RP Patnaik: హత్యాచార నిందితుడు రాజును పట్టిస్తే.. నేనూ రివార్డు ఇస్తా.!

author img

By

Published : Sep 15, 2021, 11:40 AM IST

Updated : Sep 15, 2021, 5:03 PM IST

rp patnaik

సైదాబాద్​ హత్యాచార ఘటనపై యావత్​ రాష్ట్రం ఆగ్రహం, విచారం వ్యక్తం చేస్తోంది. ఘటనకు పాల్పడిన రాజును అరెస్టు చేసి.. కఠిన శిక్ష పడేలా చేయాలని ప్రజలు కోరుతున్నారు. సెలబ్రిటీలు సైతం ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడు రాజుని పట్టిస్తే తన వంతుగా రూ. 50వేలు రివార్డు అందిస్తానని సంగీత దర్శకుడు ఆర్​పీ పట్నాయక్​ ప్రకటించారు. ఆ మానవ మృగాన్ని పట్టుకోవడంలో పోలీసు శాఖకు సహకరించాలని కోరారు.

సైదాబాద్​ హత్యాచార ఘటనలో చిన్నారికి న్యాయం జరగాలన్నా.. ఆమె ఆత్మ శాంతించాలన్నా.. నిందితుడు పల్లకొండ రాజు దొరకాలని సంగీత దర్శకుడు ఆర్​పీ పట్నాయక్​ ఆకాంక్షించారు. నిందితుడిని పట్టుకున్న వారికి పోలీసులు రూ. 10 లక్షలు రివార్డు ప్రకటించగా.... తన వంతుగా రూ. 50,000 ఇస్తానని వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

నిందితుడు దొరకాలని... ఇందుకు ప్రతి ఒక్కరి సహకారం ముఖ్యమన్నారు. నిందితుని చేతిపై "మౌనిక' అనే పచ్చబొట్టు తప్పకుండా అతడిని పట్టించేలా చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అతను మనకు దగ్గర్లోనే ఉండొచ్చని.. నిఘా వేసి ఉంచాలని సూచించారు. నిందితుడిని పట్టుకోవడంలో పోలీసు శాఖకి సహకరించాలని కోరారు.

చిట్టితల్లికి న్యాయం జరగాలంటే, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటే నిందితుడు రాజు దొరకాలి. అతడి ఆచూకీ తెలియజేసిన వారికి రూ.10 లక్షలు రివార్డు ఇస్తామని హైదరాబాద్‌ పోలీసులు ప్రకటించారు. పట్టించిన వారికి నా వంతుగా రూ.50 వేలు ఇస్తాను. అతడు దొరకాలి. చేతిపై ‘మౌనిక’ అనే పచ్చబొట్టు తప్పకుండా అతడిని పట్టించేలా చేస్తుంది. అతడు మీ దగ్గర్లోనే ఉండొచ్చు. ఒక కన్ను వేసి ఉంచండి. ఆ కిరాతకుడిని పట్టుకునే పనిలో పోలీసు శాఖకు మన వంతు సాయం అందిద్దాం’

-ఆర్​పీ పట్నాయక్​, సంగీత దర్శకుడు

RP Patnaik: హత్యాచార నిందితుడు రాజును పట్టిస్తే.. నేనూ రివార్డు ఇస్తా.!

ఇదీ చదవండి: Saidabad rape case: హత్యాచార నిందితుడు రాజును పట్టిస్తే రూ. 10 లక్షలు

saidabad incident: రాజు ఎక్కడున్నాడు? తప్పించుకోవడానికి సహకరించింది ఎవరు?

Saidabad incident: ఇంకా దొరకని కామాంధుడు.. కారణం అదే.. ఇవిగో సీసీటీవీ దృశ్యాలు..!

Last Updated :Sep 15, 2021, 5:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.