ETV Bharat / state

వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నీట్

author img

By

Published : Sep 13, 2020, 5:01 AM IST

వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నీట్
వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నీట్

వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆదివారం దేశవ్యాప్తంగా నీట్.. పరీక్ష జరగనుంది. కరోనా పరిస్థితుల వల్ల.. గతంలో వాయిదా పడిన నీట్​ను సెప్టెంబర్​ 13న రాత పరీక్ష విధానంలో జరిపేందుకు ఎన్​టీఏ ఏర్పాట్లు చేసింది. దేశవ్యాప్తంగా 15 లక్షల 97 వేలు.. రాష్ట్రంలో 55 వేల 810 అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మాస్కులు, గ్లౌజులు అనుమతించాలని నిర్ణయించిన జాతీయ పరీక్షల సంస్థ.. బూట్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, కొన్ని ఆభరణాలకు అనుమతి లేదని స్పష్టం చేసింది.

వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం సెప్టెంబర్​ 13న నీట్ నిర్వహించేందుకు దేశవ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు పరీక్ష జరగనుంది. ఈ ఏడాది కరోనా నేపథ్యంలో గతంలో వాయిదా పడిన నీట్... మళ్లీ వాయిదా పడుతుందా.. కొనసాగుతుందా అనే ఉత్కంఠ చివరి వరకు కొనసాగింది. కరోనా నివారణ జాగ్రత్తలన్నీ తీసుకున్నట్టు ఎన్​టీఏ చెబుతోంది.

రాష్ట్రంలో 112 పరీక్ష కేంద్రాలు:

దేశ వ్యాప్తంగా 15 లక్షల 97 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది దేశవ్యాప్తంగా 2 వేల 546 పరీక్ష కేంద్రాలు ఉండగా.. భౌతిక దూరం పాటించేందుకు.. ఈసారి 3 వేల 840కు పెంచారు. ఒక గదిలో గతంలో 24 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. ఈ ఏడాది 12 మంది మాత్రమే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది. రాష్ట్రంలో గతేడాది 54 వేల 73 మంది కోసం 79 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా.. ఈ సంవత్సరం 55 వేల 810 అభ్యర్థుల కోసం 112 కేంద్రాలను సిద్ధం చేసింది. హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మంలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.

గ్లౌజులు, ఫేస్‌ షీల్డ్ కూడా అనుమతి:

విద్యార్థులు కచ్చితంగా మాస్కు ధరించాలని ఎన్​టీఏ స్పష్టం చేసింది. గ్లౌజులు, ఫేస్‌ షీల్డ్ కూడా అనుమతిస్తామని పేర్కొంది. పరీక్ష కేంద్రాల వద్ద థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్ ఏర్పాట్లను చేసింది. అయితే గతంలో మాదిరిగానే బూట్లు, చేతి గడియారాలు, ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించేది లేదని స్పష్టం చేసింది. ఆచారాలకు సంబంధించిన ఆభరణాలు మినహా... ప్రత్యేక ఆభరణాలు ధరించవద్దని పేర్కొంది. అక్టోబర్‌లో ప్రవేశాల ప్రక్రియ జరగనుంది.

ఇదీ చదవండి: ఆదివారం నీట్ 2020‌ పరీక్ష.. ఫాలో కావలసిన రూల్స్ ఇవే !

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.