ETV Bharat / state

'త్వరలోనే బీసీ కులాల ఆత్మగౌరవ భవన నిర్మాణాలు చేపడతాం..!

author img

By

Published : Jan 22, 2021, 11:41 PM IST

తెరాస ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సముచిత న్యాయం చేస్తోందని బీసీ సంక్షేమ శాఖా మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఎంబీసీల అభివృద్ధి కోసం ఆర్థిక సహాయం చేయడంతో పాటుగా వారికి అవసరమైన పనిముట్లను కూడా అందిస్తామని పేర్కొన్నారు.

minister-gangula-kamalakar-give-guarantee-for-bc-caste-self-respecting-building-structures
'త్వరలోనే బీసీ కులాల ఆత్మగౌరవ భవన నిర్మాణాలు చేపడతాం..!

బీసీ కులాల ఆత్మగౌరవ భవన నిర్మాణాలను త్వరలోనే చేపడతామని బీసీ సంక్షేమ శాఖా మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఈ మేరకు ఎంబీసీల సమస్యలపై హైదరాబాద్​లో సమీక్ష నిర్వహించిన ఆయన బీసీ కులవృత్తులకు కావాల్సిన ఆర్థిక సాయంతో పాటు వారికి అవసరమైన పనిముట్లను కూడా అందిస్తామని తెలిపారు.

అన్ని కులాల ప్రతినిధులతో హైదరాబాద్​లోని మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో మూడు రోజుల పాటు చర్చిస్తానని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. బీసీల సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్​తో చర్చిస్తానని అన్నారు. ఎంబీసీలకు ఆర్థికసాయం, పనిముట్లు అందించి వారి జీవనస్థితి మెరుగుపడేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి: ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన నీతిఆయోగ్ బృందం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.