ETV Bharat / state

పొరపాట్లు జరిగాయి - సరిదిద్దుకొని ముందుకెళ్తాం : కేటీఆర్

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 5, 2024, 8:30 AM IST

BRS Committees in Telangana : పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ముఖ్యనేతల నుంచి వచ్చిన అభిప్రాయాలు, సూచనల మేరకు నాయకత్వం ఆ నిర్ణయానికి వచ్చింది. క్షేత్రస్థాయి మొదలు రాష్ట్రస్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. కార్యకర్తలు, నేతలకు తగిన గుర్తింపు ఉండేలా కార్యాచరణ అమలు చేయనున్నారు. లోక్​సభ సన్నాహాక సమావేశాలు ముగిసిన వెంటనే, ఆ దిశగా నిర్ణయాలు అమలు చేసే అవకాశం ఉంది.

BRS Committees in Telangana
BRS Committees

కొన్ని పొరపాట్లు జరిగాయి, వాటిని సరిదిద్దుకొని ముందుకెళ్తాం: కేటీఆర్

BRS Committees in Telangana : శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైన భారత్ రాష్ట్ర సమితి(BRS) దిద్దుబాటు చర్యలకు ఉపక్రమిస్తోంది. ఓటమిని గత కొన్నాళ్లుగా విశ్లేషిస్తున్న పార్టీ నాయకత్వం, లోక్​సభ నియోజకవర్గాల వారీగా సన్నాహాక సమావేశాలు నిర్వహిస్తోంది. రానున్న లోక్​సభ ఎన్నికలకు పార్టీ నేతలు, శ్రేణులను సమాయత్తం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశాలు జరుగుతున్నాయి.

ఆయా లోక్​సభ నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులు, మాజీలు, ముఖ్యనేతలను ఈ సమావేశాలకు ఆహ్వానిస్తున్నారు. వారి నుంచి శాసనసభ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను తెలుసుకోవడంతో పాటు అభిప్రాయాలు సేకరిస్తున్నారు. సూచనలు, సలహాలు కూడా తెలుసుకుంటున్నారు. పలువురు సన్నాహాక సమావేశాల్లో బహిరంగంగానే తమ అభిప్రాయాలు చెప్తున్నారు. మిగిలిన వారు లిఖిత పూర్వకంగా కూడా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

BRS Focus on Lok Sabha Elections 2024 : గత రెండు రోజులుగా జరిగిన సమావేశాలు చూస్తే, కార్యకర్తలకు గుర్తింపు లేదని పలువురు వాపోయారు. మెజార్టీ చోట్ల పార్టీ కమిటీలు ఏర్పాటు చేయలేదని, ఏర్పాటైన చోట కూడా నామమాత్రంగా ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలులో పార్టీ, నేతలు, కార్యకర్తల ప్రమేయం లేకుండా ఇబ్బందికరంగా మారిందన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలకు ఎంతో మేలు జరిగిందని, అయితే అది బీఆర్ఎస్ ద్వారా సాధ్యమైందన్న విషయాన్ని ప్రజలకు చెప్పే పరిస్థితి లేకుండా పోయిందని పేర్కొన్నారు.

కల్యాణ లక్ష్మీ పథకానికి రూ.లక్ష నగదుతో పాటు తులం బంగారం ఇవ్వాలి : సబితా ఇంద్రారెడ్డి

Lok Sabha Elections 2024 Telangana : క్షేత్రస్థాయి నేతలు, కార్యకర్తలను భాగస్వామ్యుల్ని చేయలేదని, ఉత్సవ విగ్రహాలను చేశారని పలువురు సమావేశంలో వివరించారు. పార్టీలో గ్రూపులు, తగాదాలు ఉన్నాయని, పార్టీలో ఉంటూనే కొందరు ఓటమికి ప్రయత్నించారని ఫిర్యాదు చేశారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయకపోవడంతో ఇబ్బందులు తలెత్తాయని పలువురు వివరించారు. విపక్షాలు చేసిన ప్రచారాన్ని తిప్పికొట్టే పరిస్థితి లేదని అన్నారు. ముఖ్యనేతలను కలిసే అవకాశం క్షేత్రస్థాయి నేతలు, కార్యకర్తలకు లేదని, కలిసినా అభిప్రాయాలు, చెప్పే పరిస్థితి లేదని పేర్కొన్నారు.

BRS Plans Lok Sabha Elections 2024 : ఎమ్మెల్యేలకే జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడం పెద్దగా ఫలితం లేదన్న అభిప్రాయం పార్టీలో ఉంది. వీటన్నింటిని విన్న పార్టీ నాయకత్వం అవసరమైన మార్పులు, చేర్పులకు సిద్ధమైంది. కొన్ని పొరపాట్లు జరిగాయని, వాటిని సరిదిద్దుకొని ముందుకెళ్తామని పార్టీ కార్యానిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రకటించారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. గ్రామస్థాయి మొదలు రాష్ట్రస్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేస్తామని నేతలు, కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇచ్చి క్రియాశీలం చేస్తామని ఆయన తెలిపారు. నేతల నుంచి వచ్చిన అభిప్రాయాలు, సూచనల ఆధారంగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. సన్నాహాక సమావేశాల అనంతరం ఈ దిశగా కార్యాచరణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

రాష్ట్ర హక్కుల కోసం కొట్లాడటం కాంగ్రెస్‌, బీజేపీ వల్ల కాదు : కేటీఆర్‌

ఒక్క ఎమ్మెల్యేను తీసుకుంటే అక్కణ్నుంచి పది మంది వస్తారు : గంగుల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.