ETV Bharat / state

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి: ఉత్తమ్​

author img

By

Published : May 5, 2020, 8:34 PM IST

pcc chief uttamkumar reddy comments on telangana government
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి: ఉత్తమ్​

కరోనా కట్టడికి ప్రభుత్వం పెట్టిన ఖర్చు చాలా తక్కువగా ఉందని, ఆర్థిక విషయాలను ప్రభుత్వ దాస్తోందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్​ చేశారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. మార్చి నెలలో 20వ తేదీ వరకు సాధారణ రాబడులు వచ్చాయని, పెద్ద ఎత్తున కొవిడ్‌-19 విరాళాలు వస్తున్నాయన్నారు. బాండ్ల ద్వారా 4వేలు కోట్లు సేకరించిన ప్రభుత్వం.. ఉద్యోగులకు పూర్తి వేతనాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కరోనా కట్టడికి ప్రభుత్వం పెట్టిన ఖర్చు చాలా తక్కువగా ఉందని పేర్కొన్న ఆయన.. ఆర్ధిక విషయాలను ప్రభుత్వం దాస్తోందని ఆరోపించారు. బత్తాయిలో సీ విటమిన్‌ ఉంటుందని..తద్వారా ఇమ్యూనిటి పెరుగుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారని...‌ బత్తాయిలను ప్రభుత్వమే కొనుగోలు చేసి రేషన్‌ ద్వారా పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. నిమ్మకాయలకు, పసుపునకు మార్కెట్‌ లేదని...ఆయా రైతులను మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ ద్వారా ప్రభుత్వం ఆదుకోనట్లయితే.. కరోనా వల్ల ఎంత నష్టం జరుగుతుందో... అంతకంటే ఎక్కువ నష్టం చవిచూడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

లాక్‌డౌన్‌ కొనసాగుతున్న తరుణంలో మద్యం దుకాణాలు తెరవడం మంచిదికాదని ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆదాయం లేని ఈ పరిస్థితుల్లో తాగి ఇంట్లో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడతారని... తద్వారా గృహ హింస పెరుగుతుందని పేర్కొన్నారు. బిల్డింగ్‌ ఫండ్‌ రూ.900 కోట్లు దారి మళ్లించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి... 28లక్షల మంది రిజిస్టర్డు కార్మికులు ఉన్నారని... ఒక్కొక్కరికి రెండు వేల చొప్పున నగదు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ఇవీ చూడండి: రాష్ట్ర మంత్రివర్గం భేటీ.. లాక్​డౌన్​పై కీలక చర్చ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.