ETV Bharat / state

KTR on IT Sector : బెంగళూరుతో పోటీపడేలా హైదరాబాద్‌ను నిలబెట్టాం: కేటీఆర్‌

author img

By

Published : Jun 5, 2023, 3:10 PM IST

Updated : Jun 5, 2023, 4:34 PM IST

KTR
KTR

15:05 June 05

బెంగళూరుతో పోటీపడేలా హైదరాబాద్‌ను నిలబెట్టాం: కేటీఆర్‌

ఐటీ, అనుబంధ రంగాలకు హైదరాబాద్‌ గమ్యస్థానం

KTR Released Annual Report IT Sector : ఐటీ రంగంలో హైదరాబాద్‌ దూసుకుపోతోందని ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. బెంగళూరుతో పోటీపడేలా హైదరాబాద్‌ను నిలబెట్టామని వివరించారు. 2013-14 హైదరాబాద్‌లో ఐటీ ఉత్పత్తులు రూ.56,000 కోట్లని.. ప్రస్తుతం రూ.1.8 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు సాధించామని తెలిపారు. కరోనా వచ్చాక ఐటీ రంగంపై అనేక అపోహలు వచ్చాయని అన్నారు. టీ-హబ్‌లో ఐటీశాఖ వార్షిక నివేదికను ఆయన విడుదల చేశారు.

KTR on IT Sector : ఐటీ రంగంలో కేంద్రం నుంచి సహకారమేమీ లేదని కేటీఆర్ విమర్శించారు. మాట సాయం తప్ప కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అండదండలు అందించలేదని ఆరోపించారు. అనేక అమెరికా కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెడుతున్నాయని.. అమెరికాకు చెందిన క్వాల్‌కామ్‌.. పెట్టుబడులు పెడుతోందని చెప్పారు. గూగుల్‌ కూడా ఇక్కడ అతిపెద్ద కేంద్రం నిర్మిస్తోందని వివరించారు. భారత్ కంపెనీ ఎల్‌టీఐ మైండ్ ట్రీ కంపెనీ వరంగల్‌లో పెట్టుబడులు పెట్టనున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు.

  • Robotics Service in Hyderabad రోబోటిక్స్‌కు కేరాఫ్​ అడ్రస్​గా హైదరాబాద్​

Annual Report IT Sector : ఈ క్రమంలోనే గ్రిడ్ డైనమిక్స్‌ సంస్థ హైదరాబాద్‌లో పెట్టుబడులు పెడుతోందని కేటీఆర్ తెలిపారు. జర్మనీ కంపెనీ బాష్‌.. నగరంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిందని వివరించారు. సైబర్ నేరాలు అరికట్టేందుకు సైబర్ క్రైమ్‌ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ తెస్తున్నామని పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్‌ కూడా వస్తోందని చెప్పారు. ఐటీ రంగం దూసుకెళ్లేందుకు తమ టీమ్ బాగా పనిచేస్తోందని కేటీఆర్ వివరించారు. లండన్ స్టాక్‌ ఎక్స్ఛేంజ్ గ్రూప్‌ కేంద్రం ఈ ఏడాది నగరానికి వస్తుందన్నారు. మరో రెండేళ్లలో డజోన్‌ ప్రోడక్ట్ డెవలప్‌మెంట్ సెంటర్ వస్తోందని అన్నారు.

అమెరికాకు చెందిన వార్నర్ బ్రదర్స్‌ డిస్కవరీ.. హైదరాబాద్‌లో ఐడీసీ నిర్మిస్తోందని కేటీఆర్ వివరించారు. అమెరికాకు చెందిన జాప్‌కామ్‌ సెంటర్ నగరానికి వస్తోందని చెప్పారు. టెక్నిప్‌ఎఫ్‌ఎంసీ కంపెనీ సెంటర్ రానున్నట్లు తెలిపారు. అలైంట్ గ్రూప్‌ సెంటర్‌ వస్తోందని.. తద్వారా 9,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. స్పోర్ట్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, టూరిజం రంగాల్లో పెట్టుబడులు వస్తున్నాయని కేటీఆర్ వెల్లడించారు.

ఐటీఐఆర్‌ ప్రాజెక్టును రద్దు చేసినా ఐటీలో ప్రగతి సాధించాం.జాతీయ సగటు కన్నా ఎక్కువగా ఐటీలో వృద్ధి.ఐటీ, అనుబంధ రంగాలకు హైదరాబాద్‌ గమ్యస్థానం. వరంగల్‌కు టెక్‌మహీంద్ర, జెన్‌ప్యాక్‌ వంటి సంస్థలు వస్తున్నాయి. మహబూబ్‌నగర్‌లోనూ కొన్ని సంస్థలు కార్యాలయాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. నల్గొండ వంటి టైర్‌2 పట్టణాలకు పరిశ్రమలు వస్తున్నాయి. వాషింగ్టన్‌లో అనేక మంది పారిశ్రామిక వేత్తలతో సమావేశమయ్యాను.బెల్లంపల్లిలో పెట్టుబడులకు రెండు వాషింగ్టన్‌ సంస్థలు ముందుకువచ్చాయి. నల్గొండ, సిద్దిపేట, సిరిసిల్ల వంటి పట్టణాలకు కొత్త సంస్థలు వస్తున్నాయి. ఫాక్స్‌కాన్‌ సంస్థ.. లక్ష ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చింది. త్వరలోనే ఈ మొబిలిటీ వీక్‌ నిర్వహించబోతున్నాం. - కేటీఆర్, ఐటీశాఖ మంత్రి

ఇవీ చదవండి: Minister KTR US Tour Ended 2 వారాలు 80కి పైగా సమావేశాలు 42 వేల ఉద్యోగాలు

Ktr Us Tour Updates : హైదరాబాద్​లో స్టెమ్​క్యూర్స్ 54 మిలియన్ డాలర్ల పెట్టుబడి

Last Updated : Jun 5, 2023, 4:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.