ETV Bharat / state

నగదు రహిత ఆర్థిక వ్యవస్థ ఏది... నోట్ల రద్దుపై మోదీకి కేటీఆర్ ప్రశ్నలు

author img

By

Published : Nov 7, 2022, 10:29 PM IST

Updated : Nov 7, 2022, 11:00 PM IST

Minister Ktr on demonetisation నోట్ల రద్దు విఫల నిర్ణయం తీసుకున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికైనా దేశానికి క్షమాపణ చెప్పాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు డిమాండ్ చేశారు. నోట్ల రద్దు విఫల నిర్ణయానికి నేటితో ఆరేళ్లవుతుందన్నారు. నకిలీ కరెన్సీని అరికట్టడం, తీవ్రవాదానికి నిధులు ఆపడం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం కోసమే నోట్ల రద్దు అంటూ కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాటలన్నీ అవాస్తవాలేనని తేలిపోయిందన్నారు. నోట్ల రద్దు వల్లే దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని.. వేల కంపెనీలు మూతపడి నిరుద్యోగం పెరిగిపోయిందని కేటీఆర్ అన్నారు. కేంద్రం ఇప్పటికైనా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవాలని మంత్రి సూచించారు.

Minister Ktr on Six years of demonetisation
Minister Ktr on Six years of demonetisation

Minister Ktr on demonetisation దేశఆర్థిక వ్యవస్థ పతనానికి కేంద్రంలోని భాజపా ప్రభుత్వ విధానాలే కారణమని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు ధ్వజమెత్తారు. నోట్ల రద్దు నిర్ణయంతో పురోగమిస్తున్న దేశ ఆర్థిక వ్యవస్థను దారుణంగా దెబ్బ తీశారని కేటీఆర్ ఆరోపించారు. ఆరేళ్ల క్రితం 2016 నవంబర్ 8న నోట్ల రద్దు నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందన్నారు. నల్లధనం వెలికి తీయడం, నకిలీ కరెన్సీని అరికట్టడం, తీవ్రవాదానికి నిధులు ఆపడం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం కోసమే నోట్ల రద్దు అంటూ కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాటలన్నీ అవాస్తవాలేనని తేలిపోయిందన్నారు. నోట్ల రద్దు నిర్ణయం ఆర్థిక వ్యవస్థను కుంగదీసిన ఘోర వైఫల్యమని.., ప్రధాని చెప్పిన ఒక్క లక్ష్యం కూడా నెరవేరని వైపరీత్యమని కేటీఆర్ మండిపడ్డారు.

గణాంకాలే నిదర్శనం Six years of demonetisation ప్రస్తుతం దేశంలో సూమారు 30 లక్షల 88 వేల కోట్ల రూపాయల నగదు ప్రజల వద్ద ఉందని.. నోట్ల రద్దుపై భాజపా చెప్పినవన్నీ అబద్ధాలేనని తేలిపోయిందని కేటీఆర్ ఆరోపించారు. నోట్లను రద్దు చేసిన తర్వాత 2017 జనవరి నాటికి 17 లక్షల 97 వేల కోట్ల రూపాయలు చలామణిలో ఉండేవని... 72 శాతం పెరిగి 12 లక్షల 91 నేల కోట్ల రూపాయలు అదనంగా చెలామణీలోకి వచ్చిందన్నారు. నోట్ల రద్దు తర్వాత నగదు లావాదేవీలు పెరుగుతూనే ఉన్నాయని కేంద్ర గణాంకాలే చెబుతున్నాయన్నారు.

నగదు రహిత ఆర్థిక వ్యవస్థ ఏది? impact of demonetization లావాదేవీల డిజిటలైజేషన్, బ్యాంకుల్లో నగదు లావాదేవీలపై పరిమితులు విధించినప్పటికీ.. కేంద్రం పేర్కొన్న తక్కువ నగదు ఆర్థిక వ్యవస్థ లక్ష్యం నెరవేరలేదన్నారు. అన్నారు. నగదు రహిత ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో పూర్తిగా విఫలమైనప్పటికీ.. నోట్ల రద్దు విజయవంతమైందని కేంద్రం గొప్పలు చెప్పుకుంటోందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రద్దయిన పెద్దనోట్ల సొమ్ములో 99.3 శాతం తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చాయని అర్బీఐ గణాంకాలతో సహా ప్రకటించిందన్నారు.

