ETV Bharat / state

మత్స్య సంపద పెంచాలనేదే ముఖ్యమంత్రి ఆలోచన: తలసాని

author img

By

Published : Mar 12, 2022, 1:12 PM IST

రాష్ట్రంలో మత్స్య సంపద పెంచేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ అన్ని వర్గాలకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని మంత్రి ప్రశంసించారు.

minister talasani talk about Fisheries in assembly sessions 2022
మత్స్య సంపద పెంచాలనేదే ముఖ్యమంత్రి ఆలోచన: తలసాని

సమైక్య రాష్ట్రంలో మత్య్సకారులు ఉన్నారనే విషయాన్నే మర్చిపోయారని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ అన్ని వర్గాలకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని మంత్రి ప్రశంసించారు. కుంటలు, చెరువులు, రిజర్వాయర్లలో చేపల పెంపకం చేపట్టామని సభకు తెలిపారు. మత్స్యకారుల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు.

రాష్ట్ర ఏర్పాటు ఆరంభంలో చేపల పెంపకానికి 598 చెరువులే అనువుగా ఉండగా.. 7కోట్ల 78 లక్షలు ఖర్చు చేశామన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 23వేల 263 చెరువుల్లో చేపల పెంపకం చేపట్టామని.. 77 కోట్ల 47 లక్షలు ఖర్చు చేస్తున్నామని మంత్రి తెలిపారు. మత్య్సరంగంపై ప్రత్యక్షంగా 37 లక్షల మంది, పరోక్షంగా లక్షలాది కుటుంబాలకు ఉపాధి లభిస్తోందన్నారు. లోయర్‌ మానేరు వద్ద మార్కెట్‌ ఏర్పాటు చేస్తామని.. ముంపుగ్రామాల వారికి చేపలు పట్టుకునే అవకాశం కల్పిస్తామని శ్రీనివాస్‌ యాదవ్‌ హామీ ఇచ్చారు.

''మత్స్య సంపద పెంచాలనేదే ముఖ్యమంత్రి ఆలోచన. మత్స్యకార సొసైటీల సంఖ్య పెరగాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉంది. కొంత సమయం తీసుకున్నా మరిన్ని సొసైటీలు ఏర్పాటు చేస్తాం.''

- తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మంత్రి

మత్స్య సంపద పెంచాలనేదే ముఖ్యమంత్రి ఆలోచన: తలసాని
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.