ETV Bharat / state

ఘనంగా కులాంతర, మతాంతర వివాహ వేడుకలు

author img

By

Published : Jan 27, 2021, 7:31 AM IST

హైదరాబాద్​లో కుల నిర్మూలన సంఘం ఆధ్వర్యంలో 49వ కులాంతర, మతాంతర వివాహ మహోత్సవం జరిగింది. ఈ వేడుకలకు రాష్ట్ర మానవ హక్కుల సంఘం ఛైర్మన్ జస్టిస్. చంద్రయ్య హాజరయ్యారు. నూతన దంపతులను సన్మానించిన ఆయన భవిష్యత్తులో కూడా ఇదే నమ్మకంతో ముందుకు సాగాలన్నారు.

n Hyderabad .. Chairman of the State Human Rights Commission attended the 49th inter-caste and inter-religious wedding ceremony
'ఒకరిని ఒకరు అర్థం చేసుకుని.. ముందుకు సాగాలి'

హైదరాబాద్​లోని ఇందిరా పార్క్​ ఆవరణలో.. కుల నిర్మూలన సంఘం ఆధ్వర్యంలో 49వ కులాంతర, మతాంతర వివాహ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర మానవ హక్కుల సంఘం ఛైర్మన్​ జస్టిస్​ చంద్రయ్య హాజరయ్యారు. కుల నిర్మూలన సంఘం ఆధ్వర్యంలో వివాహం చేసుకున్న నూతన జంటలకు శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు.

అభినందనీయం..

ఒకరిని ఒకరు అర్థం చేసుకుని పెళ్లి చేసుకున్న జంట ఇదే నమ్మకంతో ముందుకు సాగాలని కోరారు. అనంతరం ప్రతి సంవత్సరం.. ఎంతో మందికి వివాహం జరిపిస్తున్న కుల నిర్మూలన సంఘం సేవలను ప్రశంసించారు.

ఇదీ చదవండి:ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణ: గవర్నర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.