ETV Bharat / state

కొత్త చట్టాలు వచ్చినా అవే ఘోరాలు: జస్టిస్​ చలమేశ్వర్​

author img

By

Published : Dec 4, 2019, 6:28 PM IST

హైదరాబాద్​ హిమాయత్​నగర్​లోని సీపీఐ కార్యాలయంలో 'మహిళల రక్షణ-సవాళ్లు... దిశానిర్దేశం' అనే అంశంపై సమావేశం జరిగింది. శిక్షలు తాత్కాలిక ఉపశమనమేనని సదస్సులో వక్తలు అభిప్రాయపడ్డారు. దిశలాంటి ఘటనలను అడ్డుకోవటం సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తుచేశారు.

JUSTICE CHELAMESWAR RESPONDED ON DISHA INCIDENT
JUSTICE CHELAMESWAR RESPONDED ON DISHA INCIDENT

నిర్భయ ఘటన జరిగినప్పుడు కొత్త చట్టాలు తెచ్చినా ఇంకా అలాంటి ఘోరాలు జరుగుతూనే ఉన్నాయని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. నీలం రాజశేఖర రెడ్డి రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో.. హైదరాబాద్​ హిమాయత్​నగర్​లోని సీపీఐ కార్యాలయంలో 'మహిళల రక్షణ-సవాళ్లు... దిశానిర్దేశం' అనే అంశంపై సమావేశం నిర్వహించారు. జస్టిస్ చలమేశ్వర్​తో పాటు సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, విశ్రాంత ఐపీఎస్ అధికారి అంజయనేయరెడ్డి, ప్రముఖ స్త్రీ వాద రచయిత ఓల్గా తదితరులు పాల్గొన్నారు.

శాంతి భద్రతలు కాపాడటం ప్రభుత్వాల మౌలిక బాధ్యత అని జస్టిస్​ చలమేశ్వర్​ తెలిపారు. ఉరిశిక్షలతో నేరాలు తగ్గవని విశ్రాంత ఐపీఎస్​ అధికారి అంజనేయరెడ్డి అభిప్రాయపడ్డారు. నిందితులను తక్షణమే చంపేయాలని డిమాండ్​ చేయటం సరైనది కాదన్నారు.

దేశంలో నిమిషానికి 15 నుంచి 30 మంది మహిళలు అత్యాచారానికి గురవుతున్నారని ప్రముఖ రచయిత్రి ఓల్గా ఆవేదన చెందారు. రాత్రిళ్లు మహిళల బయటకు రాలేని విధంగా దేశం మారుతోందన్నారు. శిక్షలు తాత్కాలిక ఉపశమనమేనని పేర్కొన్నారు. దిశ మీద అత్యాచారం చేసిన నలుగురిని అటు వైపు తీసుకెళ్లింది... సమాజమేనని ఓల్గా అభిప్రాయపడ్డారు.

కొత్త చట్టాలు వచ్చిన అవే ఘోరాలు: జస్టిస్​ చలమేశ్వర్​

ఇవీ చూడండి: ప్రేమ పెళ్లి.. 10 రోజులకే వివాహిత అనుమానాస్పద మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.