ETV Bharat / state

నేటి నుంచి ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ - అయిదు పథకాలకు ఒకే అర్జీ

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 28, 2023, 6:43 AM IST

Praja Palana Telangana Applications 2023 : ఆరు గ్యారంటీ పథకాల అమలే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం నేడు ప్రారంభం కానుంది. నేటి నుంచి జనవరి 6 వరకు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సభలు నిర్వహించి, మహాలక్ష్మి, రైతుభరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకాలకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. రేషన్ కార్డులు, ఇతర అవసరాల కోసం కూడా వినతిపత్రాలు, ఫిర్యాదులు ఇవ్వవచ్చునని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గ్రామ సభల్లో దరఖాస్తులు ఇవ్వలేకపోతే ఆందోళన చెందవద్దని, ఆ తర్వాత పంచాయతీలు, మండల కార్యాలయాల్లోనూ సమర్పించవచ్చునని ముఖ్యమంత్రి వెల్లడించారు.

Nodal Officers Appointed For Prajapalana Program
Prajapalana Program Start Today

Praja Palana Telangana Applications 2023 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ప్రజాపాలనకు నేడు శ్రీకారం చుడుతోంది. ఇవాళ్టి నుంచి జనవరి 6 వరకు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సభలు జరగనున్నాయి. రాష్ట్రంలోని 12,769 పంచాయతీలు, 3,626 మున్సిపల్ వార్డులు కలిపి మొత్తం 16,395 ప్రాంతాల్లో ప్రజాపాలన సదస్సులు(Conferences) నిర్వహించనున్నారు. ప్రజాపాలన కార్యక్రమం కోసం 3,714 అధికార బృందాలను ఏర్పాటు చేశారు.

సుమారు పది శాఖల అధికారులతో కూడిన బృందం రోజుకు రెండు గ్రామాలు లేదా రెండు వార్డుల్లో పర్యటించి ప్రజాసదస్సులు నిర్వహిస్తుంది. ఈనెల 31, జనవరి 1 సెలవు రోజులు మినహా మిగతా రోజుల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, మళ్లీ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 వరకు గ్రామ, వార్డు సభలు ఉంటాయి. ఈ సభల్లో మహాలక్ష్మి(Mahalakshmi Scheme), రైతుభరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకాలకు దరఖాస్తులను స్వీకరిస్తారు.

Praja Palana Program Telangana 2023 : ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఐదు పథకాల కోసం ఒకే దరఖాస్తులను ప్రభుత్వం ఖరారు చేసింది. మహాలక్ష్మి, రైతుభరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకాల కోసం అందులోనే వివరాలు సమర్పించాలి. ఇంటి యజమాని పేరు, పుట్టిన తేదీ, సామాజిక వర్గం, ఆధార్, రేషన్ కార్డు, మొబైల్ నంబరు, వృత్తి, చిరునామా, కుటుంబ సభ్యులందరి వివరాల వంటి పది అంశాలను పూరించాలి. ఆ తర్వాత అభయహస్తం గ్యారంటీ పథకాల్లో దేనికి దరఖాస్తు చేస్తున్నారో వాటికి టిక్ చేయాలని దరఖాస్తులో పేర్కొన్నారు.

దరఖాస్తుతోపాటు ఆధార్, తెల్లరేషన్ కార్డు జిరాక్స్ ప్రతిని జత పరిచి వివరాలన్నీ వాస్తవమేనని ధ్రువీకరిస్తూ సంతకం చేయాలి. దరఖాస్తులో కింద ఉన్న ప్రజాపాలన రశీదుకు అధికారులు నంబరు కేటాయించి ఇస్తారు. దరఖాస్తుల ద్వారా అందిన సమాచారం ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని సీఎం వెల్లడించారు. సమాచారం ఆధారంగా ఏయే పథకాన్ని ఎందరు ఆశిస్తున్నారు ఎంత ఖర్చవుతుందనే అంచనా వేసి అమలు చేయవచ్చునని ప్రభుత్వం భావిస్తోంది.

