ETV Bharat / state

Kishan Reddy : ' పీఎం కిసాన్ సేవా కేంద్రాల్లో.. అన్ని సేవలు ఒకే చోట'

author img

By

Published : Jul 26, 2023, 2:02 PM IST

Updated : Jul 26, 2023, 3:54 PM IST

Kishanreddy
Kishanreddy

Kishanreddy on PM Kisan Seva Centers : ప్రధానమంత్రి కిసాన్ సేవా కేంద్రాల్లో నాణ్యమైన ఎరువులు, విత్తనాలు నిర్ధేశిత ధరలతో అందుబాటులో ఉంటాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి వెల్లడించారు. రైతులకు కావాల్సిన అన్ని సేవలను ఒకేచోట కల్పించేందుకు ఎరువుల రిటైల్‌ షాపులను ఈ కేంద్రాలుగా మారుస్తున్నామని తెలిపారు. ప్రధాని మొదటి దశలో రేపు ఒక లక్ష 25వేల షాపులను ప్రారంభిస్తారని తెలిపారు.

Kishanreddy Latest Comments : బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి కిషన్​రెడ్డి... హైదరాబాద్​లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్రమంత్రి కిషన్​రెడ్డి... ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమ పార్టీ చేపట్టనున్న కార్యక్రమాలను వివరించారు. అదేవిధంగా బీఆర్ఎస్, కాంగ్రెస్​లపై ఆరోపణలు గుప్పించారు. రేపు ప్రారంభించనున్న ప్రధానమంత్రి కిసాన్ సేవా కేంద్రాల గురించి పలు విషయాలు వెల్లడించారు.

Kishanreddy on PM Kisan Seva Centers : రైతులకు కావాల్సిన అన్ని సేవలను ఒకే చోట కల్పించేందుకు ఎరువుల రిటైల్ దుకాణాలను ప్రధానమంత్రి కిసాన్ సేవా కేంద్రాలుగా మారుస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి పేర్కొన్నారు. ఈ కేంద్రాలను రేపు ప్రధాని మోదీ రాజస్థాన్​లో ప్రారంభిస్తారన్నారు. నాణ్యమైన ఎరువులు, విత్తనాలు నిర్దేశిత ధరలతో ఈ సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. అదేవిధంగా ఈ పీఎం కిసాన్ సేవా కేంద్రాల్లో భూసార పరీక్షలు, విత్తన పరీక్షలు నిర్వహిస్తారన్నారన్న ఆయన.. వ్యవసాయానికి కావాల్సిన పరికరాల అమ్మకాలు, కిరాయికి ఇక్కడ అందుబాటులో ఉంటాయని తెలిపారు.

'వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పిస్తాం. గురువారం నుంచి 'రైతు వద్దకు బీజేపీ' కార్యక్రమం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను రైతులకు వివరిస్తాం. 2.8 కోట్ల దుకాణాలను కిసాన్‌ సమృద్ధి కేంద్రాలుగా అప్‌గ్రేట్‌ చేస్తాం. వీటిలో తొలిదశలో రేపు లక్షా 25 వేల షాపులను ప్రధాని ప్రారంభిస్తారు. రేపటి నుంచి సల్ఫర్‌ కోటెడ్‌ యూరియాను అందుబాటులోకి తెస్తున్నాం. రేపు 14వ విడత కిసాన్‌ సమ్మాన్‌ నిధులను ప్రధాని రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. గురువారం రోజున 8.5 కోట్ల రైతుల ఖాతాల్లో రూ. 17,500 కోట్లు ప్రధాని జమ చేస్తారు. తెలంగాణలోని 39లక్షల మంది రైతుల ఖాతాల్లో కిసాన్ సమ్మాన్ డబ్బులు జమకానున్నాయి'-కిషన్​రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

PM Kisan Seva Centers Hyderabad : బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎక్కడా ఎరువుల కొరత లేదని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి వ్యాఖ్యానించారు. 'ఒకే దేశం-ఒకే ఎరువు' నినాదంతో భారత్ బ్రాండ్ పేరుతో రేపటి నుంచి అమలులోకి వస్తుందన్నారు. ఎరువులను పిచికారి చేసే డ్రోన్లను జిల్లా కేంద్రాల్లో రేపటి నుంచి అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ప్రతి నెల రెండో ఆదివారం రైతులతో ముచ్చట కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు. కేంద్రం తొమ్మిదేళ్ల నుంచి రైతులకు కనీస మద్దతు ధర కల్పించి ఆదుకుంటుందని కిషన్​రెడ్డి స్పష్టం చేశారు.

కాంగ్రెస్, బీఆర్​ఎస్, మజ్లిస్ ఒక్కటే : కాంగ్రెస్, బీఆర్​ఎస్, మజ్లిస్ ఒక్కటేనన్న కిషన్​రెడ్డి.. గతంలో కలిసి పని చేశారు.. భవిష్యత్​లోనూ కలిసి పని చేస్తారని ఆరోపించారు. ఈ మూడు పార్టీలు కుటుంబ, అవినీతి పార్టీలన్న ఆయన.. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. కాంగ్రెస్, బీఆర్ఎస్​లను శాసిస్తూ.. మజ్లిస్ రాష్ట్రాన్ని పాలిస్తుందని కిషన్​రెడ్డి ఫైర్ అయ్యారు. అవిశ్వాస తీర్మానం మీద కాంగ్రెస్, బీఆర్ఎస్ సంతకం చేయడంపై ఏమి ఆశ్చర్యం కలగడం లేదన్న ఆయన.. దిల్లీలో జరుగుతున్న డ్రామాను అందరూ అర్థం చేసుకోవాలన్నారు. ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం బీజేపీతోనే సాధ్యమని పేర్కొన్నారు.

' పీఎం కిసాన్ సేవా కేంద్రాల్లో.. అన్ని సేవలు ఒకే చోట'

ఇవీ చదవండి :

Last Updated :Jul 26, 2023, 3:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.