ETV Bharat / state

'ఖద్దరు - ఖాకీ దోచుకో దాచుకో' కరపత్రాల కలకలం.. ఎక్కడంటే?

author img

By

Published : Feb 13, 2023, 5:58 PM IST

Khaddar - Khaki Loot and hide Pamphlets: ఏపీలోని అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో 'ఖద్దరు - ఖాకీ దోచుకో దాచుకో' అన్న కరపత్రాలు కలకలం రేపాయి. పెన్నా నది పరివాహక ప్రాంతంలో ఇసుకలో నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్నారంటూ కరపత్రంలో రాశారు. తాడిపత్రి నియోజకవర్గం ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, తాడిపత్రి డీఎస్పీ చైతన్యల పేర్లను ప్రస్తావిస్తూ కరపత్రాల్లో ఆరోపణలు చేశారు.

Khaddar - Khaki Loot and hide Pamphlets
Khaddar - Khaki Loot and hide Pamphlets

Khaddar - Khaki Loot and hide Pamphlets: ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో 'ఖద్దరు - ఖాకీ దోచుకో దాచుకో' అన్న కరపత్రాలు కలకలం రేపాయి. పెన్నా నది పరీవాహక ప్రాంతంలో ఇసుకలో నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్నారంటూ కరపత్రంలో రాశారు. తాడిపత్రి నియోజకవర్గం ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, తాడిపత్రి డీఎస్పీ చైతన్యల పేర్లను ప్రస్తావిస్తూ కరపత్రాల్లో ఆరోపణలున్నాయి.

గుర్తు తెలియని వ్యక్తులు తాడిపత్రి పట్టణంలోని జనం గూడే ప్రాంతాల్లో ఈ కరపత్రాలను వేశారు. ఉదయం లేచిన పట్టణ ప్రజలు కరపత్రాలను చదువుతూ కనపడ్డారు. పెన్నా నది పరివాహక ప్రాంతంలో ఇసుకలో నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్నారంటూ కరపత్రంలో రాశారు.

తాడిపత్రి ఎమ్మెల్యే, డీఎస్పీలపై ఆరోపణలు..: తాడిపత్రి నియోజకవర్గం ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, తాడిపత్రి డీఎస్పీ చైతన్యల పేర్లను ప్రస్తావిస్తూ కరపత్రాల్లో ఆరోపణలున్నాయి. పెద్దపప్పూరు మండలం పెన్నా నది పరివాహక ప్రాంతంలో విచ్చలవిడిగా ఇసుకను తరలిస్తున్నారని తెలిపారు. పేరుకే జయ ప్రకాష్ పవర్ వెంచర్స్ కంపెనీపై టెండర్ తీసుకొని అనుమతులకు విరుద్ధంగా ఇసుకను తరలిస్తున్నారని పేర్కొన్నారు.

ఇసుక తరలింపుతో భవిష్యత్తులో చాగల్లు ప్రాజెక్టు సమీపంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని కరపత్రంలో ఆందోళన వ్యక్తమైంది. ఇసుక తరలింపుతో చాగల్లు ప్రాజెక్టు ముఖచిత్రాన్ని మార్చేసేలా తరలింపు చేపట్టారని విమర్శలున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలిస్తున్నారని ఆరోపించారు. గతంలో తెదేపా నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, సీపీఐ నేతలు ప్రాంతాన్ని పరిశీలించి నిరసన చేపట్టిన ఫొటోలను కరపత్రాల్లో ముద్రించారు.

కరపత్రాలపై తీవ్రంగా చర్చ..: పట్టణంలో కరపత్రాలు కనబడటంతో అందులో ఇసుక తరలింపుపై ప్రస్తావించిన అంశాలను చదివిన ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రస్తుతం పట్టణంలో ఈ కరపత్రాలు ఎవరు వేశారో.. అన్న అంశంపై చర్చ సంచలనంగా మారింది.

ఇవీ చదవండి:

ఖేలో ఇండియా వింటర్ గేమ్స్‌లో తెలంగాణ అమ్మాయి సత్తా

తెలంగాణ ఏర్పాటు తర్వాత గణనీయంగా అప్పులు పెరిగాయన్న కేంద్రం

ఇతడిని ప్రేమించింది.. అతడిని పెళ్లి చేసుకుంది.. చివరికి ఎటూ కాక..!

అదానీ వివాదంపై ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు కేంద్రం అంగీకారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.