ETV Bharat / state

Telangana Formation Day Celebrations 2023 : నేడు గాంధీభవన్​లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

author img

By

Published : Jun 2, 2023, 7:02 AM IST

Revanth Comments On Telangana Formation Day 2023
Revanth Comments On Telangana Formation Day 2023

Telangana Formation Day Celebrations At Gandhi Bhavan : రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల వేళ కాంగ్రెస్‌ 20 రోజుల కార్యాచరణ ప్రకటించింది. తెలంగాణ ఇచ్చింది మేమే.. తెచ్చింది మేమే అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లేందుకు సన్నద్ధమైంది. ఉత్సవాల సందర్భంగా అప్పటి లోక్‌సభ స్పీకర్‌ మీరాకుమార్‌ గన్‌ పార్కు వద్ద అమరవీరులకు నివాళులు అర్పించనున్నారు.

నేడు గాంధీభవన్​లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Congress On Telangana Decade Celebrations 2023 : రాష్ట్ర సాధనలో కాంగ్రెస్‌ పాత్రను స్పష్టంగా చెప్పేందుకు ఆ పార్టీ నేతలు రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల వేదికగా ప్రజల్లోకి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలోనే 20 రోజుల పాటు వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమైంది. నేడు గాంధీభవన్‌లో ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించేందుకు పీసీసీ సర్వం సిద్ధం చేసింది.

Telangana Formation Day Celebrations At Gandhi Bhavan : బిల్లు ఆమోదం పొందిన సమయంలో అప్పటి లోక్‌సభ స్పీకర్‌ మీరాకుమార్, మాణిక్ రావ్ ఠాక్రే గాంధీభవన్‌లో జరిగే వేడుకల్లో పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద మీరాకుమార్ నివాళులు అర్పిస్తారు. అనంతరం నిజాం కాలేజ్ వద్ద బాబూజగ్జీవన్‌రాం విగ్రహం వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు.అక్కడ నుంచి పాదయాత్ర గన్‌ఫౌండ్రి, అబిడ్స్ నెహ్రూ విగ్రహం, మొహంజాహి మార్కెట్ మీదుగా గాంధీభవన్‌కు చేరుకుంటుంది. అనంతరం గాంధీభవన్‌లో జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సభలో ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ముఖ్యులను సన్మానించనున్నారు.

Revanth Reddy On Telangana Formation Day Celebrations : తెలంగాణ యువత, విద్యార్థుల త్యాగాల ఫలితం వల్లే రాష్ట్రం ఏర్పాటైందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. రాష్ట్ర ప్రజలకు రేవంత్‌ రెడ్డి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాహుల్‌ గాంధీతో అమెరికా పర్యటనలో ఉన్నందున అవతరణ వేడుకల్లో పాల్గొనలేక పోతున్నట్లు తెలిపారు. ప్రజల 60 ఏళ్ల ఆకాంక్షను నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీనేని కొనియాడారు. తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పెద్దఎత్తున ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరపాలని.. ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని రేవంత్ పిలుపునిచ్చారు.

Janareddy On Telangana Decade Celebrations : తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ, పేదలకు ఇళ్లు కట్టిస్తామని సీనియర్‌ నేత జానారెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లా నిడమనూరులో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన.. రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో సోనియా చిత్ర పటానికి పాలాభిషేకం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా ప్రత్యేక కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.