ETV Bharat / state

Live Updates : భద్రాచలం వద్ద తగ్గుతున్న గోదావరి నీటిమట్టం.. ప్రస్తుతం 41.1 అడుగులు

author img

By

Published : Jul 21, 2023, 8:57 AM IST

Updated : Jul 21, 2023, 8:57 PM IST

Rains in Telangana 2023
Rains in Telangana 2023

20:56 July 21

  • పౌరసరఫరాల శాఖపై ముగిసిన సీఎం కేసీఆర్ సమీక్ష

20:45 July 21

భద్రాచలం వద్ద తగ్గుతున్న గోదావరి నీటిమట్టం

  • భద్రాచలం వద్ద తగ్గుతున్న గోదావరి నీటిమట్టం
  • భద్రాచలం వద్ద గోదావరిలో 41.1 అడుగుల నీటిమట్టం

20:42 July 21

పెద్దపల్లి జిల్లా మంథని మం. సుందిళ్ల బ్యారేజ్‌కు వరద ఉద్ధృతి

  • పెద్దపల్లి జిల్లా మంథని మం. సుందిళ్ల బ్యారేజ్‌కు వరద ఉద్ధృతి
  • సుందిళ్ల బ్యారేజ్‌ 72 గేట్లలో 60 గేట్లు ఎత్తిన అధికారులు
  • ఎగువ నుంచి భారీ వరదతో విడతల వారీగా గేట్లు ఎత్తివేత
  • సుందిళ్ల బ్యారేజ్ ఇన్‌ఫ్లో 2.6 లక్షల క్యూసెక్కులు
  • బ్యారేజ్‌ నుంచి 2.75 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల
  • సుందిళ్ల బ్యారేజ్‌ పూర్తిస్థాయి నీటి నిల్వ 8.83 టీఎంసీలు
  • సుందిళ్ల బ్యారేజ్‌ ప్రస్తుత నీటి నిల్వ 3.88 టీఎంసీలు

20:11 July 21

ప్రాజెక్టు ఘాట్ రోడ్డు పైనుంచి కిందకు పడ్డ కారు

నిజామాబాద్​లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద ప్రమాదం

ప్రాజెక్టు ఘాట్ రోడ్డు పైనుంచి కిందకు పడ్డ కారు

ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలు, ఇద్దరికి స్వల్పగాయాలు

నిర్మల్ ఆసుపత్రికి బాధితుల తరలింపు

ప్రాజెక్టు సందర్శనకు వచ్చి తిరిగి వెళ్తుండగా ప్రమాదం

19:49 July 21

ఎల్లంపల్లి ప్రాజెక్టు 25గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల

  • భారీ వర్షాలతో ఉత్తర తెలంగాణ ప్రాజెక్టుల్లో జలసవ్వడి
  • ఎగువ నుంచి భారీ వరద, రాష్ట్రంలో వర్షాలతో గోదావరి పరవళ్లు
  • వరద హోరుతో నిండుకుండల్లా మారిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు
  • ఎల్లంపల్లి ప్రాజెక్టు 25గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల

18:53 July 21

వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్‌కు 47 ఫిర్యాదులు

  • వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్‌కు 47 ఫిర్యాదులు
  • చెట్లు కూలడంపై 33, నీరు నిలిచిపోవడంపై 11 ఫిర్యాదులు
  • గోడలు కూలినట్లు 2 ఫిర్యాదులు వచ్చాయన్న జీహెచ్‌ఎంసీ
  • 36 ఫిర్యాదులు పరిష్కరించిన జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందం

17:03 July 21

హైదర్‌నగర్‌లో కూలిన జానకిరామ టవర్స్ ప్రహరీ గోడ

  • హైదర్‌నగర్‌లో కూలిన జానకిరామ టవర్స్ ప్రహరీ గోడ
  • జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రహరీ గోడ కూలిందన్న స్థానికులు
  • ప్రహరీ గోడ పక్కనే డ్రైనేజీ పనులు చేపట్టారన్న కాలనీవాసులు
  • వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌కు ఫిర్యాదు చేసినా స్పందించలేదన్న స్థానికులు

