ETV Bharat / state

కేటాయింపునకు మించి నీటిని వాడుకున్నారు: ఏపీకి కృష్ణా బోర్డు లేఖ

author img

By

Published : Aug 18, 2020, 7:30 PM IST

Updated : Aug 18, 2020, 8:02 PM IST

krishna-water-board-letter-to-ap
కేటాయింపునకు మించి నీటిని వాడుకున్నారు: ఏపీకి కృష్ణా బోర్డు లేఖ

19:28 August 18

కేటాయింపునకు మించి నీటిని వాడుకున్నారు: ఏపీకి కృష్ణా బోర్డు లేఖ

       నీటి విడుదల ఉత్తర్వులను గౌరవించాలని, పొరుగు రాష్ట్రం నుంచి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని ఆంధ్రప్రదేశ్​కు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సూచించింది. ఈ మేరకు ఏపీ జలవనరులశాఖ ఈఎన్​సీకి బోర్డు సభ్యకార్యదర్శి లేఖ రాశారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 9 టీఎంసీల నీటి విడుదలకు ఉత్తర్వులు జారీ చేశామని, అయితే ఈ నెల 17వ తేదీ వరకు 9.517 టీఎంసీల నీటిని వినియోగించుకున్నారని, ఇంకా నీటివిడుదల కొనసాగుతోందని బోర్డు లేఖలో పేర్కొంది. నీటి విడుదలకు సంబంధించి ఉత్తర్వులను పూర్తి స్థాయిలో పాటించాలని బోర్డు తెలిపింది.

ఇవీ చూడండి: కృష్ణమ్మ పరవళ్లు... జూరాల ప్రాజెక్టు 39 గేట్లు ఎత్తివేత

Last Updated : Aug 18, 2020, 8:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.