ETV Bharat / state

KTR on Manipur Incident : 'మణిపుర్​ ఘటన అనాగరికం.. మోదీ జీ, అమిత్‌ షా ఎక్కడ?'

author img

By

Published : Jul 20, 2023, 12:49 PM IST

KTR on Manipur Viral Video : మణిపుర్​లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. స్త్రీలను ఊరేగించి లైంగిక వేధింపులకు గురి చేయడం అనాగరికమని.. దేశంలో అనాగరికత ఎలా సాధారణంగా మారిపోయిందో చెప్పడానికి ఈ బాధాకర ఘటన ఉదాహరణగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు మంత్రి ట్వీట్ చేశారు.

KTR on Manipur Incident
KTR on Manipur Incident

KTR Tweet on Manipur women naked parade Incident : జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపుర్​​లో తాజాగా మరో దారుణం వెలుగులోకి వచ్చింది. కొంతమంది పురుషులు ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. మే 4న జరిగిన ఈ అమానవీయ ఘటన తాజాగా వీడియో వెలుగులోకి రావడంతో సంచలనంగా మారింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై భగ్గుమంటున్నాయి. సామాజిక మాధ్యమాల్లో సోషల్ మీడియా వేదికగా అనేక మంది ఈ దారుణాన్ని ఖండిస్తున్నారు. ప్రధాని మోదీ సైతం ఘటనపై తీవ్రంగా స్పందించారు. మహిళల పట్ల ఇలా వ్యవహరించడం దేశానికి సిగ్గుచేటన్న మోదీ.. నిందితులను వదిలిపెట్టబోమంటూ స్పష్టం చేశారు. తాజాగా మంత్రి కేటీఆర్ సైతం ఈ ఘటనపై స్పందించారు.

  • We Indians were raging against Taliban when they were disrespecting children & women

    Now in our own country, Kuki women being paraded naked and sexually assaulted by the Meitei mob in Manipur is a distressing & nauseous reminder of how barbarism has been normalised in new India…

    — KTR (@KTRBRS) July 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

KTR Tweet on Manipur Incident : మన దేశంలోనే.. మణిపుర్​లో మెయిటీ గుంపు ద్వారా కుకీ స్త్రీలను నగ్నంగా ఊరేగించి లైంగిక వేధింపులకు గురి చేయడం అనాగరికమని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. దేశంలో అనాగరికత ఎలా సాధారణంగా మారిపోయిందో చెప్పడానికి ఈ బాధాకర ఘటన ఉదాహరణగా నిలుస్తుందన్నారు. ఈ భయానక హింసాకాండ.. శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బ తినడాన్ని కేంద్ర ప్రభుత్వం మౌనంగా చూస్తోందని తీవ్రంగా మండిపడ్డారు. మణిపుర్​లో ప్రతి పరువు మంటగలుస్తోన్న సమయంలో.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జీ, హోం మంత్రి అమిత్‌ షా జీ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ఈ మేరకు కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

''మన దేశంలోనే.. మణిపుర్‌లో మెయిటీ గుంపు ద్వారా కుకీ స్త్రీలను నగ్నంగా ఊరేగించి లైంగిక వేధింపులకు గురి చేయడం అనాగరికం. దేశంలో అనాగరికత ఎలా సాధారణంగా మారిపోయిందో చెప్పడానికి ఈ బాధాకర ఘటన ఉదాహరణ. ఈ భయానక హింసాకాండ.. శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బ తినడాన్ని కేంద్ర ప్రభుత్వం మౌనంగా చూస్తోంది. మణిపుర్‌లో ప్రతి పరువు మంటగలుస్తున్న సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీ, హోం మంత్రి అమిత్‌ షా జీ ఎక్కడ ఉన్నారు.'' - కేటీఆర్‌ ట్వీట్‌

సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు..: ఈ అమానవీయ ఘటనను సుప్రీం సుమోటోగా స్వీకరించింది. ఇలాంటి దారుణ ఘటన ఏమాత్రం ఆమోద యోగ్యం కాదని వ్యాఖ్యానించింది. వర్గ కలహాల ప్రాంతంలో మహిళలను సాధనంగా ఉపయోగించడం రాజ్యాంగ దుర్వినియోగంలో అత్యంత దారుణమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ డీవై చంద్రచూడ్​ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో వల్ల తాము తీవ్ర ఆందోళనకు గురయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే.. తామే తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వం చర్యలు తీసుకునే సమయం ఇదేనని.. నేరస్థులను శిక్షించేందుకు ఏం చర్యలు తీసుకున్నారో తమకు తెలియజేయాలని కేంద్రం, మణిపుర్ ప్రభుత్వానికి ఆయన ఆదేశించారు.

ఇవీ చూడండి..

మణిపుర్​లో నగ్నంగా ఇద్దరు మహిళలు ఊరేగింపు.. సుమోటోగా స్వీకరించిన సుప్రీం

Husband attacked wife At JubileeHills : భార్యపై అనుమానం.. బీర్​సీసాతో దాడి చేసిన భర్త.. చివరికి ఏమైందంటే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.