16:42 July 21

ఆదిలాబాద్ జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం

  • ఆదిలాబాద్ జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం
  • భారీ వర్షాలతో ఇచ్చోడ, సిరికొండ మండలాల్లో భారీగా పంట నష్టం
  • వరద ఉద్ధృతికి మట్టి మేటలు వేయడంతో దెబ్బతిన్న పంటలు
  • సిరికొండ మండలం నారాయణపూర్‌లో తెగిన చెరువు కట్ట
  • ఆదిలాబాద్‌: చెరువు కట్ట తెగడంతో ఇళ్లలోకి చేరిన వరద నీరు
  • ఇచ్చోడ మం. బావోజ్‌పేట్‌లో కోతకు గురైన రహదారి
  • రహదారి కోతకు గురవడంతో గ్రామానికి నిలిచిన రాకపోకలు
  • ఇచ్చోడ మండలం దుబార్‌పేట్‌లో ఇళ్లలోకి చేరిన వరద నీరు
  • ఆదిలాబాద్‌: జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టిన గ్రామస్థులు
  • రెండు గంటలుగా కొనసాగుతున్న ఆందోళన, భారీగా నిలిచిన రాకపోకలు

16:39 July 21

  • రాష్ట్రంలో భారీ వర్షాల పరిస్థితిపై సీఎం కేసీఆర్ సమీక్ష
  • ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటు, తదితర అంశాలపై సమీక్ష
  • ధాన్యం ఉత్పత్తి మేరకు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుపై చర్చ

16:36 July 21

హిమాయత్‌సాగర్ గేట్లు ఎత్తిన జలమండలి అధికారులు

  • హిమాయత్‌సాగర్ గేట్లు ఎత్తిన జలమండలి అధికారులు
  • జలాశయం 2 గేట్ల ద్వారా 700 క్యూసెక్కులు విడుదల
  • హిమాయత్‌సాగర్‌ జలాశయానికి 1200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

16:26 July 21

మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమావేశం

  • మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమావేశం
  • వర్షాలు, నీటిపారుదల, ఆర్థిక, బీసీ శాఖలపై సీఎం సమీక్ష
  • పౌరసరఫరాలు, పంచాయతీరాజ్ శాఖలపై భేటీలో చర్చ

16:07 July 21

సీపీలు, ఎస్పీలతో డీజీపీ అంజనీ కుమార్ టెలీకాన్ఫరెన్స్

సీపీలు, ఎస్పీలతో డీజీపీ అంజనీ కుమార్ టెలీకాన్ఫరెన్స్

భారీ వర్షాల దృష్ట్యా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం

ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయన్న డీజీపీ

ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని డీజీపీ ఆదేశం

వివిధ శాఖలతో సమన్వయం చేసుకుని సహాయక చర్యలు చేపట్టాలన్న డీజీపీ

జాగ్రత్తలపై సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయాలన్న డీజీపీ

భద్రాచలంలో పరిస్థితులపై ఐజీ చంద్రశేఖర్ రెడ్డిని అడిగి తెలుసుకున్న డీజీపీ

16:06 July 21

వరంగల్ కాకతీయ వర్సిటీ పరిధిలో రేపు జరగాల్సిన పరీక్షలు వాయిదా

వరంగల్ కాకతీయ వర్సిటీ పరిధిలో రేపు జరగాల్సిన పరీక్షలు వాయిదా

భారీ వర్షాల వల్ల కాకతీయ వర్సిటీ పరిధిలో రేపటి పరీక్షలు వాయిదా

జులై 20 నుంచి 22 మధ్య వాయిదా పడిన పరీక్షల షెడ్యూల్ రేపు వెల్లడి

15:51 July 21

  • కాసేపట్లో సచివాలయానికి ముఖ్యమంత్రి కేసీఆర్
  • మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షించనున్న సీఎం కేసీఆర్‌

