KA Paul on KCR: కేటీఆర్​కు సీఎం పదవి తప్పా ఏదీ కావాలన్నా ఇస్తాం: కేఏ పాల్

author img

By

Published : Apr 29, 2022, 8:32 PM IST

Updated : Apr 29, 2022, 8:54 PM IST

KA Pal on KCR

KA Paul on KCR: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను నిండా ముంచుతున్నాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. హైదరాబాద్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

KA Paul on KCR: ఎనిమిదేళ్లుగా రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరి ధాన్యం ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రశ్నించారు. కేటీఆర్​కు సీఎం పదవి తప్పా ఏదీ కావాలన్నా ఇస్తామని అన్నారు. తమతో కలిసి రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ను కోరారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుందనే కారణంగానే ఉద్యోగ నోటిఫికేషన్‌ వేశారని మండిపడ్డారు.

కేటీఆర్​కు సీఎం పదవి తప్పా ఏదీ కావాలన్నా ఇస్తాం: కేఏ పాల్

'కేటీఆర్​ను ఇక్కడ ముఖ్యమంత్రిని చేసేస్తాం. నేను దిల్లీలో కూర్చుంటా. పెద్ద భవనాలు కట్టేస్తాం. వెయ్యి కోట్లు ఎఫ్​డీలు కొనేద్దాం అన్నది ముఖ్యమంత్రి ఆలోచన. మీరు కూడా కాంగ్రెస్​లో విలీనం చేసి ఏ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ తీసుకోవడం కంటే మాతో కలిసి ఉండండి. అందరం కలిసి ప్రజలకు మంచి చేద్దాం. మీ కుమారుడు కేటీఆర్​కు సీఎం తప్ప ఏ పొజిషన్ కావాలన్నా ఇస్తాం. రాహుల్ గాంధీ రైతు సంగ్రామ సభ ఇప్పుడెందుకు? మంచివారిని నేను ఆహ్వానిస్తున్నా. ఈవీఎంల ద్వారా ఎన్నికల్లో మోసాలు జరుగుతున్నాయి. ఈవీఎంలు వద్దని దిల్లీ వెళ్లి చీఫ్ ఎలక్షన్ కమిషన్​ను కలిసి బ్యాలెట్ పెడతామని అడిగా. అయినా వాళ్లు వినిపించుకోలేదు. అందుకే కరప్షన్ జరిగింది. ఏపీ ఎలక్షన్ కమిషన్​ను కలిసి అడిగాను. ఇప్పుడు రెండేళ్లలో రెండు రాష్ట్రాల్లో ప్రతి నియోజకవర్గాలు తిరుగుతా. - కేఏ పాల్, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని కేఏ పాల్ ఆరోపించారు. రాహుల్ గాంధీకి రైతులు ఇప్పుడే గుర్తుకు వచ్చారా? అని నిలదీశారు. మే 6వ తేదీ వరంగల్‌లో రైతు సంగ్రామ సభ ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఏమి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతు సమస్యల పై మాట్లాడే అర్హత కాంగ్రెస్​కు లేదన్నారు. కేసీఆర్ ధన రాజకీయాల ముందు కోదండరాం లాంటి వారు గెలవలేరన్నారు. తెరాసకు వ్యతిరేకంగా అన్ని ప్రతిపక్ష పార్టీలు ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

ఇవీ చూడండి: ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిపై రూ.3 వేల కోట్ల ఫైన్​ విధించాలి: కేఏ పాల్​

పర్యావరణహితంగా మాస్టర్‌ ప్లాన్​లను రూపొందిస్తాం: మంత్రి కేటీఆర్‌

5-12 ఏళ్ల చిన్నారులకు కరోనా టీకాపై ట్విస్ట్!

Last Updated :Apr 29, 2022, 8:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.