ETV Bharat / state

TS EAMCET 2023: ఎంసెట్‌కు అదనంగా 50 వేల దరఖాస్తులు: ప్రొఫెసర్‌ లింబాద్రి

author img

By

Published : May 2, 2023, 5:18 PM IST

TS EAMCET 2023: తెలంగాణ ఎంసెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి ప్రకటించారు. ఎంసెట్‌కు 28 కేంద్రాలు అదనంగా ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. లాసెట్‌, పీజీఎల్‌సెట్ ఒకే రోజు మూడు పూటల్లో.. ఈసెట్ ఒకే పూటలో పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు.

Professor Limbadri
Professor Limbadri

TS EAMCET 2023: ఈ ఏడాది ఎంసెట్‌కు గతేడాది కన్నా సుమారు 50 వేల దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. ఇప్పటి వరకు సుమారు 2 లక్షలపైగా హాల్‌ టికెట్లు అభ్యర్థులు డౌన్‌లోడ్‌ చేసుకున్నారని.. విద్యార్థులు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా త్వరగా హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. ప్రవేశ పరీక్షలకు సంబంధించి ఏర్పాట్లు, విధి విధానాలపై ఆయన మాట్లాడారు.

విద్యార్థులు ముందే పరీక్ష కేంద్రాలు చూసుకోవాలని ప్రొఫెసర్‌ లింబాద్రి సూచించారు. నిర్ణీత సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకోవడం విద్యార్థుల బాధ్యత అని.. ఆలస్యమైతే అనుమతించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఎంసెట్‌కు ఈ ఏడాది మొత్తం 137 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది అదనంగా 28 కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లు ఇంకా ప్రాసెస్‌లో ఉందని ఆయన వెల్లడించారు. లాసెట్‌, పీజీఎల్‌సెట్ ఒకే రోజు మూడు పూటల్లో.. ఈసెట్ ఒకే పూటలో పూర్తి చేయనున్నట్లు ప్రకటించారు.

Telangana EAMCET 2023: మే 10 నుంచి 14 వరకు ఎంసెట్‌ అగ్రికల్చర్‌, ఇంజినీరింగ్‌ పరీక్షలు జరగనున్నాయి. మే 10, 11న అగ్రికల్చర్‌, మెడికల్‌.. 12, 13, 14 తేదీల్లో ఇంజినీరింగ్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఎంసెట్‌ దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్‌ 10వ తేదీనే గడువు ముగియగా.. మే 2 వరకు అపరాధ రుసుముతో అవకాశం ఇచ్చారు. ఎంసెట్‌కు ప్రతి 100 మందిలో ముగ్గురు ఆలస్య రుసుంతోనే దరఖాస్తు చేసుకున్నారు. రూ.250 నుంచి రూ.5 వేల వరకు అదనంగా చెల్లించడం గమనార్హం. రూ.5 వేలతో ఇప్పటివరకు 59 మంది దరఖాస్తు చేసుకోగా.. శుక్రవారం నాటికి మొత్తం 8,394 మంది ఆలస్య రుసుముతో పరీక్ష రాయడానికి ముందుకొచ్చారు.

New courses in JNTUH: జేఎన్టీయూహెచ్ క్యాంపస్‌లో ఈ విద్యా సంవత్సరం కొత్తగా బయో టెక్నాలజీ కోర్సు అందుబాటులోకి రానుందని జేఎన్టీయూహెచ్‌ ఉపకులపతి కట్టా నర్సింహారెడ్డి తెలిపారు. కొత్త కోర్సుల కోసం ప్రైవేట్ కళాశాలల దరఖాస్తుల ప్రక్రియ ఏఐసీటీఈ పరిశీలనలో ఉన్నాయన్నారు. ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో తనిఖీలు మరో నాలుగైదు రోజుల్లో పూర్తవుతాయని.. ఆ తర్వాత అనుబంధ గుర్తింపు ప్రక్రియ చేపడతామని పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

Constable Exams: కానిస్టేబుల్ తుది రాత పరీక్షలు పూర్తి.. త్వరలో అందుబాటులోకి ఎగ్జామ్ 'కీ'

TSRTC: ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు త్వరలోనే జీతాలు పెంపు

మహాత్మా గాంధీ మనవడు అరుణ్ గాంధీ కన్నుమూత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.