ETV Bharat / state

స్ఫూర్తిదాయక వీడియో షేర్‌ చేసిన ఎంపీ సంతోష్

author img

By

Published : Apr 1, 2021, 12:20 PM IST

కరోనా నియంత్రణకు మాస్క్‌ తప్పనిసరని ఎంపీ సంతోష్​ కుమార్​ పేర్కొన్నారు. ట్విటర్​లో స్ఫూర్తిదాయక వీడియోను షేర్ చేశారు.

MP Santosh,  inspiring video on Twitter
స్ఫూర్తిదాయక వీడియో షేర్‌ చేసిన ఎంపీ సంతోష్

కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తుండగా.. మాస్కులు తప్పనిసరిగా ధరించాలంటూ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ స్ఫూర్తిదాయక ట్వీట్ చేశారు. దివ్యాంగులు సైతం ఎంతో బాధ్యతతో మాస్కులు ధరిస్తున్న వీడియోను ట్విట్టర్ ద్వారా సంతోష్‌ షేర్ చేశారు.

  • Do we really need an inspiration to save ourselves from a pandemic like COVID? Man! It’s surging again! Need to be very careful for the sake of our family and others around us. Comply with all the necessary protocols. WearingMask is mandatory, else your negligence will cost a lot pic.twitter.com/21CAKMDmL5

    — Santosh Kumar J (@MPsantoshtrs) April 1, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

చేతులు లేకపోవడంతో కాళ్లతో, కృతిమ అవయవాల సహాయంతో మాస్కులు పెట్టుకున్న వారు... తామే మాస్కులు ధరిస్తున్నామని... మీరు కూడా ధరించవచ్చని విజ్ఞప్తి చేశారు. ఎలాంటి మినహాయింపులు ఇవ్వవద్దని కోరారు. మన కుటుంబం, చుట్టుపక్కల వారందరి బాగు కోసం మాస్కులు విధిగా ధరిద్దామని ఎంపీ సంతోష్ కోరారు.

  • “ఈరోజున అందర్నీ ఏప్రిల్ ఫూల్ చేయాలని చూడ్డం కాదు, వీలైతే ఓ మొక్క నాటి 'ఏప్రిల్ కూల్' చేయాలి...”

    Bcoz #AprilFool is outdated. #AprilCool is updated. Plant a Sapling and make environment cool 🌱🌱🌱. #GreenIndiaChallenge🌳🌳🌳. pic.twitter.com/599Mcdnqz2

    — Santosh Kumar J (@MPsantoshtrs) April 1, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అలాగే ఈరోజు ఏప్రిల్ 1 అందర్నీ ఏప్రిల్ ఫూల్ చేయాలని చూడ్డం కాదని హితవు పలికారు. వీలైతే ఓ మొక్కనాటి 'ఏప్రిల్ కూల్' చేయాలని సూచించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.