ETV Bharat / state

గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో పాల్గొన్న లోక్​సభ స్పీకర్

author img

By

Published : Sep 17, 2020, 2:12 PM IST

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఓం బిర్లాతో... పార్లమెంట్ ఆవరణలో ఎంపీ సంతోష్ కుమార్ మొక్కలు నాటించారు. ఈ కార్యక్రమంలో తెరాస ఎంపీలు కేకే, నామా, ప్రభాకర్​రెడ్డి పాల్గొన్నారు.

lok-sabha-speaker-om-birla-participated-in-green-india-challenge-at-parliament
గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో పాల్గొన్న లోక్​సభ స్పీకర్

తెరాస ఎంపీ జోగినపల్లి సంతోష్​కుమార్ శ్రీకారం చుట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్​ దిగ్విజయంగా కొనసాగుతోంది. ప్రజాప్రతినిధులు, సెలబ్రెటీలు ఈ ఛాలెంజ్​ తీసుకుని మొక్కలు నాటి... పర్యావరణం పట్ల తమ ప్రేమను చాటుకుంటున్నారు. ఈ క్రమంలో లోక్​సభ స్పీకర్ ఓం బిర్లా గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో పాల్గొన్నారు.

పార్లమెంట్ ఆవరణలో ఎంపీ సంతోష్ కుమార్ కోరిక మేరకు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కేకే, నామా, ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.

ఇదీ చూడండి: గ్రీన్ ​ఇండియా ఛాలెంజ్ : ​మొక్కలు నాటిన మెగా బ్రదర్స్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.