ETV Bharat / state

Onions Price in Telangana : ఉల్లి ధరలకు రెక్కలు.. వినియోగదారులకు చుక్కలు

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 10, 2023, 5:17 PM IST

Onions Price in Telangana : మొన్నటి వరకు ఆకాశాన్నంటిన ధరలతో వినియోగదారులకు చుక్కలు చూపించిన టమాట.. నేడు తగ్గిన ధరలతో పాతాళానికి పడిపోయింది. ఇప్పుడిక ఉల్లి వంతు వచ్చింది. రోజురోజుకూ పెరుగుతోన్న ధరలతో సామాన్యులకు గుదిబండగా మారుతోంది. ఆగస్టు ప్రారంభంలో రూ.25గా ఉన్న కిలో ఉల్లి ధర.. నేడు రూ.35 నుంచి 40 వరకు ఉంది.

Increased prices of Onions
Increased Prices of Daily Essentials

Onions Price in Telangana 2023 : పెరిగిన ఉల్లి ధరలతో(Onions Price Rises) సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. గత నెల ఆగస్టు 5న రైతు బజారులో ఉల్లిగడ్డ కిలో ధర రూ.20 ఉంటే ప్రస్తుతం రూ.28కు అమ్ముతున్నారు. సూపర్‌బజార్​, రిటైల్‌ మార్కెట్లలో ఆగస్టులో కిలో ధర రూ.25 ఉంటే నేడది రూ.35 నుంచి 40కి చేరింది. ఉల్లి ధరలు కూడా అమాంతం పెరిగేవే కానీ.. కేంద్రం ఉల్లిని విదేశీ ఎగుమతులపై పన్ను 40 శాతానికి పెంచడంతో ధరలు అందుబాటులో ఉన్నాయని మలక్‌పేట మార్కెట్‌ స్పెషల్‌గ్రేడ్‌ సెక్రటరీ దామోదర్‌ పేర్కొన్నారు.

టమాటా పంటకు సీసీ కెమెరాలతో రక్షణ.. చోరీ భయంతో రైతుల జాగ్రత్తలు

ప్రభుత్వ సంస్థ నాఫెడ్‌ దగ్గర కూడా తగినన్ని నిల్వలున్నాయన్నారు. వచ్చే నవంబరులో కొత్త పంట కూడా మార్కెట్​లోకి రానుందన్నారు. ప్రస్తుతం నగరానికి 5 వేల నుంచి 6 వేల క్వింటాళ్లు మాత్రమే రావడంతో ధరలు కాస్త పెరుగుతున్నాయన్నారు. వాస్తవానికి గతంలో నగరానికి రోజూ 8 వేల క్వింటాళ్ల వరకూ వచ్చేదని.. ఆ మేరకు వస్తే కిలో రూ.20 నుంచి రూ.25కి దొరుకుతుందని పేర్కొన్నారు. ఉల్లి ధరలు నవంబరు వరకూ నెమ్మదిగా పెరిగినా తర్వాత తగ్గుముఖం పడతాయని దామోదర్‌ తెలిపారు.

Onion Prices in Raithubazar Hyderabad : ఎండాకాలంలో కురిసిన అకాల వర్షాలతో.. పంటలు చేతికందే సమయానికి తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో కూరగాయాల ధరలు అమాంతం ఆకాశాన్నంటాయి. గడిచిన నెల రోజుల క్రితం వరకూ పెరిగిన ధరలతో టమాటా(Tomato Prices) వినియోగదారులను హడలెత్తించింది. ప్రస్తుతం మార్కెట్​లోకి వచ్చేసరికి.. ధరలు ఒక్కసారిగా పడిపోయాయి.

Tomato Price Hyderabad Today : హమ్మయ్య.. దిగొచ్చావా టమాటా.. అయితే టేస్ట్ చేయాల్సిందే..!

Decreased Tomato Prices : కిలో రూ.200ల వరకూ ఆల్​టైం రికార్డు ధర పలికిన టమాటా.. నేడు రూ.వందకు 6 కిలోలు కొనండంటూ బస్తీలను, కాలనీలను చుట్టి వస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్​లో రైతుబజార్లలో కిలో రూ.13కు విక్రయిస్తున్నారు. మార్కెట్​కు తరలింపు.. పెరిగిన రవాణా ఖర్చుల వల్ల ఇంత ధర పలుకుతోంది కానీ.. రైతులకు కిలోకి రూ.3 నుంచి 5 వరకే చెల్లిస్తున్నారు.

టమాటాకు మంచి ధర ఉందని.. ఆగమేఘాల మీద పంట సాగు చేస్తే ధర పడిపోయిందని చేవెళ్ల రైతు భాస్కర రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని బోయినపల్లి, గుడిమల్కాపూర్‌ మార్కెట్‌లతో పాటు రైతుబజార్లకు టమాటా 7 వేల క్వింటాళ్లు వస్తోంది. నగరం చుట్టుపక్కల జిల్లాల రైతులు కూడా.. సరుకును మార్కెట్లకు తరలించడంతో ధరలు గణనీయంగా పడిపోయాయి.

Tomato Farmer Millionaire : ఎకరంలో టమాటా సాగు.. మూడు నెలల్లోనే లక్షాధికారిగా మారిన రైతు

ఉల్లి సంక్షోభం.. రాబోయే రోజుల్లో రైతులకు కన్నీరు తెప్పించడం ఖాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.