ETV Bharat / state

లోకేశ్​ యువగళానికి షరతులతో కూడిన అనుమతి!

author img

By

Published : Jan 24, 2023, 2:28 PM IST

yuva galam
యువగళం

PERMISSION TO LOKESH PADAYATRA: ఈనెల 27 నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ యువగళం పాదయాత్రకు పోలీసులు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు. ఈ పాదయాత్ర కుప్పం నుంచి ప్రారంభమై శ్రీకాకుళం వరకు సాగనుంది. అయితే షరతులతో కూడిన అనుమతులు ఇవ్వడంపై టీడీపీ నాయకులు ఆలోచనలో పడ్డారు.

PERMISSION TO LOKESH PADAYATRA : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ "యువగళం" పాదయాత్రపై ఉత్కంఠ వీడింది. గత కొన్ని రోజుల నుంచి పాదయాత్రపై సందిగ్ధత నెలకొన్న సమయంలో.. దానికి తెరదించుతూ నేడు పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఎట్టకేలకు లోకేశ్​ ఆంధ్రప్రదేశ్​లోని కుప్పం నుంచి ప్రారంభించనున్న పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇచ్చారు.

ఈనెల 27న కుప్పంలో బహిరంగ సభకు అనుమతి ఇస్తున్నట్లు.. చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్‌ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. అయితే లోకేశ్​ పాదయాత్రలో షరతులతో కూడిన అనుమతులు ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. పాదయాత్రలో ప్రజలు, వాహన దారులు, ఎమర్జెన్సీ సర్వీసెస్ రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు కలిగించకూడదని సూచించారు.

ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం కలిగించకూడదని.. రహదారులపై సమావేశాలు నిర్వహించకూడదని తెలిపారు. పాదయాత్ర సందర్భంగా బాణసంచా పేల్చకూడదని.. పాదయాత్రలో పాల్గొనేవారు మారణాయుధాలు తీసుకెళ్లకూడదని సూచించారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసుల ఆదేశాలు పాటించాలని.. శాంతిభద్రతల నిర్వహణ, ట్రాఫిక్‌ నియంత్రణకు సహకరించాలని కోరారు.

అయితే షరతులతో కూడిన అనుమతులు తీసుకోవడంపై టీడీపీ నేతలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. న్యాయపరమైన సంప్రదింపుల తర్వాత అనుమతి పత్రాలు తీసుకోనున్నట్లు తెలిసింది. ఈ నెల 27న కుప్పం పట్టణంలోని వరదరాజస్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం లోకేశ్‌ పాదయాత్ర ప్రారంభమవుతుంది.

NARA LOKESH PADAYATRA ROUTE MAP : ఏపీలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, నిరుద్యోగమే ఏజెండాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ ఈ నెల 27 నుంచి పాదయాత్ర చేపట్టనున్న సంగతి విధితమే. రోజుకు 10కిలో మీటర్ల చొప్పున.. 400 రోజులు.. 4000 వేల కిలో మీటర్లు యాత్ర చేయనున్నారు. అయితే కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకూ సాగనున్న ఈ పాదయాత్ర రూట్​ మ్యాప్​ ఖరారైంది.

తొలిరోజు పాదయాత్ర షెడ్యూల్​: ఈ నెల 27న ఉదయం 11.03 గంటలకు పాదయాత్ర ప్రారంభించనున్నారు. తొలి 3 రోజులు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నియోజకవర్గంలోని లక్ష్మీపురంలోని వరదరాజస్వామి ఆలయంలో పూజల అనంతరం పాదయాత్ర ప్రారంభం కానుంది. కుప్పం బస్టాండ్‌, పార్టీ కార్యాలయం, ట్రాఫిక్‌ ఐల్యాండ్‌ జంక్షన్‌, కుప్పం ప్రభుత్వాస్పత్రి క్రాస్‌ రోడ్​, శెట్టిపల్లి క్రాస్‌ల మీదుగా పీఈఎస్‌ కళాశాల వరకు తొలిరోజు పాదయాత్ర సాగనుంది.

ఈనెల 28న పీఈఎస్‌ కళాశాల నుంచి శాంతిపురంలోని అరిముతనపల్లి వరకు సాగనుంది. ఈనెల 29న అరిముతనపల్లి నుంచి చెల్డిగానిపల్లె వరకు జరగనుంది. కుప్పంలో మూడు రోజుల పర్యటన నేపథ్యంలో 29 కిలో మీటర్ల మేర లోకేశ్​ పాదయాత్ర సాగనుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.