ETV Bharat / state

KTR Respond to Election Schedule : 'తెలంగాణలో ఎన్నిక ఏకపక్షమే..! భారీ విజయం.. బీఆర్‌ఎస్‌దే..!'

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 9, 2023, 7:13 PM IST

KTR Latest Tweet
KTR Respond to Election Schedule in Telangana

KTR Respond to Election Schedule : తెలంగాణలో ముచ్చటగా మూడోసారి కూడా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే వస్తుందని మంత్రి కేటీఆర్‌ జోస్యం చెప్పారు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదల అయిన సందర్భంగా కేటీఆర్‌ కవితాత్మకంగా పలు కొటేషన్‌లను తన అధికార ఎక్స్‌(ట్విటర్‌) ఖాతాలో ట్వీట్‌ చేశారు. యుద్ధానికి ముందే కాంగ్రెస్ అస్త్ర సన్యాసం చేసిందని.. బీజేపీ పోటీకి ముందే కాడి పడేసిందని వ్యాఖ్యానించారు.

KTR Respond to Election Schedule : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ సెంచరీ కొట్టి భారీ విజయం సాధిస్తుందని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ మూడో సారి ముఖ్యమంత్రై.. దక్షిణ భారతంలోనే సరికొత్త అధ్యాయం సృష్టిస్తారని పేర్కొన్నారు. పదేళ్ల సమగ్ర ప్రగతి ప్రస్థానమే ఈ ఎన్నికలను శాసించబోతోదంన్నారు. సమరానికి బీఆర్‌ఎస్‌ సర్వ సన్నద్ధంగా ఉందని తెలిపారు. యుద్ధానికి ముందే కాంగ్రెస్ అస్త్ర సన్యాసం చేసిందని.. బీజేపీ పోటీకి ముందే కాడి పడేసిందని ఎద్దేవా చేశారు.

KTR Tweet on Assembly Elections : అసెంబ్లీ ఎన్నికల(Telangana Assembly Elections)కు బీఆర్‌ఎస్‌ సర్వసన్నద్ధంగా ఉందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌(Minister KTR) పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఏకపక్షమేనని.. భారీ విజయం బీఆర్‌ఎస్‌దేనని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు రెండు సార్లు నిండు మనసుతో ఆశీర్వదించారని.. మూడోసారి విజయం తమదేనన్నారు. డిసెంబర్ 3న వచ్చే ఫలితాల్లో.. కేసీఆర్ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు.

BRS Election Agenda 2023 : దక్షిణ భారతంలోనే కేసీఆర్ సరికొత్త అధ్యాయం సృష్టిస్తారని కేటీఆర్ అన్నారు. దక్షత గల నాయకత్వానికే మరోసారి పట్టం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పదేళ్ల ప్రగతి తమ పాశుపతాస్త్రమని.. విశ్వసనీయతే విజయ మంత్రమని కేటీఆర్ పేర్కొన్నారు. జన నీరాజనంతో గులాబీదే ప్రభంజనమన్న కేటీఆర్.. ప్రతి ఘాతుక ప్రతిపక్షాలకు మళ్లీ పరాభవం తప్పదన్నారు. కేసీఆర్ కెప్టెన్ అని.. అందువల్లే తమ టీంలో హుషారు ఉందన్నారు. తమ మూడో విజయంతో ప్రతిపక్షాలు బేజారవుతాయన్నారు.

  • తెలంగాణలో ఎన్నిక ఏకపక్షమే..!
    భారీ విజయం.. భారత రాష్ట్ర సమితిదే..!

    రెండు సార్లు నిండుమనసుతో ప్రజాఆశీర్వాదం..!
    మూడోసారి మనదే జయం..!

    డిసెంబర్ మూడున వచ్చే ఫలితాల్లో
    ముచ్చటగా మూడోసారి గెలిచేది
    మనసున్న ముఖ్యమంత్రి కేసిఆర్ గారే..!

    దక్షిణ భారతంలోనే సరికొత్త అధ్యాయం
    దక్షత గల…

    — KTR (@KTRBRS) October 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

KTR Speech At Hanumakonda Public Meeting : 'తెలంగాణలో కేసీఆర్ మూడోసారి సీఎం అవ్వడం ఖాయం'

KTR Latest Tweet : మంచి చేసే బీఆర్‌ఎస్‌కే ప్రజలు ఓటు వేస్తారని.. ముంచే పార్టీలపై వేటు తప్పదన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వేళ.. గులాబీ శ్రేణుల సమరోత్సహంతో.. తెలంగాణ కదం తొక్కుతోందని కేటీఆర్ కవితాత్మక ధోరణితో ట్వీట్ చేశారు. ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకు గుండె గుండెలో గులాబీ జెండా ఎగురుతోందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో గాంధీ సిద్ధాంతం తప్ప.. గాడ్సే రాద్దాంతం నడవదని విమర్శించారు.

KTR Reaction on Election Schedule : రాష్ట్రంలో 2014 తొలి అసెంబ్లీ ఎన్నికను ఉద్యమ చైతన్యం నడిపించగా.. 2018లో రెండో ఎన్నికను సంక్షేమ సంబురం గెలిపించిందని కేటీఆర్ అన్నారు. ఇప్పుడు 2023లో మూడో ఎన్నికను ముమ్మాటికీ.. పదేళ్ల సమగ్ర ప్రగతి ప్రస్థానం శాసిస్తుందని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్‌ వంద స్థానాలను సాధించి తన పాత రికార్డులు తిరగరాస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్‌తోనే తెలంగాణ చరిత.. కేసీఆర్‌తోనే తెలంగాణకు భవిత.. అఖండ విజయం మనదే కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

Minister KTR Warangal Tour : 'పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు తప్పకుండా ఆశీర్వదిస్తారు'

KTR Tweet on PM Modi : 'మోదీ జీ.. మా 3 ప్రధాన హామీల సంగతేంటి?'

KTR Reacts to Modi Comments On BRS BJP Alliance : 'డిపాజిట్ రాని బీజేపీతో మాకు పొత్తా.. మేము పోరాడేవాళ్లమే తప్ప మోసంచేసే వాళ్లం కాదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.