హైదరాబాద్‌లో మరోసారి ఐటీ దాడుల కలకలం - ప్రముఖ ఫార్మా కంపెనీ డైరెక్టర్ల ఇళ్లల్లో సోదాలు!

హైదరాబాద్‌లో మరోసారి ఐటీ దాడుల కలకలం - ప్రముఖ ఫార్మా కంపెనీ డైరెక్టర్ల ఇళ్లల్లో సోదాలు!
IT Raids in Hyderabad : హైదరాబాద్‌లో గత కొన్ని రోజులుగా ఐటీ సోదాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీ నేతలే లక్ష్యంగా తనిఖీలు జరగ్గా.. ఇవాళ ఓ ప్రముఖ ఫార్మా కంపెనీపైన ఐటీ శాఖ సోదాలు నిర్వహిస్తోంది. నగరవ్యాప్తంగా 10 బృందాలుగా విడిపోయిన అధికారులు.. ఫార్మా కంపెనీ డైరెక్టర్ల ఇళ్లతో పాటు కార్యాలయాలు, సిబ్బంది నివాసాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.
IT Raids in Hyderabad : హైదరాబాద్‌లో కొన్ని రోజులుగా ఐటీ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవలే కాంగ్రెస్ నాయకుల ఇళ్లల్లో ఐటీ సోదాలు జరిగిన విషయం తెలిసిందే. తాజాగా నగరంలోని పలుచోట్ల మరోసారి ఐటీ దాడుల కలకలం రేగింది. 10 బృందాలుగా విడిపోయిన ఐటీ అధికారులు ఓ ప్రముఖ ఫార్మా కంపెనీ డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాలు, సిబ్బంది నివాసాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆర్సీపురంలోని నాగులపల్లి, అమీన్‌పూర్‌లోని పటేల్‌గూడలో అధికారులు సోదాలు(IT EMPLOYEES RAIDS) చేస్తున్నారు. గచ్చిబౌలిలోని మైహోమ్ భుజాలో కూడా తనిఖీలు చేస్తున్నారు. ఫార్మా కంపెనీ డైరెక్టర్లు బ్యాంకు వివరాలు, ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తున్నారు.

Loading...