ETV Bharat / state

Opposition parties Telangana Election Campaign 2023 : బీఆర్​ఎస్​ని అధికారం నుంచి దించేందుకు.. ప్రతిపక్షాల వ్యూహాలు

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 28, 2023, 11:25 AM IST

Opposition parties Telangana Election Campaign 2023 : రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చే సార్వత్రిక పోరుపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీలు ప్రత్యేక దృష్టి సారించాయి. తెలంగాణలో అధికార పార్టీ బీఆర్​ఎస్​ను ఢీకొట్టి బరిలో సత్తా చాటేందుకు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఇవాళ నుంచి కాంగ్రెస్‌ రెండో విడత బస్సు యాత్ర ప్రారంభం కానుండగా, రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరేసే విధంగా కమలదళం ప్రణాళికలు రచిస్తోంది.

BJP MP Dharmapuri Arvind fires on CM KCR
Congress vs BRS Election campaign

Opposition parties Election Campaign 2023 బీఆర్​ఎస్​కు ఒక్క సీటు కూడా రానివ్వం

Opposition parties Telangana Election Campaign 2023 : ఆరు గ్యారెంటీలు, బస్సు యాత్రలతో కాంగ్రెస్‌ ప్రచార జోరు పెంచింది. ఇప్పటికే పార్టీలోకి చేరికల జోష్‌ కొనసాగుతుండగా.. రెండో జాబితాతో కలిపి మొత్తం 100 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. పకడ్బందీ చర్యలతో అధికారం ఛేజిక్కించుకునేలా కదన రంగంలోకి వెళ్తోంది. ఈనెల 29న సంగారెడ్డిలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సభ నిర్వహించనున్నట్లు కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు.

Mynampally Hanumantha Rao Comments on Harish Rao : మెదక్‌ జిల్లాను దోచుకోవడం, వెన్నుపోటు పొడవడం మంత్రి హరీశ్‌రావుకు అలవాటైందని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆరోపించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని ప్రసిద్ధ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో స్థానిక అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అవినీతి మయమైన బీఆర్​ఎస్ సర్కార్‌(BRS Government)కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. పాలేరు సభలో సీఎం కేసీఆర్​ తనపై చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధాలని తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.

Telangana Assembly Election Campaign : రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా ఎన్నికల ప్రచారం.. నువ్వానేనా అన్నట్లు తలపడుతున్న పార్టీలు

BJP vs Janasena Ticket Issue in Hyderabad : వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో జెండా ఎగరేసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. కోరుట్లలో పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ అర్వింద్‌(MP Arvind).. అనంతరం బూత్‌స్థాయి ఇంఛార్జుల సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌ గౌలిగూడలో గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు. బీఆర్ఎస్​కు రాజీనామా చేసిన చేవేళ్ల మాజీ ఎమ్మెల్యే కేసు రత్నం గెలిచినా.. ఓడినా బీజేపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. కూకట్‌పల్లి నియోజకవర్గం సీటు జనసేనకు ఇస్తారనే ప్రచారంలో వాస్తవం లేదని స్థానిక బీజేపీ నేతలు వెల్లడించారు. జనసేనతో పొత్తు విషయంల ఇంకా స్పష్టత రాలేదని.. అధిష్టానం నిర్ణయించాక స్పష్టత వచ్చి.. సీట్లు విషయం తెలుస్తుందని బీజేపీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Telangana Congress MLA Candidates Second List : కీలక స్థానాలతో కాంగ్రెస్ రెండో జాబితా.. లిస్టులో గద్దర్ కుమార్తె, అజహరుద్దీన్

OU JAC President Comments on BRS : మహేశ్వరం నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభించిన అందెల శ్రీరాములు.. కమలం పార్టీపై ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారని తెలిపారు. బీజేపీ టికెటివ్వకుండా మోసం చేసిందంటూ నిర్మల్‌ జిల్లా భైంసాలో పడకంటి రమాదేవి(Padakanti Ramadevi) పార్టీకి రాజీనామా చేశారు. సొంత అల్లుడ్ని గెలిపించుకునేందుకు సీటు బీసీలకు ఇస్తున్నారనే వ్యాఖ్యలను డీకే అరుణ భర్త, భరతసింహా రెడ్డి ఖండించారు. రాష్ట్రంలో బీఆర్​ఎస్​ను ఒక్క సీటు గెలవనివ్వబోమని ఓయూ జేఏసీ అధ్యక్షుడు మోతిలాల్‌ నాయక్‌ అన్నారు.

BJP MP Dharmapuri Arvind fires on CM KCR : 'కోరుట్లలో 20వేల మెజార్టీతో గెలుస్తా.. ఇదే నా సవాల్‌'

CM KCR Wardhannapet Public Meeting Speech : బీఆర్​ఎస్​ ప్రభుత్వం.. అన్ని వర్గాల వారికి సమన్యాయం చేస్తోంది : కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.