15:50 July 21

మంత్రి పువ్వాడకు సీఎం కేసీఆర్ ఫోన్‌కాల్‌

  • మంత్రి పువ్వాడకు సీఎం కేసీఆర్ ఫోన్‌కాల్‌
  • గోదావరి వరద ఉద్ధృతిపై మంత్రిని అడిగి తెలుసుకున్న సీఎం కేసీఆర్
  • ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించిన సీఎం కేసీఆర్‌
  • గోదావరి వరద ఉద్ధృతిపై అధికారులతో సమీక్షించిన మంత్రి పువ్వాడ
  • వరద తగ్గే వరకు భద్రాచలంలో ఉంటామని తెలిపిన మంత్రి పువ్వాడ

15:27 July 21

  • హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల పరిధిలో భారీ వర్ష సూచన
  • జీహెచ్‌ఎంసీ పరిధిలోని 3 జిల్లాల్లో మరో 24 గంటల్లో భారీ వర్ష సూచన
  • ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచన
  • వరదలు, చెట్లు కూలడం వంటి సమస్యలపై ఫిర్యాదుకు ఫోన్‌ నంబర్లు ఏర్పాటు
  • జీహెచ్‌ఎంసీ హెల్ప్‌లైన్‌ నంబర్‌: 040 – 21111111
  • జీహెచ్‌ఎంసీ హెల్ప్‌లైన్‌ నంబర్‌: 90001 13667

14:51 July 21

హిమాయత్‌సాగర్‌ జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రహవాం

  • హిమాయత్‌సాగర్‌ జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రహవాం
  • హిమాయత్‌సాగర్ గేట్లు ఎత్తి మూసీ నదిలోకి నీరు విడుదల
  • సా. 4 గంటలకు 2 గేట్లు ఎత్తి 700 క్యూసెక్కుల నీరు విడుదల
  • ప్రస్తుతం హిమాయత్ సాగర్‌కు 1,200 క్యూసెక్కుల ఇన్ ఫ్లో

14:50 July 21

నిజామాబాద్​లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి పెరుగుతున్న ప్రవాహం

  • నిజామాబాద్​లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి పెరుగుతున్న ప్రవాహం
  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 92,590 క్యూసెక్కుల ప్రవాహం
  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 1,091అడుగులు
  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 1,076.10 అడుగులు
  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు
  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటి నిల్వ 42.452 టీఎంసీలు

14:23 July 21

భద్రాచలం వద్ద తగ్గుతున్న గోదావరి నీటి మట్టం

  • భద్రాచలం వద్ద తగ్గుతున్న గోదావరి నీటి మట్టం
  • మధ్యాహ్నం 2 గం.కు 42.7 అడుగుల వద్ద నీటి మట్టం

14:08 July 21

రానున్న 3 గంటల్లో భారీ వర్ష సూచన దృష్ట్యా అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ

  • రానున్న 3 గంటల్లో భారీ వర్ష సూచన దృష్ట్యా అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ
  • అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు సూచన
  • నిన్న 25 లక్షల మందిని ఎస్‌ఎంఎస్‌ ద్వారా అలర్ట్ చేసిన డీఆర్‌ఎఫ్‌
  • మాన్సూన్ కంట్రోల్ రూమ్‌ను పరిశీలించిన డిప్యూటీ మేయర్

13:52 July 21

హుస్సేన్‌సాగర్‌కు చేరుతున్న వరద నీరు

  • హుస్సేన్‌సాగర్‌లో ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటిన నీటిమట్టం
  • హుస్సేన్‌సాగర్ ప్రస్తుత 513.62 మీటర్లుగా ఉన్న నీటిమట్టం
  • హుస్సేన్‌సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 513.45 మీటర్లు

13:40 July 21

కడెం జలాశయంలో కొనసాగుతున్న వరద ఉద్ధృతి

  • నిర్మల్: కడెం జలాశయంలో కొనసాగుతున్న వరద ఉద్ధృతి
  • కడెం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు
  • కడెం జలాశయం ప్రస్తుత నీటి మట్టం 695.950 అడుగులు
    కడెం జలాశయలో చేరుతున్న139400 క్యూసెక్కుల వరద నీరు
    కడెం జలాశయం 14 వరద గేట్ల ద్వారా 176400 క్యూసెక్కుల నీటి విడుదల

