ETV Bharat / state

KTR: 'అఫ్గాన్​పై ఐరాస ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు'

author img

By

Published : Aug 16, 2021, 8:46 PM IST

అఫ్గానిస్తాన్​లో నెలకొన్న భయానక పరిస్థితులపై ఆ దేశ క్రికెటర్ రషీద్​ఖాన్ చేసిన ట్వీట్​కు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. అఫ్గాన్ పరిస్థితులపై ఐరాస ఎందుకు జోక్యం చేసుకోవడం లేదని ప్రశ్నించారు.

Minister
అఫ్గానిస్తాన్

అఫ్గానిస్తాన్(​Afghanistan)లో మారుతోన్న పరిణామాలు, అక్కడి భయానక పరిస్థితులపై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ (Ktr) స్పందించారు. అఫ్గాన్ దేశంలో అల్లకల్లోలం జరుగుతున్నా... పరిస్థితులు పూర్తిగా చేజారిపోతున్నా ఐక్యరాజ్యసమితి ఎందుకు జోక్యం చేసుకోవట్లేదని కేటీఆర్ ప్రశ్నించారు.

తమదేశంలో అస్థిర పరిస్థితులపై ప్రపంచ దేశాల నేతలు స్పందించాలని అఫ్గానిస్తాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ (Rashid Khan) చేసిన ట్వీట్​కు స్పందిస్తూ... కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. అఫ్గాన్ నుంచి వస్తోన్న వీడియోలు, చిత్రాలు తననెంతగానో కలచి వేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. అఫ్గాన్​లో పరిస్థితులు చక్కదిద్దేందుకు ఐరాస జోక్యం చేసుకోవాల్సిన అవసరమందని ఈ సందర్భంగా నొక్కి చెప్పారు.

ఇదీ చూడండి: Viral: విమానం నుంచి జారిపడిన అఫ్గాన్​ ప్రజలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.