ETV Bharat / state

మరో 7 ఆలయాల్లో ఆన్​లైన్​ పూజలు

author img

By

Published : May 1, 2020, 5:37 PM IST

లాక్​డౌన్​ కారణంగా రాష్ట్రంలోని మరో ఏడు దేవాలయాల్లోనూ ఆన్​లైన్ పూజల సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. మీ సేవ పోర్టల్​లో భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకొని ఆన్​లైన్​ ద్వారా చేయాల్సిన పూజలను ఎంచుకోవచ్చని దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ చెప్పారు.

మరో 7 ఆలయాల్లో ఆన్​లైన్​ పూజలు
మరో 7 ఆలయాల్లో ఆన్​లైన్​ పూజలు

లాక్​డౌన్​ వల్ల భక్తులకు ఆలయాల్లోకి అనుమతి లేనందున రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో ఆన్​లైన్ ద్వారా పూజలు చేసుకునే అవకాశాన్ని దేవాదాయ శాఖ కల్పించింది. యాదాద్రి, భద్రాద్రి, వేములవాడ, బాసర, సికింద్రాబాద్ గణేశ్​ ఆలయం సహా రాష్ట్రంలోని 12 దేవాలయాల్లో ఇప్పటికే ఆన్​లైన్ ద్వారా పూజల సదుపాయం కొనసాగుతోంది.

తాజాగా మరో ఏడు ఆలయాల్లోనూ ఈ సౌకర్యాన్ని దేవాదాయ శాఖ కల్పించింది. కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం, తాడ్​బండ్ ఆంజయనేయ స్వామి ఆలయం, ఆలంపూర్ జోగులాంబ ఆలయం, కీసర రామలింగేశ్వరస్వామి ఆలయం, శ్రీనగర్ కాలనీ వేంకటేశ్వరస్వామి ఆలయం, చెరువుగట్టు రామలింగేశ్వరస్వామి ఆలయం, జమాలపురం వేంకటేశ్వరస్వామి ఆలయంలోనూ ఆన్​లైన్ సేవలు పొందవచ్చని తెలిపింది. భక్తుల పేరిట పూజలు చేసి వారి చరవాణికి సందేశం అందిస్తామని దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ చెప్పారు.

ఇదీ చూడండి: వలసకూలీల తరలింపునకు నేటినుంచి ప్రత్యేక రైళ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.