13:30 July 21

సికింద్రాబాద్ అడ్డగుట్టలో భారీ వర్షాలకు కూలిన 10 గుడిసెలు

  • సికింద్రాబాద్: అడ్డగుట్టలో భారీ వర్షాలకు కూలిన 10 గుడిసెలు
  • సికింద్రాబాద్: ముగ్గురు చిన్నారులకు తప్పిన ప్రమాదం
  • సికింద్రాబాద్: ప్రభుత్వం సాయం చేయాలని బాధితుల విజ్ఞప్తి

13:29 July 21

హిమాయత్‌నగర్‌లో నాలాపరివాహక ప్రాంతాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్‌

  • హిమాయత్‌నగర్‌లో నాలాపరివాహక ప్రాంతాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్‌
  • భారీ వర్షానికి ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికుల ఇబ్బందులు
  • తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను ఆదేశించిన కమిషనర్

13:01 July 21

రాష్ట్రంలో ఇవాళ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం

  • రాష్ట్రంలో ఇవాళ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం
  • ఉత్తర తెలంగాణ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
  • రాష్ట్రంలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం

13:01 July 21

సరూర్‌నగర్ చెరువు కొన్ని గేట్లు తెరిచిన అధికారులు

  • హైదరాబాద్: సరూర్‌నగర్ చెరువు కొన్ని గేట్లు తెరిచిన అధికారులు
  • చెరువు గేట్లు తెరవడంతో కోదండరామ్‌నగర్ కాలనీలో చేరిన నీరు

12:23 July 21

ఇవాళ, రేపు జీహెచ్ఎంసీ పరిధిలో సెలవు ప్రకటిస్తూ కార్మిక శాఖ ఉత్తర్వులు

  • ఇవాళ, రేపు జీహెచ్ఎంసీ పరిధిలో సెలవు ప్రకటిస్తూ కార్మిక శాఖ ఉత్తర్వులు
  • జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు, కార్మికులకు సెలవు
  • అత్యవసర, నిత్యావసర సేవలకు మినహాయింపు

12:21 July 21

భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో గోదావరి వరదలపై సమీక్ష

  • భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో గోదావరి వరదలపై సమీక్ష
  • భద్రాద్రి జిల్లా అధికారులతో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సమీక్ష
  • భద్రాద్రి: సమీక్షలో పాల్గొన్న ఉన్నతాధికారులు

12:20 July 21

  • హుస్సేన్‌సాగర్‌ను పరిశీలించిన జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్
  • హుస్సేన్‌సాగర్‌కు భారీగా వరద నీరు చేరుతోంది: డిప్యూటీ మేయర్
  • ప్రస్తుతం 513.62 మీటర్లకు నీటిమట్టం చేరింది: డిప్యూటీ మేయర్
  • తూముల ద్వారా నీటిని దిగువ ప్రాంతాలకు వదులుతున్నాం: డిప్యూటీ మేయర్
  • లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశాం: డిప్యూటీ మేయర్
  • రెండ్రోజులు భారీ వర్షం దృష్ట్యా జాగ్రత్తలు తీసుకుంటున్నాం: డిప్యూటీ మేయర్

12:19 July 21

భారీ వర్షాల దృష్ట్యా సిరిసిల్ల జిల్లా ప్రజల అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్‌

  • భారీ వర్షాల దృష్ట్యా సిరిసిల్ల జిల్లా ప్రజల అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్‌
  • వరద ప్రవాహం అధికంగా ఉన్న ప్రాంతాల్లో బయటకు వెళ్లవద్దు: కలెక్టర్‌
  • రైతులు పొలాల్లో విద్యుత్ మోటార్ల వద్ద జాగ్రత్తగా ఉండాలి: కలెక్టర్‌
  • లో లెవెల్ వంతెనల వద్ద అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్‌
  • జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం: కలెక్టర్‌
  • సమస్యలుంటే కంట్రోల్ రూమ్ నంబర్ 93986 84240

