రైతు బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని విశ్వసించా-అందుకే రైతుబంధు, ధరణి : కేసీఆర్

రైతు బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని విశ్వసించా-అందుకే రైతుబంధు, ధరణి : కేసీఆర్
CM KCR Attends BRS Public Meeting at Narsapur : రైతు బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ విశ్వసించారు. అందుకే వారి కోసం రైతుబంధు, ధరణి, రైతు బీమా వంటి సంక్షేమాలను తీసుకువచ్చామని తెలిపారు. మెదక్ జిల్లాలోని నర్సాపూర్ నియోజకవర్గంలో జరిగిన బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు.
CM KCR Attends BRS Public Meeting at Narsapur : రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలిస్తే దౌల్తాబాద్‌ను మున్సిపాలిటీ చేస్తామని బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్(CM KCR) అన్నారు. భూ వివాదాలు ఉండకూడదనే మూడేళ్లు కష్టపడి ధరణి(Dharani Portal) తీసుకొచ్చామని స్పష్టం చేశారు. మెదక్ జిల్లాలోని నర్సాపూర్ నియోజకవర్గంలో జరిగిన బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని.. ప్రసంగించారు.
రైతులు బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని విశ్వసించామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి.. కానీ ప్రజాస్వామ్య ప్రక్రియలో ఆశించినంత పరిణతి ఇంకా రాలేదని పేర్కొన్నారు. ఇలా పరిణతి సాధించిన దేశాలు అభివృద్ధిలో ముందుకు సాగాయని ఈ సందర్భంగా చెప్పారు. ప్రజలకు ఉన్న ఏకైక ఆయుధం ఓటే(Vote)నని.. ఓటు వేసే ముందు ప్రజలు విచక్షణతో ఆలోచించి వేయాలని కోరారు.
బీఆర్‌ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం : బీఆర్‌ఎస్(BRS) పుట్టిందే తెలంగాణ ప్రజల కోసమని.. కాంగ్రెస్ హయాంలో పరిస్థితులు ఎలా ఉండేవో ప్రజలే ఆలోచించుకోవాలని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ హయాంలో సాగు, తాగునీటి, కరెంటు కష్టాలు ఉండేవని విమర్శించారు. హస్తం పార్టీ హయాంలో పింఛను రూ.200 ఉండేదని దానిని రూ.2000కు పెంచిన ఘనత బీఆర్‌ఎస్‌దేనని హర్షించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాగునీటిపై పన్ను రద్దు చేశామన్నారు.
Narsapur BRS Praja Ashirvada Sabha Today : తమ ప్రభుత్వ హయాంలో నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని.. రైతుబంధు వస్తుందని ఎవరైనా ఊహించారా సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ఇప్పుడు రైతుబంధు(Rythu Bandu) దుబారా అని కాంగ్రెస్ నేతలు అంటున్నారని.. రైతుబంధు దుబారానో కాదో ప్రజలే ఆలోచించుకోవాలన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతుబంధు రూ.16 వేలు పెరగాలంటే కచ్చితంగా బీఆర్‌ఎస్‌నే గెలిపించాలని సూచించారు.
CM KCR Public Meeting in Narsapur : 24 గంటల కరెంటు వృథా అని.. రైతులకు 3 గంటల విద్యుత్‌నే చాలని రేవంత్ రెడ్డి(KCR Fires Revanth Reddy) అంటున్నారని కేసీఆర్ మండిపడ్డారు. రైతులు 10 హెచ్‌పీ మోటార్లు వాడాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.. కాని రైతులకు ఆ మోటార్లను వాడే సామర్థ్యం ఉంటుందానని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అంటున్నారు.. అలాంటి ధరణిని తీసేస్తే రైతుబంధు, రైతుబీమా, ధాన్యం డబ్బులు ఎలా వస్తాయని ఓటర్లను అడిగారు. భూవివాదాలు ఉండకూడదనే మూడేళ్లు కష్టపడి ధరణిని తీసుకువచ్చామని.. దీంతో దళారులు తగ్గారని ఆనందించారు. కాంగ్రెస్ హయాంలో మంజీరా, హల్దీ నదులు ఎలా ఉండేవి.. ఇప్పుడు ఎలా ఉన్నాయో చూడాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు.
