ETV Bharat / state

భారీ వర్షాలకు నిండిన చెరువులు.. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు

author img

By

Published : Oct 14, 2020, 3:48 PM IST

హైదరాబాద్​లో రెండు రోజులుగా కురిసిన వానలకు రామాంతపూర్​ చెరువులు నిండిపోయి. వర్షం నీరు రోడ్లపైకి చేరుకుని పలు చోట్ల చెట్లు నేలకూలాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షం నీరు చేరుకుని ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.

ramanthapur lake overflowing flood water due to heavy rains
భారీ వర్షాలకు నిండిన చెరువులు.. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్​ నగర రోడ్లపై పారే వర్షం నీరు.. వరదలను తలపిస్తోంది. రామాంతపూర్​- ఉప్పల్​ రహదారి వైపు రోడ్లకు అడ్డంగా కొన్ని చెట్లు నేలకూలిపోగా.. ట్రాఫిక్​ పెద్ద ఎత్తున స్తంభించింది. రామాంతపూర్​ పెద్దచెరువు, చిన్నచెరువు గరిష్ఠ నీటిమట్టానికి చేరుకోగా బయటకు పొంగిపొర్లుతున్నాయి.

రామాంతపూర్​లో చెరువులు నిండగా.. లోతట్టు ప్రాంతాలైన ఇందిరానగర్​, నేతాజీనగర్​, సుభాష్​నగర్​, కేసీఆర్​ నగర్​, కేటీఆర్​ నగర్​ ప్రాంతాలు వర్షపు నీటితో మునిగిపోయాయి. ఇళ్లలోకి నడుంలోతుకు నీరు నిలిచిపోయాయని స్థానికులు వాపోయారు. అధికారులు వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని.. లేకపోతో వర్షాల్లో వాహనాలతోపాటు తమ ప్రాణాలు గల్లంతయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండిః హైదరాబాద్‌కు సమీపంలో తీవ్ర వాయుగుండం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.