ETV Bharat / state

30 సర్కిళ్ల పరిధిలో 63 మినీ కంటైన్‌మెంట్ జోన్లు

author img

By

Published : Apr 22, 2021, 8:28 PM IST

Updated : Apr 22, 2021, 9:33 PM IST

రాష్ట్రంలో రెండో దశ కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకీ కొవిడ్‌ బారినపడుతోన్న బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో గత వారం రోజుల నుంచి ప్రతి రోజు 500కు పైగానే కరోనా కేసులు నమోదవుతున్నాయి. వేగంగా వ్యాపిస్తోన్న కరోనాను కట్టడి చేసేందుకు జీహెచ్​ఎంసీ కట్టడి చర్యలకు ఉపక్రమించింది. జీహెచ్‌ఎంసీలోని 30 సర్కిళ్ల పరిధిలో మొత్తం 63 మినీ కంటైన్‌మెంట్‌ జోన్లను ఏర్పాటు చేసింది.

mini containment zones in ghmc
30 సర్కిళ్ల పరిధిలో 63 మినీ కంటైన్‌మెంట్ జోన్లు

కొవిడ్‌ తొలిదశలో వైరస్‌ కట్టడికి శానిటైజేషన్‌తో పాటు కంటైన్​మెంట్​ జోన్లు ఏర్పాటు చేసిన జీహెచ్​ఎంసీ రెండోదశలో ఆలస్యంగా మేల్కొంది. రెండో దశ కరోనా కేసులు దడ పుట్టిస్తుండగా.. జనం బెంబేలెత్తుతున్నారు. ఏ కాలనీలో, ఏ ఇంట్లో బాధితులు ఉన్నారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఇంతజరుగుతున్నా పట్టించుకోని బల్దియా ఎట్టకేలకు స్పందించింది. కరోనా కట్టడి చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. నగరంలో 30 జీహెచ్​ఎంసీ సర్కిళ్ల పరిధిలో 63 మినీ కంటైన్‌మెంట్ జోన్లు ఏర్పాటు చేస్తూ వివరాలను జీహెచ్​ఎంసీ వెబ్‌సైట్‌లో పెట్టింది. స్థానిక అధికారులు మాత్రం తమకు ఎలాంటి సమాచారం లేదని చెబుతున్నారు.

5 కేసుల కంటే ఎక్కువ ఉంటే..

5 కేసుల కంటే ఎక్కువ ఉండే కాలనీల్లో మినీ కంటైన్‌మెంట్‌ జోన్‌ను ఏర్పాటు చేస్తామని బల్దియా ప్రకటించింది. ఒకే అపార్ట్‌మెంట్‌లో అధికంగా కేసులు వస్తే హౌస్​‌ క్లస్టర్‌ ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఆయా మినీ కంటైన్‌మెంట్ జోన్లు, క్లస్టర్‌ పరిధిల్లో మాత్రం బారీకేడ్లు, ఫ్లెక్సీలు వంటి ఏర్పాట్లేవీ చేయలేదు. కంటైన్​మెంట్ జోన్ల వివరాలు ఎంటమాలజీ విభాగానికి ఇవ్వలేదంటే పరిస్థితి ఏంటో అద్దం పడుతోంది. సోడియం హైపోక్లోరైట్‌ పిచికారి చేసే ఎంటమాలజీకే కంటైన్‌మెంట్ వివరాలు అందలేదు. జీహెచ్​ఎంసీ డీఆర్​ఎఫ్​ బృందాలే ఇప్పటివరకు శానిటైజేషన్‌ చేస్తున్నాయి. హై రిస్క్ ప్రాంతాల్లో ఇంటెన్సివ్ శానిటేష‌న్‌, యాంటీ లార్వా స్ప్రేయింగ్‌ చేస్తున్నారు. 19 డిజాస్టర్ డీఆర్​ఎఫ్​ బృందాలు కూకట్‌పల్లి, నిజాంపేట్, కేపీహెచ్​బీ, మియాపూర్ తదితర ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైట్‌తో శానిటైజ్ చేశాయి.

పారిశుద్ధ్య పనులు

కరోనా ఉద్ధృతి దృష్ట్యా మేయర్‌ విజయలక్ష్మి క్షేత్రస్థాయి పర్యటనలకు ఉపక్రమించారు. చెత్తను వెంటనే తొలగించేలా నగరంలో పర్యటిస్తున్నారు. ఖైరతాబాద్, కూకట్ పల్లి జోన్‌లలో పారిశుద్ధ్య పనులను మేయర్ తనిఖీ చేశారు. పిట్టలబస్తీలో చెత్త తరలించే ఆటోలు రావడం లేదని తెలిసి మేయర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్​ నగర్ ఎల్లమ్మబండ , నార్నే నగర్, నవోదయ కాలనీల్లో పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలని జీహెచ్​ఎంసీ అధికారులను ఆదేశించారు.

మినీ కంటైన్​మెంట్​ జోన్లు ఇవే..

మినీ కంటైన్‌మెంట్ జోన్లు
మినీ కంటైన్‌మెంట్ జోన్లు
మినీ కంటైన్‌మెంట్ జోన్లు
మినీ కంటైన్‌మెంట్ జోన్లు
మినీ కంటైన్‌మెంట్ జోన్లు
మినీ కంటైన్‌మెంట్ జోన్లు
మినీ కంటైన్‌మెంట్ జోన్లు
మినీ కంటైన్‌మెంట్ జోన్లు

ఇదీ చదవండి: ఆర్టీసీపై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం

Last Updated :Apr 22, 2021, 9:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.