ETV Bharat / state

ఎంత నీరు అవసరమో చెప్పండి: కృష్ణా బోర్డు

author img

By

Published : Dec 26, 2020, 2:29 PM IST

తెలుగు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే లేఖ రాశారు. వచ్చే ఏడాదికి ఎంత మేరకు కృష్ణా నది జలాలు అవసరమో తెలపాలని లేఖలో పేర్కొన్నారు. కావాల్సిన నీటి వాటాలను జనవరి 8 లోగా చెప్పాలని కోరారు.

krishna-board-letter-to-telegu-state-heads
ఎంత నీరు అవసరమో చెప్పండి: కృష్ణా బోర్డు

వచ్చే ఏడాది మార్చి వరకు ఎంత మేరకు కృష్ణా నది జలాలు అవసరమో తెలపాలంటూ రెండు తెలుగు రాష్ట్రాలను కృష్ణా బోర్డు కోరింది. ఈ మేరకు రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌లకు బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే తాజాగా లేఖ రాశారు. జనవరిలో త్రిసభ్యకమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.

జనవరి 8 లోగా కావాల్సిన నీటి వాటాలను పేర్కొనాలని, అదే సమయంలో ఈ ఏడాది డిసెంబరు వరకు ఎంత మేరకు కృష్ణా జలాలను వినియోగించుకున్నారనే వివరాలు కూడా సమర్పించాలని కోరారు.

ఇదీ చదవండి: విధ్వంసానికి 16 ఏళ్లు... స్థానికుల నివాళి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.