ETV Bharat / state

Rain Alerts in Telangana : రాగల 48 గంటల్లో అల్పపీడనం.. 3 రోజులు ఆరెంజ్​ హెచ్చరికలు జారీ

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 3, 2023, 7:28 PM IST

Telangana Weather Updates Today
Rain Alerts in Telangana

Rain Alerts in Telangana : రాష్ట్రంలో రాబోయే 48 గంటల్లో వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రాగల 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మూడు రోజులు ఆరెంజ్‌ హెచ్చరికలను జారీ చేసినట్లు ఐఎండీ ప్రకటించింది.

Rain Alerts in Telangana : రాష్ట్రంలో రాగల 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ(IMD Hyderabad) పేర్కొంది. రాబోయే 48 గంటల్లో వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మూడు రోజులు ఆరెంజ్‌ హెచ్చరికలను జారీ చేసినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది.

ఉమ్మడి కరీంనగర్, మహబూబ్​నగర్​తో పాటు మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో.. ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ సంచాలకులు వివరించారు. అదే విధంగా ఈ రోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అన్ని జిల్లాల్లో కురుస్తాయని పేర్కొంది. నిన్నటి ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్న ఆవర్తనం.. ఈరోజు సముద్రమట్టానికి 5.8 కి.మీ. ఎత్తు వరకు అదే ప్రాంతంలో కొనసాగుతూ ఉందని తెలిపారు.

Heavy Rains in Hyderabad : హైదరాబాద్​లో భారీ వర్షం.. మరో రెండు రోజులు ఇలానే

Telangana Weather Updates Today : ఈ ఆవర్తనం నుంచి ద్రోణి ఒకటి ఉత్తరాంధ్ర తీరం వరకు.. సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్లు మరియు 3.1 కి.మీ ఎత్తు మధ్యలో విస్తరించి ఉందని పేర్కొన్నారు. మరో ఆవర్తనం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతంలో సముద్ర మట్టానికి 4.5 కి.మీ నుంచి 5.8 కి.మీ ఎత్తు మధ్యలో కేంద్రీకృతమై ఉందని వివరించారు.

ఇదిలా ఉండగా.. ఈరోజు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. సిద్దిపేట పట్టణంతో పాటు పలు గ్రామాల్లో గంట సేపు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. గత వారం రోజులుగా ఉక్కపోతతో సతమతమవుతున్న కరీంనగర్ పట్టణ ప్రజలకు ఉపశమనం లభించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి వర్షాలు కురవడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొత్తపల్లి మండలం ఆసిఫ్​నగర్​లో 94.5 మీమీ వర్షం నమోదైంది.

Kadem Reservoir Water Levels Today : నిర్మల్ జిల్లా కడెం జలాశయానికి ఎగువన ఉన్న ఆదిలాబాద్ జిల్లాల్లో కురుస్తున్న వర్షానికి.. జలాశయంలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. కడెం జలాశయంలోకి 33 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరడంతో.. 2 వరద గేట్లను ఎత్తి 36 వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదిలారు. సాయంకాలానికి వరద ఉద్ధృతి తగ్గడంతో అధికారులు గేట్లను మూసివేశారు. కడెం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 696.40 అడుగులకు చేరింది. వరద ప్రవాహాన్ని బట్టి నీటిని దిగువకు విడుదల చేస్తామని అధికారులు పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. గోదావరి తీర ప్రాంతం వైపు పశువుల కాపరులు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.

Hyderabad Rains Today : భాగ్యనగరంలో భారీ వర్షం.. జలమయమైన లోతట్టు ప్రాంతాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.