ETV Bharat / state

నీరా పాలసీ వస్తుందంటే నమ్మలేదు: మంత్రి శ్రీనివాస్ గౌడ్

author img

By

Published : Jul 23, 2020, 1:12 PM IST

కల్లుగీత కార్మికులు వృత్తి పన్ను రద్దు కోసం ఎన్నో పోరాటాలు చేశారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఏ ప్రభుత్వమూ తీసుకోని నిర్ణయాన్ని కేసీఆర్ తీసుకున్నారని... పన్ను బకాయిలను రద్దు చేశారని వెల్లడించారు. మంత్రి కేటీఆర్​తో కలిసి నెక్లెస్​రోడ్​లో నీరాస్టాల్​ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

laid-foundation-for-the-construction-of-first-ever-neera-cafe-in-necklace-road
నీరా పాలసీ వస్తుందంటే నమ్మలేదు: మంత్రి శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్డులో నీరా స్టాల్‌ నిర్మాణానికి మంత్రులు కేటీఆర్‌, శ్రీనివాస్‌ గౌడ్‌ శంకుస్థాపన చేశారు. వేల ఏళ్ల క్రితం నుంచి కల్లు గీత వృత్తి ఉందని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ పేర్కొన్నారు. గీతవృత్తికి అనుబంధంగా ఎన్నో వృత్తులు అభివృద్ధి చెందాయని వ్యాఖ్యానించారు.

''కల్లుగీత వృత్తి పన్ను రద్దు కోసం ఎన్నో పోరాటాలు జరిగాయి. ఏ ప్రభుత్వమూ తీసుకోని నిర్ణయాన్ని సీఎం కేసీఆర్‌ తీసుకున్నారు. గత పాలకులు కల్లు దుకాణాలు మూసివేయించి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. ప్రమాదవశాత్తు మరణించిన కల్లుగీత కార్మికులకు ఈ ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారం ఇస్తోంది. హరితహారంలో కూడా ఈత చెట్లు నాటుతూ కేసీఆర్ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. నగరంలో ప్రముఖ స్థలంలో నీరా స్టాల్‌ ఏర్పాటుకు స్థలం కేటాయించారు. కొందరు కల్లుగీత వృత్తిని కుట్రపూరితంగా దెబ్బతీశారు. కుల వృత్తుల వారి ఆత్మగౌరవం కాపాడేందుకు సీఎం ఎన్నో చర్యలు చేపట్టారు.''

-మంత్రి శ్రీనివాస్ గౌడ్

నీరా పాలసీ వస్తుందంటే నమ్మలేదు: మంత్రి శ్రీనివాస్ గౌడ్

నీరా పాలసీ వస్తుందంటే చాలా మంది గౌడ నేతలు నమ్మలేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, సీఎస్ సోమేశ్ కుమార్ పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.