11:20 July 21

సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం

  • సంగారెడ్డి: జహీరాబాద్‌లో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం
  • జహీరాబాద్, మొగ్దుంపల్లి మండలాల్లో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులు
  • ధనసిరి-మాడిగి, ఇప్పేపల్లి-ధనసిరి మార్గాల్లో నిలిచిన రాకపోకలు
  • సంగారెడ్డి: పొంగిపొర్లుతున్న జాడి మల్కాపూర్ జలపాతం
  • జలపాతం ఉద్ధృతి కారణంగా పర్యాటకులను అనుమతించని పోలీసులు

11:20 July 21

భూపాలపల్లి జిల్లాలో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం

  • భూపాలపల్లి జిల్లాలో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం
  • సింగరేణిలో 2, 3 ఓపెన్‌ కాస్ట్‌లలోకి వరద నీరు చేరి బొగ్గు ఉత్పత్తికి అంతరాయం

11:19 July 21

భద్రాచలం వద్ద గోదావరి వరద తీవ్రతపై సీఎస్‌ శాంతికుమారి ఆరా

  • భద్రాచలం వద్ద గోదావరి వరద తీవ్రతపై సీఎస్‌ శాంతికుమారి ఆరా
  • కలెక్టర్‌ ప్రియాంకను వివరాలు అడిగి తెలుసుకున్న సీఎస్‌ శాంతి కుమారి
  • వరదల తీవ్రత, పునరావాస కేంద్రాల పరిస్థితి అడిగి తెలుసుకున్న సీఎస్
  • వరద ప్రవాహం తగ్గుముఖం పడుతుందని సీఎస్‌కు వివరించిన కలెక్టర్ ప్రియాంక
  • వరద బాధితులకు పునరావాస కేంద్రంతోపాటు అన్ని చర్యలు తీసుకున్నామన్న కలెక్టర్
  • నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశం

10:55 July 21

భారీ వర్షాల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు మంత్రి తలసాని ఆదేశం

  • భారీ వర్షాల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు మంత్రి తలసాని ఆదేశం
  • నగర పరిస్థితులను జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్‌ను అడిగి తెలుసుకున్న మంత్రి
  • హుస్సేన్‌సాగర్‌కు భారీ వరద దృష్ట్యా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్న తలసాని
  • నీటిని దిగువకు విడుదల దృష్ట్యా లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలి: తలసాని
  • ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై స్పందిస్తూ అవసరమైన సేవలు అందించాలి: మంత్రి

10:27 July 21

కడెం జలాశయంలో కొనసాగుతున్న వరద ఉద్ధృతి

  • నిర్మల్: కడెం జలాశయంలో కొనసాగుతున్న వరద ఉద్ధృతి
  • కడెం జలాశయం 12 గేట్ల ద్వారా నీటి విడుదల
  • కడెం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు
  • కడెం జలాశయం ప్రస్తుత నీటి మట్టం 696.250 అడుగులు
  • కడెం జలాశయం 12 గేట్ల ద్వారా 1,36,200 క్యూసెక్కుల నీటి విడుదల

10:05 July 21

భద్రాచలంలోని ప్రభుత్వ పాఠశాలలో పునరావాస కేంద్రం ఏర్పాటు

  • భద్రాచలంలోని ప్రభుత్వ పాఠశాలలో పునరావాస కేంద్రం ఏర్పాటు
  • లోతట్టు ప్రాంతమైనా కొత్త కాలనీలో 24 కుటుంబాల కోసం పునరావాస కేంద్రం ఏర్పాటు

09:53 July 21

తెలంగాణ- మహారాష్ట్ర మధ్య నిలిచిన రాకపోకలు

  • నిజామాబాద్: సాలూర వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మంజీర నది
  • నిజామాబాద్: లోలెవల్ వంతెన మీదుగా ప్రవహిస్తున్న నీరు
  • తెలంగాణ- మహారాష్ట్ర మధ్య నిలిచిన రాకపోకలు

