ETV Bharat / state

MP Keshava Rao Speech in Parliament Special Sessions : ధనిక, పేద తారతమ్యాలపై సభలో చర్చించాలి: కె.కేశవరావు

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 18, 2023, 4:07 PM IST

MP Keshava Rao Speech in Parliament Special Sessions : దేశంలో ఒక పార్టీనే కాకుండా.. దేశం మొత్తం అభివృద్ధి చెందాలని బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ నేత కేశవరావు అన్నారు. 40 శాతం దేశ సంపద ఒక్క శాతం జనాభా చేతుల్లోనే ఉందని తెలిపారు. పార్లమెంట్​ ప్రత్యేక సమావేశాల్లో పాల్గొన్న ఆయన.. ఈ మేరకు వ్యాఖ్యానించారు.

Keshava Rao speech
Keshava Rao speech in Special Sessions of Parliament

MP Keshava Rao Speech in Parliament Special Sessions : 40 శాతం దేశ సంపద ఒక్క శాతం జనాభా చేతుల్లోనే ఉందని బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ నేత కేశవరావు(Keshava Rao) అన్నారు. ఒక పార్టీనే కాకుండా దేశం మొత్తం అభివృద్ధి చెందాలని తెలిపారు. దిల్లీలో జరుగుతోన్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో పాల్గొన్న ఆయన.. ఈ మేరకు మాట్లాడారు. భారతదేశ జనాభా ఎంతో వైవిధ్య భరితమైందని.. మొదటి నుంచి లౌకికవాదానికి(Secularism) ప్రాధాన్యత ఇస్తోందని కేశవరావు చెప్పారు. హిందూ పదం ఆరో శతాబ్దం తర్వాత వచ్చిందని వివరించారు. రాజ్యాంగ ప్రవేశికలోనూ లౌకికవాదం గురించి చెప్పారని గుర్తు చేశారు. ధనిక, పేద తారతమ్యాలపై సభలో చర్చించాలని కోరారు. ఈ సువిశాల భారతదేశంలో సుమారు 3 వేలకు పైగా జాతులు ఉన్నాయన్నారు.

అంతకు ముందు అఖిలపక్ష సమావేశం తర్వాత బీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై కాసేపు చర్చించారు. అనంతరం మహిళా రిజర్వేషన్‌, బీసీ రిజర్వేషన్‌ బిల్లులు ప్రవేశపెట్టాలని.. పార్లమెంటులోని గాంధీ విగ్రహం వద్ద బీఆర్‌ఎస్‌ ఎంపీలు నిరసనలు చేపట్టారు.

మహిళా రిజర్వేషన్‌ బిల్లు కోసం కాంగ్రెస్‌ పోరాడితే మేం మద్దతు ఇస్తాం: కవిత

ఏపీ విభజన సరైన క్రమంలో జరగలేదు : ఆంధ్రప్రదేశ్‌ విభజన సరైన క్రమంలో జరగలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తెలంగాణ ఏర్పాటు ఎంతో ప్రయాసంతో జరిగిందన్నారు. రాష్ట్ర విభజన ఇరవర్గాలను సంతృప్తి పరచలేకపోయిందని తెలిపారు. కొత్త రాష్ట్రం వచ్చిన తెలంగాణ సంబరాలు చేసుకోలేకపోయిందని అన్నారు.

Special Sessions of Parliament Started Today : పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి 5 రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. సార్వత్రిక ఎన్నికకు ముందు ఈ సమావేశాలు జరగనుండడం విశేషాన్ని సంతరించుకున్నాయి. 75 ఏళ్ల పార్లమెంటు ప్రయాణం అని చెబుతున్నా.. అందుకు సంబంధించిన అంశంపైనే మాట్లాడతారా అనే అనుమానం ప్రతిపక్షాలలో నెలకొంది. ఈసారి ఎలాగైనా పార్లమెంటులో తెలంగాణ గళం ఎత్తాలని బీఆర్‌ఎస్‌ భావిస్తుంది. అందుకు తగిన కార్యచరణను కూడా సిద్ధం చేసుకుంది.

మహిళా రిజర్వేషన్‌ బిల్లును పార్లమెంట్‌ ముందుకు తీసుకురావాలి: కవిత

Womens Reservation Bill 2023 : చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే మహిళా బిల్లును ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని బీఆర్‌ఎస్‌, బీజేడీ సహా పలు ప్రాంతీయ పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ మేరకు అఖిలపక్షం సమావేశంలో దీనిపై డిమాండ్‌ చేశారు. మహిళా బిల్లును ప్రవేశపెట్టి.. ఆమోదం పొందేటట్లు ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయా ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఈ ప్రత్యేక సమావేశాల్లో ధరల పెరుగుదల, నిరుద్యోగం, సామాజిక సంక్షోభం, మణిపుర్‌ తదితర అంశాలను లేవనెత్తనున్నారు.

PM Modi on Andhra Pradesh Telangana Division : 'ఏపీ, తెలంగాణ విభజన సరిగ్గా జరగలేదు'.. పార్లమెంట్​లో మోదీ

Parliament Special Session 2023 : పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు సర్వం సిద్ధం.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు విపక్షాల పట్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.