ETV Bharat / state

ప్రచారంలో జోరు మీద ఉన్న ప్రధాన పార్టీలు - ఓట్ల వేటలో బిజీగా ఉన్న అభ్యర్థులు

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 17, 2023, 3:00 PM IST

Congress Election Campaign in Telangana 2023
BRS Election Campaign in Telangana 2023

Political Parties Election Campaign in Telangana 2023 : శాసనసభ ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. నియోజకవర్గాల్లో ఊరూవాడ సుడిగాలి పర్యటనలు చేస్తున్న అభ్యర్థులు.. ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు. పదేళ్ల పాలనలో కేసీఆర్‌ సర్కార్‌ చేపట్టిన పథకాలను వివరిస్తూ బీఆర్​ఎస్​ అభ్యర్థులు.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కాంగ్రెస్‌, బీజేపీ, ఇతర పార్టీల అభ్యర్థులు ప్రచారం సాగిస్తున్నారు. మైకుల మోత, డప్పు చప్పుళ్లు, కళాకారుల ఆటాపాట, నేతల ఉపన్యాసాలతో పల్లెలు పట్టణాలు సందడిగా మారాయి.

Political Parties Election Campaign in Telangana 2023 : హైదరాబాద్​లోని నాంపల్లి బీజేపీ అభ్యర్థి రాహుల్‌ చంద్రకు మద్దతుగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. బజార్‌ఘాట్‌లో పాదయాత్రగా వెళ్లి, ఓటర్లను కలిసిన కిషన్‌రెడ్డి.. ఇంటింటికి వెళ్లి, కరపత్రాలు అందజేశారు. సనత్‌నగర్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ప్రచారం నిర్వహించారు. ఉదయాన్నే నియోజకవర్గ పరిధిలోని సుభాష్‌నగర్, కైలాశ్‌నగర్‌ బస్తీల్లో పర్యటించిన మంత్రి.. ఇంటింటికి వెళ్లి, ఓట్లు అభ్యర్థించారు. గ్యారంటీలేని పార్టీలు ప్రజలకు గ్యారంటీలు ప్రకటిస్తున్నాయని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్​ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతోందని అన్నారు.

BJP Election Campaign in Telangana : హనుమకొండ 31 డివిజన్‌లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి రావు పద్మ ఇంటింటికి వెళ్లి, ఓటర్లను కలిశారు. దుబ్బాక నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు దౌల్తాబాద్‌ మండలంలో ప్రచారం నిర్వహించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన మాజీ మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు.. ఏఐసీసీ ఎన్నికల పరిశీలకులు రవీందర్ దాల్వి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో కోరుట్ల కాంగ్రెస్ అభ్యర్థి(Congress Leader Election Campaign in Telangana) జువ్వాడి నర్సింగరావు.. కార్నర్‌ సమావేశాలు, ఇంటింటి ప్రచారంతో ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

మూడోసారి గెలుపై లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రచార జోరు - ఇంటింటికి తిరుగుతూ ఓట్ల కోసం అభ్యర్థనలు

Jeevan Reddy Election Campaign in Jagtial : జగిత్యాల కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి.. వెల్దుర్తి, జాబితాపూర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఊరూరా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. బీఆర్​ఎస్​ ప్రభుత్వ తీరుపై విమర్శలు(Opposition Leaders Comments on BRS Leaders) చేశారు. దీంతో పాటు కాంగ్రెస్‌ గ్యారంటీలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం సాగిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు కాంగ్రెస్‌ అభ్యర్థి బీర్ల ఐలయ్యను గెలిపించాలంటూ ఆయన కుమార్తెలు ప్రచారం చేస్తున్నారు. యాదగిరిగుట్ట పురపాలిక పరిధిలో ఇంటింటికి వెళ్తూ.. కాంగ్రెస్‌కు ఓటేయాలని కోరారు. ఆలేరు బీఆర్​ఎస్​ అభ్యర్థి గొంగిడి సునీత.. యాదగిరిగుట్టలో ప్రచారం చేసే క్రమంలో ఓ వృద్ధుడికి అన్నం తినిపించారు.

విపక్షాల ప్రచార జోరు - అధికార పక్షంపై విమర్శల తూటాలు

BRS Election Campaign in Telangana 2023 : కొత్తగూడెం బీఆర్​ఎస్​ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు సింగరేణి వీకే- 5 గనిలో టీబీజీకేఎస్​ నేతలతో కలిసి, ప్రచారం చేశారు. కమ్యూనిస్టులంటే గౌరవం లేకుండా కూనంనేని వ్యవహరిస్తున్నారని వనామా విమర్శించారు. సింగరేణిని పరిరక్షించేది ముఖ్యమంత్రి కేసీఆర్​ అని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. రామగుండం బీఆర్​ఎస్​ అభ్యర్థి కోరుకంటి చందర్‌.. సింగరేణి ఓసీపీ-5 ప్రాజెక్టుపై ఎన్నికల ప్రచారం చేస్తూ, ఓట్లు అభ్యర్థించారు.

ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడం - కేటీఆర్ అమెరికాకు పారిపోవడం ఖాయం : మైనంపల్లి హన్మంతరావు

'నేను చేసిన అభివృద్ధే నన్ను గెలిపిస్తుంది - బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఖాయం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.