09:53 July 21

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం

  • హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం
  • బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్‌, చందానగర్‌లో వర్షం
  • బేగంపేట, మారేడుపల్లి, చిలకలగూడ, మియాపూర్‌లో వర్షం
    భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో జలమయమైన రోడ్లు
  • రహదారులపై నీరు చేరడంతో వాహనాదారులుకు ఇబ్బందులు

09:40 July 21

ఎగువన కురుస్తున్న వర్షాలతో జంట జలాశయాల్లోకి పెరుగుతున్న ఇన్‌ఫ్లో

  • ఎగువన కురుస్తున్న వర్షాలతో జంట జలాశయాల్లోకి పెరుగుతున్న ఇన్‌ఫ్లో
  • ఉస్మాన్‌సాగర్ ఇన్‌ఫ్లో 1,100 క్యూసెక్కులు
  • ఉస్మాన్‌సాగర్ ప్రస్తుత నీటిమట్టం 1,784.70 అడుగులు
  • ఉస్మాన్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,790 అడుగులు
  • హిమాయత్‌సాగర్ ప్రస్తుత నీటిమట్టం 1761.20 అడుగులు
  • హిమాయత్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు

09:39 July 21

హుస్సేన్‌సాగర్‌కు కొనసాగుతున్న వరద ప్రవాహం

  • హుస్సేన్‌సాగర్‌కు కొనసాగుతున్న వరద ప్రవాహం
  • హుస్సేన్‌సాగర్‌లో ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటిన నీటిమట్టం
  • హుస్సేన్‌సాగర్ ప్రస్తుత 513.62 మీటర్లుగా ఉన్న నీటిమట్టం
  • హుస్సేన్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 514.75 మీటర్లు

09:38 July 21

నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచన

  • నిజామాబాద్: భారీ వర్షాల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచన
  • కంట్రోల్ రూమ్ 08462- 221403 నంబర్ కు కాల్ చేయాలని సూచన
  • వర్షాల వల్ల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశం

09:38 July 21

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం

  • ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం
  • కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలో కురుస్తున్న వర్షం

09:22 July 21

కడెం జలాశయం 9 గేట్ల ద్వారా 1,40,072 క్యూసెక్కుల నీటి విడుదల

  • కడెం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు
  • కడెం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 695.50 అడుగులు
  • కడెం జలాశయం 9 గేట్ల ద్వారా 1,40,072 క్యూసెక్కుల నీటి విడుదల

09:21 July 21

వలిగొండ మండలం భీమలింగం వంతెన పైనుంచి ప్రవహిస్తున్న మూసీ నది

  • యాదాద్రి: వలిగొండ మండలం భీమలింగం వంతెన పైనుంచి ప్రవహిస్తున్న మూసీ నది
  • వంతెనకు ఇరువైపులా వాహనాల రాకపోకలు నిలిపివేసిన పోలీసులు
  • భువనగిరి- చౌటుప్పల్ మధ్య నిలిచిపోయిన రాకపోకలు

09:21 July 21

ముధోల్ నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం

  • నిర్మల్: ముధోల్ నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం
  • గుండెగాం వద్ద పల్సికర్ రంగారావ్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్‌తో మునిగిన వంతెన
  • భైంసా నుంచి మహాగాం, పార్డి(బి), చాత గ్రామాలకు నిలిచిన రాకపోకలు

09:06 July 21

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు

  • ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు
  • ఉమ్మడి జిల్లాలో అలుగు పారుతున్న 100 కు పైగా చెరువులు
  • యానంపేట, హోన్నాజీపేట, జానకంపేటలో కూలిన ఇల్లు
  • రెంజల్ మండలం కందకుర్తి వద్ద గోదావరి పరవళ్లు

09:03 July 21

నిజాంసాగర్ ప్రాజెక్టులోకి పెరుగుతున్న వరద ప్రవాహం

  • కామారెడ్డి: నిజాంసాగర్ ప్రాజెక్టులోకి పెరుగుతున్న వరద ప్రవాహం
  • నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 28,500 క్యూసెక్కుల ప్రవాహం
  • నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 1393.7 అడుగులు
  • నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1,405అడుగులు
  • నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటినిల్వ సామర్థ్యం 6.014 టీఎంసీలు
  • నిజాంసాగర్ ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యం 17.802 టీఎంసీలు

