగ్రెస్ నాయకుడు డీకే శివకుమార్​ని కలిసేందుకు బెంగళూరు వెళ్లారు. పార్టీలో చేరికపై చర్చించనున్నారు. మరోవైపు వైఎస్​ఆర్​టీపీ, కాంగ్రెస్​ పార్టీలో విలీనం చేసే అంశంపై చర్చ జరిగేందుకు అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.

Revanth Reddy and Tummala Meet DK Shivakumar in Bangalore : రాష్ట్ర కాంగ్రెస్​ పార్టీ ఎన్నికల సందర్భంగా పొత్తలు, ముఖ్య నాయకుల చేరికల అంశంలో ఒడిఒడిగా అడుగులు వేస్తోంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి(Revanth Reddy), మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala) ఇవాళ బెంగళూరు వెళ్లారు. అక్కడ ఉన్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్​ (DK Shiva Kumar)తో భేటీ కానున్నారు. దీంతో కొన్ని రోజులుగా తుమ్ముల ఏ పార్టీ వైపు అనే ప్రశ్నకి సమాధానం లభించనుంది. ఆయన దాదాపు కాంగ్రెస్​లో చేరిక ఖరారు అయినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ ముగ్గురు భేటీ విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

కీలకం కానున్న డీకే శివకుమార్ : మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన వైఎస్​ఆర్​ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల(YS Sharmila) గురువారం చేసిసి కీలక వ్యాఖ్యల విషయంలో చర్చించనున్నారు. దీంతో వైఎస్​ఆర్​టీపీ పార్టీ విలీనం అంశంలోనూ డీకే శివ కుమార్​ కీలకంగా వ్యవహరిస్తున్నారు.

Revanth Reddy Meet Thummula in Hyderabad : మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి బీఆర్​ఎస్​ పార్టీ టికెట్​ ఇవ్వలేదు. దీంతో ఆయన ఖమ్మం జిల్లాలో ఆగస్ట్​ 26న భారీ వాహన ర్యాలీ చేశారు. ఆ సభలో ఆయన ప్రజల కోసం రాజకీయాలకి దూరంగా ఉండనని.. కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని తెలిపారు. దీంతో ఖమ్మం జిల్లాలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అప్పటి నుంచి ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేయనున్నారు.. స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేస్తారా అనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.

ఈ నేపథ్యంలో తుమ్మలను గురువారం పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలిపారు. ఏఐసీసీ జిల్లా ముఖ్య నాయకుల అనుమతితోనే తుమ్మలను కలిసినట్లు వివరించారు. సహచరులను, అభిమానులను సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని తుమ్మల తనకు చెప్పినట్లు రేవంత్ రెడ్డి వివరించారు. కేసీఆర్​ ప్రభుత్వాన్ని తరిమికొట్టడానికి అందరం ఏకమవుతున్నారని పేర్కొన్నారు.

Bhatti Comments on YS Sharmila : 'వైఎస్​ షర్మిల కాంగ్రెస్​లో​ చేరితే ఓకే.. వైఎస్​ కుటుంబమంటే చాలా గౌరవం'

Sharmila Meets Sonia and Rahul Gandhi : మరోవైపు కాంగ్రెస్​ పార్టీలో వైఎస్​ షర్మిల చేరతారా? అనే అంశంలో ఆమె కీలక వ్యాఖ్యలు చేసింది. గురువారం ఆమె సోనియా, రాహుల్​ గాంధీలతో భేటీ అయ్యారు. దీంతో వైఎస్​ఆర్​టీపీని(YSRTP) కాంగ్రెస్​లో విలీనం చేస్తారా అనే అంశం చర్చనీయాంశమైంది. అయితే ఈ విషయంలో కాంగ్రెస్​ పార్టీ కాని.. షర్మిల కాని ఎలాంటి ప్రకటన చేయలేదు. గతంలో కొంత మంది కాంగ్రెస్​ నాయకులు ఆమె పార్టీని విలీనం చేస్తే.. ఆహ్వానిస్తామని అన్నారు.

Thummala Nageswara Rao To Join Congress : ఖమ్మం రాజకీయాల్లో కీలక మలుపు.. కాంగ్రెస్ గూటికి తుమ్మల.. ఆరోజే చేరిక!

Congress Leaders Meeting Tummala Nageswara Rao : తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్‌లోకి ఆహ్వానించిన రేవంత్‌రెడ్డి

Thummala MLA Ticket Issue : తుమ్మల పార్టీ మారతారా..! మారితే ఎందులోకి..? మారకపోతే నెక్ట్స్​ ఏంటి..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.