ETV Bharat / state

రేపు మేడిగడ్డకు మంత్రులు ఉత్తమ్‌, శ్రీధర్‌బాబు, ప్రాజెక్టు లాభనష్టాలపై రివ్యూ

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 28, 2023, 4:05 PM IST

Updated : Dec 28, 2023, 5:39 PM IST

Ministers Uttam and Sridhar Babu visit Medigadda Barrage : ఈనెల 29న మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, శ్రీధర్‌ బాబులు మేడిగడ్డ బ్యారేజీని పర్యటించనున్నారు. బ్యారేజీ వద్ద నీటి పారుదలశాఖ అధికారులు కాళేశ్వరం నిర్మాణంపై మంత్రులకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నారు. ప్రాజెక్టు నిర్మాణంతో లాభ-నష్టాలు, ఆయకట్టు స్థిరీకరణ తదితర అంశాలను వివరించనున్నారు.

Ministers Uttam and Sridhar Babu visit Medigadda Barrage
ministers visit medigadda

Ministers Uttam and Sridhar Babu visit Medigadda Barrage : డిసెంబర్‌ 29న నీటిపారుదల శాఖమంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు మేడిగడ్డ(Medigadda Barrage) పర్యటించనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌ నుంచి మేడిగడ్డకు హెలికాప్టర్‌లో బయలుదేరనున్నారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుపై నీటి పారుదల శాఖ అధికారులు మంత్రులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.

కాళేశ్వరం 3 బ్యారేజీల్లోని నీళ్లన్నీ ఖాళీ చేయాల్సిందే! : నీటిపారుదల శాఖ

ఈ ప్రజెంటేషన్‌లో నీటిపారుదల అధికారులు ప్రాణహిత ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టుల(Kaleswaram project) వివరాలను వివరించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల జరిగిన లాభ, నష్టాలు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణవ్యయం, కొత్త ఆయకట్టు, స్థిరీకరణ ఆయకట్టు వివరాలు, ప్రాజెక్టు నిర్వహణకు అవసరం కానున్న విద్యుత్ తదితర అంశాలను వివరిస్తారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల సమస్యలు, వాటి పరిష్కారాలు తదితర అంశాలపై మంత్రులు సమీక్ష చేయనున్నారు. ఈ పర్యటలో భాగంగా నిర్మాణ సంస్థలకు, సబ్ కాంట్రాక్టర్లలకు, ఈ నిర్మాణంలో సంబంధం ఉన్న వారికి అందరికి సమాచారం ఇచ్చి సమావేశంలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ఈఎన్‌సీని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.

మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు కారకులను వదిలిపెట్టేదేలే : మంత్రి ఉత్తమ్​కుమార్​ రెడ్డి

Govt review on Medigadda Barrage : రాష్ట్రంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో ఎన్నికల వేళ మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగడం, అన్నారం బ్యారేజీకి సీపేజీలు ఏర్పడటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడిందని ఎన్నికల సమయంలో అప్పటి విపక్షాలు ఆరోపించాయి. తాము అధికారంలోకి రాగానే మేడిగడ్డ కుంగుబాటుపై సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపిస్తామని రేవంత్‌రెడ్డి గతంలోనే పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth reddy) నీటిపారుదల అధికారులతో సమావేశమయ్యారు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో(Kaleshwaram project) కుంగుబాటుకు గురైన మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బ్యారేజీ నిర్మాణసంస్థతో చర్చించారు. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ, భవిష్యత్‌ కార్యాచరణపై నీటిపారుదల పారుదల అధికారులతో చర్చించారు.

రాష్ట్రంలో సాగునీటి రంగానికి సంబంధించి ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం పారదర్శకంగా ఉండాల్సిందేనని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొత్తగా నిర్మించిన ప్రాజెక్టుల ఖర్చులకు సంబంధించి పూర్తి వివరాలను అందించాలన్నారు. 1956 నుంచి 2014 వరకు, 2014 నుంచి 2023 వరకు నిర్మించిన ప్రాజెక్టులు, వాటి నిర్మాణ వ్యయాలు, ప్రాజెక్టుల వారీగా సాగులోకి తెచ్చిన ఆయకట్టు వివరాలను అధికారుల ద్వారా సీఎం తెలుసుకున్నారు.

మేడిగడ్డ, అన్నారంపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయిస్తాం : రేవంత్‌రెడ్డి

Last Updated : Dec 28, 2023, 5:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.