ETV Bharat / state

Uttam kumar reddy on trs: 'తెరాస ప్రభుత్వంలో మహిళలకు తీవ్ర అన్యాయం'

author img

By

Published : Sep 5, 2021, 2:21 PM IST

Updated : Sep 5, 2021, 2:51 PM IST

Uttam kumar reddy on trs, Uttam kumar allegations on cm kcr
తెరాసపై ఉత్తమ్ కుమార్ ఆరోపణలు, సీఎం కేసీఆర్​పై ఉత్తమ్ కుమార్ ఆరోపణ

మహిళలన్ని తెరాస(trs) ప్రభుత్వం మోసం చేస్తోందని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి(uttam kumar reddy) ఆరోపించారు. అభయ హస్తంలో పింఛన్లు ఇవ్వకపోగా... మహిళలు కట్టిన రూ.1,250 కోట్లు కూడా వెనక్కి ఇవ్వడం లేదని అన్నారు. మహిళా సాధికారతకు(women empowerment) కాంగ్రెస్(congress party) పెద్దపీట వేసిందని గుర్తు చేశారు.

తెరాసపై ఉత్తమ్ కుమార్ ఆరోపణలు

తెరాస(trs) ప్రభుత్వంలో మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఎంపీ ఉత్తమ్ కుమార్(uttamkumar reddy) రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం వడ్డీలు ఇవ్వకపోగా... మహిళల నుంచి వసూలు చేయాలని ఒత్తిడి పెంచుతోందని విమర్శించారు. చెల్లించని చోట అధికారులను సస్పెండ్ చేస్తున్నారని అన్నారు. మహిళా సాధికారతకు(women empowerment) కాంగ్రెస్(congress party) పెద్దపీట వేసిందని గుర్తు చేశారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇచ్చిందని గాంధీ భవన్​లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పేర్కొన్నారు.

మహిళల్ని తెరాస మోసం చేస్తోందని ఆరోపించారు. అభయ హస్తంలో పింఛన్లు ఇవ్వకపోగా... మహిళలు కట్టిన రూ.1,250 కోట్లు కూడా వెనక్కి ఇవ్వడం లేదని విమర్శించారు. సెర్ప్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. మహిళా సంఘాల సభ్యులు చనిపోతే కాంగ్రెస్ హయాంలో రూ.25 వేలు ఇచ్చారని... ఇప్పుడు రూపాయి కూడా ఇవ్వడం లేదని అన్నారు.

కేసీఆర్ సీఎం(cm kcr) అయ్యాక వడ్డీలేని రుణ పరిమితి రూ.10 లక్షలకు పెంచుతామన్నారు. కానీ ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా మహిళా సంఘాలకు వడ్డీలేని రుణం ఇవ్వలేదు. రూ.3,000 కోట్లు మహిళా సంఘాలకు బకాయి పడింది. ఒక్కో మహిళకు రూ.5 నుంచి 10 వేలు బాకీ ఉన్నారు. కానీ హుజూరాబాద్​లో ఉప ఎన్నికలు ఉన్నాయని రూ.50 కోట్లు విడుదల చేశారు.

-ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ

ఇదీ చదవండి: YADADRI: యాదాద్రికి పోటెత్తిన భక్తులు.. కోలాహలంగా ఆలయ పరిసరాలు

Last Updated :Sep 5, 2021, 2:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.