08:47 July 21

నాగిరెడ్డిపేట్ మండలం పోచారం ప్రాజెక్టుకు ప్రవాహం

  • కామారెడ్డి: నాగిరెడ్డిపేట్ మండలం పోచారం ప్రాజెక్టుకు ప్రవాహం
  • కామారెడ్డి: పోచారం ప్రాజెక్టులోకి 8,505 క్యూసెక్కుల ప్రవాహం
  • పోచారం ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 1463.7అడుగులు
  • పోచారం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,464అడుగులు
  • పోచారం ప్రాజెక్టు ప్రస్తుత నీటి నిల్వ 1.778టీఎంసీలు
  • పోచారం ప్రాజెక్టు పూర్తి నీటినిల్వ సామర్థ్యం 1.820టీఎంసీలు

08:46 July 21

భూపాలపల్లి జిల్లాలో 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు

  • భూపాలపల్లి జిల్లాలో 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు
  • మహాముత్తరంలో పెద్దవాగు ఉద్ధృతికి మేడారం రహదారిపై నిలిచిన రాకపోకలు
  • మలహర్ మండలం తాడిచర్ల ఉపరితల గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

08:46 July 21

ఇల్లందు నియోజకవర్గంలో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి

  • భద్రాద్రి: ఇల్లందు నియోజకవర్గంలో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి
  • కోయగూడెం ఉపరితల గనిలో నిలిచిన 37 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి

08:45 July 21

నిర్మల్ స్వర్ణ జలాశయానికి కొనసాగుతున్న వరద ఉద్ధృతి

  • నిర్మల్: స్వర్ణ జలాశయానికి కొనసాగుతున్న వరద ఉద్ధృతి
  • స్వర్ణ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1,189 అడుగులు
  • స్వర్ణ జలాశయం ప్రస్తుత నీటిమట్టం 1,177 అడుగులు
  • స్వర్ణ జలాశయం గేట్ ద్వారా వెయ్యి క్యూసెక్కుల నీటి విడుదల
  • నిర్మల్: కడెం జలాశయంలో కొనసాగుతున్న వరద
  • కడెం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు
  • కడెం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 692.65 అడుగులు
  • కడెం జలాశయం 2 గేట్ల ద్వారా 45,609 క్యూసెక్కుల నీటి

08:45 July 21

కామారెడ్డి జిల్లాలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులు

  • కామారెడ్డి జిల్లాలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులు
  • హసన్‌టాక్లి, లింబుర్ గ్రామాల మధ్య వంతెన పైనుంచి ప్రవహిస్తున్న వరద
  • కామారెడ్డి: సిర్పూర్ గ్రామానికి నిలిచిన రాకపోకలు
  • గోజేగావ్ సమీపంలో వాగు ఉద్ధృతికి నిలిచిన రాకపోకలు

08:44 July 21

రుద్రవెల్లి, జూలూరు గ్రామాల మధ్య నిలిచిన రాకపోకలు

  • యాదాద్రి: బీబీనగర్ మం. లోలెవెల్ వంతెన పైనుంచి ప్రవహిస్తున్న మూసీ
  • రుద్రవెల్లి, జూలూరు గ్రామాల మధ్య నిలిచిన రాకపోకలు

08:44 July 21

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద

  • నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద
  • ప్రస్తుతం వచ్చి చేరుతున్న 60,395 క్యూసెక్కుల వరద నీరు
  • శ్రీరాంసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,091 అడుగులు
  • శ్రీరాంసాగర్ ప్రస్తుత నీటిమట్టం 1,075.20 అడుగులు

08:43 July 21

భద్రాచలం వద్ద నిలకడగా గోదావరి నీటి మట్టం

  • భద్రాచలం వద్ద నిలకడగా గోదావరి నీటి మట్టం
  • ఉదయం 6గం.కు 43.9 అడుగుల వద్ద ప్రవహిస్తున్న నీటి మట్టం
  • నీటి మట్టం 43 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
Last Updated : Jul 21, 2023, 8:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.