అనాలోచిత నిర్ణయానికి 21వేల ఖర్చు... modi demonetisation రద్దయిన పెద్ద నోట్ల విలువ 15.41 లక్షల కోట్ల రూపాయల నోట్లు రద్దు కాగా.. 15 లక్షల 31 వేల కోట్ల రూపాయలు తిరిగి బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యాయని ఆర్బీఐ వెల్లడించిందని కేటీఆర్ పేర్కొన్నారు. లక్షల కోట్ల నల్లధనాన్ని పట్టుకోవడానికే నోట్ల రద్దు అస్త్రం ప్రయోగించామన్న కేంద్రం.. చివరికి తెల్ల ముఖం వేసి.. కొత్త నోట్ల ముద్రణకు 21వేల కోట్ల ఖర్చు చేయడం తప్ప సాధించేమీ లేదని కేటీఆర్ విమర్శించారు. ఇప్పటికీ దేశంలో కోట్లాది మందికి బ్యాంకు ఖాతాలు లేవని.. ఈ -కామర్స్ లావాదేవీల్లోనూ 50 శాతానికి పైగా క్యాష్ అండ్ డెలివరీ పద్ధతిని వినియోగిస్తున్నారన్న విషయం గుర్తించాలన్నారు.

మోదీ నిర్ణయంవల్లే దేశ ప్రజలకు కష్టాలు... Demonetization Colossal Failure Of Modi Govt అనాలోచిత నోట్ల రద్దు నిర్ణయం వల్లే ఈరోజు దేశ ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో కొనసాగుతోందని కేంద్రం గ్రహిస్తే మంచిదని కేటీఆర్ అన్నారు. అర్దిక వ్యవస్ధ పతనానికి నోట్ల రద్దు, లాక్ డౌన్ వంటి కారణాలను చూపిస్తున్నప్పటికీ.. లాక్ డౌన్ కు ముందే 2020 నాటికి వరుసగా ఎనిమిది త్రైమాసికాల్లో ఆర్థిక వ్యవస్థ తిరోగమన దశలో ఉన్న విషయాన్ని కేంద్రం దాచి ఉంచుతోందన్నారు. కేవలం ప్రధాని అనాలోచితం నిర్ణయం వల్లే దేశంలోని ప్రజలు, ప్రభుత్వాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని కేటీఆర్ ధ్వజమెత్తారు.

సంక్షేమ కార్యక్రమాల అమలుపైనా ప్రభావం KTR On Note Banనోట్ల రద్దు, కరోనా వలన లక్షలాది చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమలు మూతపడి నిరుద్యోగం పెరిగి ప్రజల కొనుగోలు శక్తి తగ్గిందన్నారు. ప్రజలు నిరుద్యోగులుగా మారడంతో 2016 నుంచి 2019 వరకు సూమారు 50 లక్షల ఉద్యోగాలు కొల్పోయారని, 2016లో 88 లక్షల మంది కనీసం ఐటి రిటర్న్ లు కూడా దాఖలు చేయలేక పోయారన్నారు. ఒక వైపు పారిశ్రామిక ఉత్పత్తి, కొనుగోళ్లు తగ్గడంతో ప్రభుత్వాల పన్ను రాబడి కూడా పడిపోయి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలుపైనా ప్రభావం చూపుతోందన్నారు.

ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే! PM Modi should tender apology to nation యాభై రోజుల సమయం ఇవ్వాలని తన నోట్ల రద్దు నిర్ణయం తప్పయితే సజీవ దహనం చేయాలని అప్పుడు ప్రధానమంత్రి ప్రజలను మభ్యపెట్టారని కేటీఆర్ విమర్శించారు. కానీ నోట్ల రద్దు దుష్పరిణామాలకు బాధ్యతను కూడా తీసుకునేందుకు కేంద్రంలోని భాజపా ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు. నోట్ల రద్దు తప్పు అని ఒప్పుకొని దేశ ప్రజానీకానికి ప్రధానమంత్రి మోడీ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇప్పటికీ అర్ధరహిత నిర్ణయాలు తీసుకుంటూ రికార్డు స్దాయి నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి దుష్పరిణామాలతో మరింత తిరోగమనానికి దారి తీసేలా కేంద్రం వ్యవహరిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. ఇప్పటికైనా కేంద్రం తన ప్రచార పటోపాలను పక్కనపెట్టి ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి అవసరమైన సానుకూల నిర్ణయాలను తీసుకోవడంపైన దృష్టి సారించాలని కేటీఆర్ సూచించారు.

ఇవీ చూడండి:

Last Updated : Nov 7, 2022, 11:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.