ETV Bharat / state

కాంగ్రెస్​ సినిమా ఇంకా మొదలు కాలేదు - అసలు సినిమా ముందుంది : కేటీఆర్​

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 10, 2024, 4:38 PM IST

MLA KTR in Warangal Lok Sabha Preparatory Meeting : కాంగ్రెస్​ పార్టీ నిజస్వరూపాన్ని ఆ పార్టీ ఇచ్చిన 420 హామీలతోనే ఎండగట్టాలని బీఆర్​ఎస్​ శ్రేణులకు ఎమ్మెల్యే కేటీఆర్​ దిశానిర్దేశం చేశారు. ప్రజలను వంచించాలని అనుకుంటున్న కాంగ్రెస్​ పార్టీకి సినిమా ఇంకా మొదలు కాలేదని, అసలు సినిమా ముందుందని వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్​లో జరుగుతున్న వరంగల్​ లోక్​సభ సన్నాహక సమావేశంలో కేటీఆర్​ నేతలను ఉద్దేశించి ప్రసంగించారు.

MLA KTR
MLA KTR in Warangal Lok Sabha Preparatory Meeting

MLA KTR in Warangal Lok Sabha Preparatory Meeting : ప్రజలను వంచించాలని అనుకుంటున్న కాంగ్రెస్​ పార్టీకి సినిమా ఇంకా మొదలు కాలేదని, అసలు సినిమా ముందుందని బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(​KTR) వ్యాఖ్యానించారు. కాంగ్రెస్​ నిజస్వరూపం వారు ఇచ్చిన 420 హామీలతోనే ఎండగట్టాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ భవన్​లో జరుగుతున్న వరంగల్​ లోక్​సభ సన్నాహక సమావేశంలో కేటీఆర్​ నేతలను ఉద్దేశించి ప్రసంగించారు.

విధ్వంసమైన తెలంగాణను పదేళ్లలో కేసీఆర్​ వికాసం వైపు మళ్లించారని, గ్రామీణ ఆర్థిక పరిపుష్టికి కేసీఆర్(KCR)​ కష్టపడినంతగా దేశంలో ఎవరూ కష్టపడలేదని కేటీఆర్​ వివరించారు. తెలంగాణను సత్వరంగా అభివృద్ధి చేయాలన్న తపనతో 99 శాతం సమయాన్ని పాలనకే కేటాయించారని తెలిపారు. పరిపాలనపై పూర్తి దృష్టి కేంద్రీకరించి పార్టీకి కొంత సమయాన్ని తక్కువ కేటాయించినట్లు వివరించారు. పార్టీ సమావేశాలు ఎప్పటికప్పుడు నిర్వహించుకొని పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకు వెళతామని చెప్పారు. ఉద్యమాల వీరగడ్డ వరంగల్​ జిల్లాలో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే బీఆర్​ఎస్​ నేతలు ఓడిపోయారని, జయశంకర్​ సార్​ పుట్టిన నేలలో 2014, 2019లో వరంగల్​ ఎంపీ సీటును బీఆర్​ఎస్​ గెలుచుకుందన్నారు.

Warangal Lok Sabha Meeting at Telangana Bhavan : ఈసారి కూడా వరంగల్​లో గులాబీ జెండా ఎగరాలని బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ కోరారు. సన్నాహక సమావేశాల్లో పార్టీ బలోపేతానికి ఎన్నో సూచనలు వస్తున్నాయని తెలిపారు. పార్టీ పరంగా లోపాలు సమీక్షించుకుంటామని చెప్పారు. పార్లమెంటు ఎన్నికల(Lok Sabha 2024) నాటికి పార్టీని మరింత బలోపేతం చేసుకుంటామని అన్నారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పక్కనపెట్టి, పార్లమెంటు ఎన్నికలపై దృష్టి పెట్టి విజయం దిశగా పనిచేద్దామని శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యకర్తల్లో ఉత్సాహం యథావిధిగా ఉందని కేటీఆర్​ చెప్పారు.

ఇదే చైతన్యంతో పార్లమెంటు ఎన్నికల్లో గట్టిగా పని చేయాలని కేటీఆర్​ చెప్పారు. ప్రజలు పూర్తిగా తిరస్కరించలేదనే విషయం గుర్తుంచుకోని ముందుకు పోదామని అన్నారు. కాంగ్రెస్​ ఇచ్చింది ఆరు గ్యారంటీలు కాదని 420 హామీలు ఇదే విషయాన్ని కార్యకర్తలు ప్రజలకు గుర్తు చేస్తూనే ఉండాలని కేటీఆర్​ సూచించారు. కాంగ్రెస్​ ప్రభుత్వానికి వంద రోజుల సమయం ఇద్దామనుకున్నామని కానీ గవర్నర్​ ప్రసంగం, శ్వేత పత్రాలతో(White Papers) బీఆర్​ఎస్​, కేసీఆర్​ ప్రభుత్వాన్ని నిందించే ప్రయత్నం మొదలు పెట్టారని వ్యాఖ్యానించారు. ప్రజలకు ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునేందుకు బీఆర్​ఎస్​పై నిందలు వేస్తున్నారన్నారు. అనవసరంగా నిందలు వేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

Preparatory Meetings of Warangal Lok Sabha : కాంగ్రెస్​ 420 హామీల్లో ఇప్పటికే కొన్నింటి పైన తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని, నిరుద్యోగ భృతి హామీ ఇవ్వనే లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీ వేదికగా అబద్ధమాడారని కేటీఆర్​ పేర్కొన్నారు. జిల్లాలను రద్దు చేస్తామని సీఎం రేవంత్​ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని కేటీఆర్​ ఆరోపించారు. జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా అంటూ ప్రశ్నించారు. నెల రోజుల్లోనే కాంగ్రెస్​ పాలనపై వ్యతిరేకత మొదలైందని, కేంద్ర ప్రభుత్వ విధానాలు పేద ప్రజలను నష్టపరిచాయని, ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేటీఆర్​ నేతలకు తెలిపారు.

లోక్‌సభ ఎన్నికల్లో త్రిముఖ పోరు తప్పదు - గట్టిగా పోరాడాల్సిందే : కేటీఆర్

పొరపాట్లు జరిగాయి - సరిదిద్దుకొని ముందుకెళ్తాం : కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.