ETV Bharat / state

'నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు'

author img

By

Published : May 18, 2021, 1:48 PM IST

officers inspection in shop, corona in hyderabad
హైదరాబాద్ దుకాణాల్లో తనిఖీలు, హైదరాబాద్​లో కరోనా

కరోనా రెండో దశ ప్రభావంతో అధికారులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్​లోని పలు దుకాణాల్లో కరోనా నిబంధనల అమలుపై తనిఖీలు చేపట్టారు. ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల అధికారి హెచ్చరించారు.

హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో పౌరసరఫరాల, డ్రగ్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మెడికల్‌ షాప్‌లు, మాల్స్‌లోనూ తనిఖీలు చేపడుతున్నారు. పంజాగుట్టలోని ఓ ఫార్మసీ, మరో మెడికల్‌ హాల్‌లో అధికారులు సోదాలు జరిపారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా భౌతిక దూరం పాటిస్తూ, విధిగా మాస్కులు ధరించాలని సూచించారు.

కరోనా నిబంధనలు పాటించనివారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల విభాగం అధికారి బాలరాజు హెచ్చరించారు. పౌరసరఫరాల విభాగం అధికారులతో పాటు డ్రగ్స్ అధికారులు, ఫుడ్‌ సెప్టీ అధికారులు, న్యాయ సలహాదారులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ఈటల రాజీనామా చేస్తే ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాం: గంగుల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.