ETV Bharat / state

ఏపీ పర్యటనకు రాష్ట్రపతి.. గన్నవరం విమానాశ్రయంలో ఘనస్వాగతం

author img

By

Published : Dec 4, 2022, 12:33 PM IST

President Murmu Ap Tour : ఆంధ్రప్రదేశ్​లో రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజయవాడ చేరుకున్నారు. ఆమెకు ఆ రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, సీఎం జగన్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఘన స్వాగతం పలికారు.

President Draupathi Murmu
President Draupathi Murmu

President Murmu Ap Tour : ఏపీ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విజయవాడ చేరుకున్నారు. రాష్ట్రంలో రెండు రోజులు పర్యటించనున్న ఆమె.. ఉదయం 11 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ రాష్ట్రపతికి ఆ రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, సీఎం జగన్‌, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎయిర్‌పోర్టులో ద్రౌపదీ ముర్ము పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పోరంకిలోని ఓ ప్రైవేటు కన్వెన్షన్‌ సెంటర్‌లో రాష్ట్రపతికి పౌర సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో పాటు రాష్ట్రంలోని పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని ద్రౌపదీ ముర్మును సత్కరించారు. ఆ తర్వాత రాజ్‌భవన్‌లో రాష్ట్రపతి గౌరవార్థం గవర్నర్‌ అధికారిక విందు ఇవ్వనున్నారు. విందు కార్యక్రమం ముగిసిన అనంతరం రాష్ట్రపతి విశాఖ బయల్దేరి వెళ్లనున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.