ETV Bharat / state

రాజాసింగ్‌పై పీడీ చట్టం కేసు.. తీర్పు రిజర్వ్‌ చేసిన సలహా మండలి

author img

By

Published : Sep 29, 2022, 5:41 PM IST

MLA Rajasingh PD ACT Case Updates: ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పీడీ చట్టం వ్యవహారంలో పీడీ చట్టం సలహా మండలి సమీక్ష నిర్వహించింది. బేగంపేటలోని గ్రీన్‌ల్యాండ్‌ అతిథి గృహంలో జరిగిన ఈ విచారణలో రాజాసింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. తనపై అక్రమంగా పీడీ చట్టం నమోదు చేసినట్టు రాజాసింగ్‌ తన వాదనలు వినిపించారు. వాదనలు విన్న పీడీ చట్టం సలహా మండలి తీర్పును వాయిదా వేసింది.

రాజాసింగ్‌పై పీడీ చట్టం కేసు.. తీర్పు రిజర్వ్‌ చేసిన సలహా మండలి
రాజాసింగ్‌పై పీడీ చట్టం కేసు.. తీర్పు రిజర్వ్‌ చేసిన సలహా మండలి

MLA Rajasingh PD ACT Case Updates: గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పీడీ చట్టం వ్యవహారంలో సమీక్ష జరిగింది. పీడీ చట్టం సలహా మండలి సమావేశమై ఈ కేసును సమీక్షించారు. బేగంపేటలోని గ్రీన్‌ల్యాండ్‌ అతిథి గృహంలో సమావేశమైన సలహా మండలి.. దీనిపై విచారణ నిర్వహించింది. రాజాసింగ్‌పై పీడీ చట్టం నమోదు చేయడానికి గల కారణాలు, ఆధారాలను మంగళ్‌హాట్ పోలీసులు ఇప్పటికే పీడీ చట్టం సలహా మండలికి అందించారు. చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న రాజాసింగ్.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు. రాజాసింగ్ భార్య ఉషాబాయి, ఆయన తరఫు న్యాయవాది సలహా మండలి ఎదుట హాజరయ్యారు.

ఈ సందర్భంగా తనపై అక్రమంగా పీడీ చట్టం నమోదు చేసినట్టు రాజాసింగ్‌ సలహా మండలికి తన వాదనలు వినిపించారు. వాదనలు విన్న పీడీ చట్టం సలహా మండలి తీర్పును వాయిదా వేసింది. మూడు, నాలుగు వారాల్లో మండలి తీర్పు వెల్లడించే అవకాశం ఉందని రాజాసింగ్‌ తరఫు న్యాయవాది కరుణాసాగర్‌ తెలిపారు. ఇదిలా ఉండగా రాజాసింగ్‌ సతీమణి ఉషాబాయి సైతం ఈ విషయంపై ఇప్పటికే హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఇవీ చూడండి..

పీడీ యాక్ట్​ తొలగించేలా చర్యలు తీసుకోవాలి: గవర్నర్​కు రాజాసింగ్​ సతీమణి వినతి

రాజాసింగ్‌ను సస్పెండ్ చేసిన భాజపా అధిష్ఠానం

'అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయట్లేదు'.. గహ్లోత్ ప్రకటన.. సోనియాకు క్షమాపణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.