ETV Bharat / state

హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో వర్షం

author img

By

Published : May 13, 2021, 1:28 AM IST

rain in hyderabad city
హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో వర్షం

గ్రేటర్​ హైదరాబాద్​ పరిధిలోని పలు ప్రాంతాల్లో బుధవారం రాత్రి చిరుజల్లులతో కూాడిన వర్షం కురిసింది. పలు కాలనీల్లో విద్యుత్​ సరఫరా నిలిచిపోయింది.

హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో వర్షం

హైదరాబాద్ నగరంలో బుధవారం రాత్రి పలు ప్రాంతాల్లో చిరుజల్లులతో కూడిన వర్షం కురిసింది. గ్రేటర్ పరిధిలోని ఖైరతాబాద్, బంజారాహిల్స్, సోమాజిగూడ, పంజాగుట్ట, అమీర్​పేట్, బేగంపేట్, ఎల్బీనగర్, కొత్తపేట, చార్మినార్, అఫ్జల్ గంజ్, నాంపల్లి తదితర చోట్ల స్వల్పంగా వర్షం కురిసింది. ఇందులో కొన్ని చోట్ల కొంచెం ఎక్కువగా వర్షం కురిసింది. సుమారు 30 నిమిషాల పాటు వర్షం కురిసింది.

సరూర్‌నగర్‌, దిల్​సుఖ్ నగర్, చైతన్యపురి, ముసారాంబాగ్​ ప్రాంతాల్లో కాస్త అధికంగా వర్షం కురిసింది. శ్రీనగర్ కాలనీ, కమలానగర్ కాలనీల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

ఇదీ చదవండి: ఈనెల 21 వరకు ధరణి రిజిస్ట్రేషన్లు నిలిపివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.