Prashant Kishor News: సీఎం కేసీఆర్​తో ప్రశాంత్ కిశోర్ సమావేశం

author img

By

Published : Apr 24, 2022, 12:18 AM IST

Updated : Apr 24, 2022, 3:34 AM IST

Prashant Kishor had a meeting with Chief Minister KCR

Prashant Kishor News: ముఖ్యమంత్రి కేసీఆర్​తో ప్రశాంత్ కిశోర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై విస్తృతంగా చర్చించారు. ఒకటి, రెండు రోజుల పాటు ఈ చర్చలు కొనసాగనున్నాయి.

Prashant Kishor News: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌కిశోర్‌ శనివారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై విస్తృతంగా చర్చించారు. కాంగ్రెస్‌ అధిష్ఠానంతో ఇటీవల వరుస సమావేశాల నేపథ్యంలో పీకే హైదరాబాద్‌కు వచ్చి కేసీఆర్‌ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు వారిద్దరి మధ్య చర్చలు జరిగాయి. ఆదివారం సైతం సమాలోచనలు కొనసాగనున్నాయి. ఇందుకోసం పీకే శనివారం రాత్రి ప్రగతిభవన్‌లోనే బస చేసినట్లు అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికే తెరాసతో ఒప్పందం మేరకు పీకే రాష్ట్రంలో తమ బృందంతో కలిసి రాజకీయ, పాలన పరిస్థితులపై సర్వే నిర్వహించారు.

తొలుత 30 నియోజకవర్గాల్లోని సర్వే ఫలితాలను ఇచ్చారు. ఆ తర్వాత 89 నియోజకవర్గాల సర్వే జరిగింది. పీకే ఆ నివేదికను కేసీఆర్‌కు సమర్పించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఆయన కాంగ్రెస్‌ నేతలతో జరిపిన సమావేశాల గురించి సైతం చర్చ జరిగినట్లు సమాచారం. ముందే కుదుర్చుకున్న ఒప్పందం మేరకు తాను తెరాసతో పనిచేస్తానని పీకే వెల్లడించినట్లు తెలుస్తోంది. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు ఆదివారం కూడా చర్చలు కొనసాగించాలని కేసీఆర్‌ నిర్ణయించారు. ప్రధానంగా ఈ నెల 27న తెరాస 21వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో ప్లీనరీని నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో పీకే తాజా సర్వే, తెరాస బలోపేతం వంటి అంశాలపైనా చర్చించనున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: 'కేంద్రమే నిధులిస్తే.. తెలంగాణ తరహా పథకాలు కర్ణాటకలో ఎందుకు లేవు?'

తల్లి చదివిన స్కూల్​కు హైటెక్​ హంగులు.. రూ.2కోట్లతో కొత్త భవనం

Last Updated :Apr 24, 2022, 3:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.