'గత ప్రభుత్వం రూ.6.71 లక్షల కోట్ల అప్పులు చేసి పరారైంది'

రేషన్ కార్డులు, ఇతర అవసరాల కోసం కూడా వినతిపత్రాలు, ఫిర్యాదులను సమర్పించవచ్చునని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గ్రామ, వార్డు సభల్లో దరఖాస్తు చేయలేకపోయిన వారు ఆందోళన పడాల్సిన అవసరం లేదని, ఆ తర్వాత పంచాయతీలు, మండల కార్యాలయాల్లోనూ ఇవ్వొచ్చునని తెలిపారు. దరఖాస్తుదారులే గ్రామసభకు వెళ్లాల్సిన అవసరం లేదని, వారి తరఫున ఎవరైనా దరఖాస్తు సమర్పించవచ్చునని చెప్పారు.

Nodal Officers Appointed For Prajapalana Program : ప్రజాపాలనను పర్యవేక్షించేందుకు ఉమ్మడి జిల్లాల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించడంతో పాటు, ఐఏఎస్​లను నోడల్ అధికారులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి(CS Shanti Kumari) నియమించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహబూబ్ నగర్​కు దామోదర రాజనర్సింహా ను ఇంచార్జ్ మంత్రులుగా ప్రభుత్వం నియమించింది.

ప్రజాపాలన కార్యక్రమానికి నోడల్‌ అధికారుల నియామకం

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రంగారెడ్డి జిల్లాకు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వరంగల్​కు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, హైదరాబాద్ జిల్లాకు పొన్నం ప్రభాకర్, మెదక్​కు కొండా సురేఖ, ఆదిలాబాద్​కు సీతక్క, నల్గొండ జిల్లాకు తుమ్మల నాగేశ్వరరావు, నిజామాబాద్​కు జూపల్లి కృష్ణారావును ఇంచార్జ్ మంత్రులుగా నియమిస్తూ జీవో జారీ అయింది.

నోడల్ అధికారులుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు శ్రీదేవసేన, మహబూబ్ నగర్ కు టి.కె.శ్రీదేవి, ఖమ్మం జిల్లాకు ఎం.రఘునందన్ రావును నోడల్ అధికారులుగా ప్రభుత్వం(Congress Govt) నియమించింది. రంగారెడ్డి జిల్లాకు బుర్రా వెంకటేశం, వరంగల్​కు వాకాటి కరుణ, హైదరాబాద్ జిల్లాకు కె.నిర్మల, మెదక్​కు ఎస్.సంగీత, ఆదిలాబాద్ జిల్లాకు ఎం.ప్రశాంతి, నల్గొండకు ఆర్.వి.కణ్ణన్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు క్రిస్టినా చౌంగ్తు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాల్లో ప్రజాపాలన నిర్వహణకు ఇంచార్జ్ మంత్రులు, నోడల్ అధికారులు పర్యవేక్షిస్తారు.

Congress Govt Focus on Prajapalana Program : ప్రజాపాలన కార్యక్రమం అమలు కోసం ప్రభుత్వం సుమారు 22 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. గ్రామ, వార్డు సభల్లో మంచినీరు, మహిళలకు ప్రత్యేక కౌంటర్లు తదితర సదుపాయాలు ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వంద కుటుంబాలకు ఒక కౌంటరు ఏర్పాటు చేయనున్నారు. రద్దీ ఎక్కువగా ఉంటే టోకెన్ విధానం అమలు చేస్తారు. ప్రజా పాలనను ప్రతీ నాలుగు నెలలకోసారి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

కేసీఆర్ 22 ల్యాండ్ క్రూయిజర్లు కొని విజయవాడలో దాచారు : సీఎం రేవంత్

త్వరలోనే టీఎస్పీఎస్సీ కొత్త బోర్డు ఏర్పాటు - సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.